S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/12/2015 - 00:08

జీవుడు ఈశ్వరుని అంశ. కాననే అతడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖములకు నిధానముగా ఉంటాడు. జీవుడు మాయకు వశుడై చిలుకవలె, కోతివలె తనకు తానుగా బంధాలలో చిక్కుకుంటాడు. బాధలు అనుభవిస్తూ వుంటాడు. ఈ రీతిగా జడము చేతనములు ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. అసత్యమైన ఆ ముడి నుండి బయటపడి ముక్తిని పొందుట ఎంతో కష్టము. అపుడు జీవుడు జనన మరణ చక్రములో చిక్కుపడును. ఆ ముడి విడువదు, సుఖములూ కలుగవు.

12/10/2015 - 04:46

రుద్రార్చనలో చాలా విశేషములు గలవు. ‘రుద్రోవైక్రూర’ అని వేదంలో ఒక చోట వున్నది. అధర్మ నాశనమున స్వభక్తులకు గలుగు సంసార భయాదుల పట్టున ప్రళయకాలము సమీపించిన తఱి- ఆది వ్యాధి హరణ కాలమున ధర్మానికి గ్లాని సంభవించిన తరుణంలో దుర్మార్గుల విషయంలో రుద్రుడు క్రూరుడై సంచరించునని, భాష్యకారులు వచించిరి. రుద్రుడనగా రోదనకారణభూతమగు దుఃఖమును హరించువాడనియు నర్థము. అనగా భవబంధ మోచకుడని గ్రహింపదగును.

12/08/2015 - 22:07

ఈ సృష్టిలోని ప్రాణమున్న జీవఠాసులన్నింటికీ ఆహారం తర్వాత అత్యంత ముఖ్యమైంది నిద్ర. కడుపు నిండా భోజనం, కంటినిండా నిద్ర ప్రతి ప్రాణికి అవసరం. వాస్తవానికి నిద్ర అంటే బాహ్యేంద్రియములతోపాటు మనస్సుకు కూడా విశ్రాంతినివ్వడమే నిద్ర. ఉదయం నిద్రనుండి మేల్కొని పనులలో మునిగి తేలి అలసిన శరీరం రాత్రి కాగానే తిరిగి నిద్రాదేవి ఒడిలోకి ఒరుగుతుంది.

12/07/2015 - 21:29

గమ్యమనగా పొందదగినది అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు లేక తను చేరుకోగోరు స్థానం (స్థితి) అని కూడా చెప్పవచ్చు. మానవ జీవన విధానంలో తాను ఒక గురి మనసులో ఏర్పరచుకొని దాన్ని సాధించడం కోసం వ్యయ, ప్రయాసలకు ఓర్చుకొని తన జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది.

12/07/2015 - 04:29

అత్యాశకు పోకుండా తనకు కావలసింది లభించలేదే అని బాధపడకుండా ప్రాప్తమయిన కొంచమునే పదివేలనుకుంటూ తృప్తిపడాలి మానవుడు. అలా తృప్తిపడని వాడు ఎక్కడ ఉన్నా చక్కబడపోడని బమ్మెరపోతన భాగవతంలో వివరించాడు. అలాగే జీవితంలో భగవంతుడిచ్చిన దానితో పరితృప్తుడై భగవద్భక్తి కలిగి మానవుడు జన్మను ధన్యం చేసుకోవాలి.

12/05/2015 - 22:30

సృష్టి, స్థితి, లయాల్ని చేస్తూ వినోదించడం భగవంతుని లీల. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏవి ప్రాప్తమో వాటిని ఆయనే సమకూరుస్తుంటాడు. ఏం జరిగినా, ఏం సంభవించినా అదంతా ఆయన మన మేలు కోసమే చేస్తున్నాడని గ్రహించగలిగి నిశ్చలంగా, నిర్వికారంగా నిర్మమమకారంతో సాక్షియై తిలకిస్తూ సంతోషించగలవాడే ధన్యుడు. జీవన్ముక్తుడు. ఆ స్థితికి చేరుకోవడంలోని ఆనందం అంతా ఇంతా అని వర్ణించనలవి కాదు.

12/05/2015 - 04:11

‘వ్య సనం’ అంటే అలవాటు అని చెప్పవచ్చు. ఏదైనా ఒక పనిని గత కొద్దికాలంగా కొనసాగిస్తూ, వర్తమానంతోపాటుగా ఉంటూ భవిష్యత్‌పై కూడా ప్రభావం చూపే దానిని ‘వ్యసనం’గా చెప్పవచ్చును. ఈ వ్యసనం అనేది మనకు అవసరం లేకున్నా, ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా కూడా మనల్ని ప్రేరేపిస్తూ జరిగిపోతుంటుంది. వ్యసనంవలన మనల్ని మనమే నియంత్రించుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశాలు కన్పిస్తాయి.

12/05/2015 - 04:10

రెండు యాగాశ్వాలను అలంకరించి సైన్యం జయ జయధ్వానాలు చేస్తుండగా విజయుడు విజయమూర్తియై రథంపై అక్కడికి చేరుకొన్నారు.
పౌరకాంతలు అర్జునునిపై పూవులు రత్నాలూ చల్లి భూమిని గంధవతినీ, రత్నగర్భనూ చేసేరు.
అర్జునుని అనుసరించి వచ్చిన రాజలోకం ధర్మరాజుకు వివిధమైన కానుకలు సమర్పించి పాద ప్రణామాలు చేసేరు. విదురాది వృద్ధులతో కొలువు తీరిన ధర్మజునకు రాజులందరినీ పరిచయం గావించేడు శ్రీకృష్ణుడు.

12/03/2015 - 02:49

దేవుని దర్శించుటకు అనేక మార్గాలున్నట్టే దేవుణ్ణి పూజించడానికీ ఉన్నాయ. వాటిలో పుష్పములు, గంధము, కుంకుమ, క్షీరము, ఘృతము, పెరుగు, తేనె, చక్కెర, బెల్లం, తమలపాకులు, వక్కలు, బియ్యం, పసుపు, అగరుబత్తులు, దీపపు ఒత్తులు, ఉదకం, పంచపాత్ర, ఉద్ధరిణి, మామిడాకులు, పండ్లు, కొబ్బరికాయ, కర్పూరం..

12/02/2015 - 02:28

లక్ష్మణుడు ‘‘రామా మరల బాల్యము పొందినవానివలె విచక్షణా జ్ఞానము లేనట్టి రాజు యొక్క మాటను రాజనీతి ఎరిగిన ఏ కుమారుడు పాటించవలయును? తండ్రియే విచక్షణ కోల్పోయినపుడు అతనిని శాసించి తీరవలయును. మహాకాలుని వలె స్థిరముగానున్న నినె్నదిరింపగల వాడెవ్వడు. వనమునకు వెళ్ళవలవదు. నీకండగా నేను నిలచెదను.

Pages