S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2017 - 23:42

నిర్మల్, జనవరి 15: పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జోగు సాత్విక్ (17) అనే విద్యార్థి శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని శాస్ర్తీనగర్ దక్షిణభాగంలో నివాసముండే సాత్విక్ ఇంటి పనుల కోసం బైక్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో సాత్విక్ బైక్‌పై నుండి ఎగిరిపడ్డాడు.

01/15/2017 - 23:41

సంగారెడ్డి టౌన్, జనవరి 15: మకర సంక్రాంతి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రమైన సంగారెడ్డితో పాటు వివిధ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని అన్ని వార్డులో ఉదయానే్న మహిళలు ముంగిట్లో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆనందోత్సావంగా పండగను జరుపుకున్నారు. ఆలయాలు, గృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

01/15/2017 - 23:40

జహీరాబాద్, జనవరి 15: ప్రభుత్వాలు చిరుధాన్యాలను ప్రోత్సహించాలని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ శనివారం జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట పంచాయతీ పరిధిలోని లచ్చానాయక్ తండాలో 18వ సంచార పాత పంటల జాతరను ప్రారంభించింది. ఈ జాతర ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఫ్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు.

01/15/2017 - 23:40

మెదక్, జనవరి 15: మంజీర నది ఒడ్డున ద్వాపర యుగంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన గరుడగంగ క్షేత్రంలో లోక కళ్యాణార్థం మేరుతంత్ర ప్రకారం మహారుద్ర యాగం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించే అస్టోత్తర శతకుండాత్మక 108 (హోమగుండాల పూర్వక) పాశుపత మహా రుద్రయాగానికి త్రయాహ్నిక దీక్షతో మహా వైభవముగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

01/15/2017 - 23:39

జహీరాబాద్, జనవరి 15: మహిళారైతులే వెన్నముక్కగా ప్రారంభమైన 18వ పాతపంటల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాతరలో పాతపంటల వంటకాలు, సాంప్రాయం ఉట్టిపడేలా తోరణాలతో అలంకరించిన గుడిసెలు వేశారు. వాటిలో చిరుధాన్యాలతో తయ్యారు చేసిన వంటకాలను అందుబాటులో ఉంచారు. పాతపంటల జాతరలో వివిధ రకాల విత్తనాలతో అలంకరించిన బుట్టలను ఏర్పాటుచేశారు. ఎడ్లబండ్లపై అలంకరించిన ఈ బుట్టలు చూపరులను ఎంతగానో అలరించాయి.

01/15/2017 - 23:38

కొల్చారం, జనవరి 15: వచ్చే నెల 6న మండలంలోని రంగంపేట శివారులో తొగుటలో ఉన్న మాధవానంద పీఠాన్ని రంగంపేట గ్రామానికి తరలిస్తున్నందున భూమిపూజ నిర్వహిస్తున్నట్లు శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. శనివారం సాయంత్రం ఉత్తరాయణాన్ని పురష్కరించుకొని మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6న భూమిపూజ కార్యక్రమాలు ప్రారంభించి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

01/15/2017 - 23:37

కొత్తకోట, జనవరి 15: సరళసాగర్ జలాశయం ఆసియా ఖండంలోనే మొదటిది కాగా ప్రపంచంలోనే రెండవదని ఈ ఆటోమెటిక్ సైఫాన్‌గల జలాశయం గల సరళసాగర్ ప్రాజెక్టు ఖ్యాతీ గడించింది. ఆసియా ఖండంలోనే సరళసాగర్ ప్రాజెక్టు ఆద్భుత కట్టడంతో నిర్మాణం గావించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామ పంచాయతి పరిధిలోని సరళసాగర్ గ్రామ సమీపంలో జలాశయం ఉన్నది. ఊకచెట్టు వాగుపై ఉన్న ఈ జలాశయం ఒకప్పుడు పెద్ద చెరువుగా ఉండేది.

01/15/2017 - 23:36

మహబూబ్‌నగర్, జనవరి 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గత పాలకులు, ప్రభుత్వాలు క్రీడలను విస్మరించారని దాంతో గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం గల క్రీడాకారులు ఎంతో మంది నష్టపోయారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

01/15/2017 - 23:35

మహబూబ్‌నగర్, జనవరి 15: సంసృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతికగా నిలిచిందని ఈ పండుగ పత్రి వ్యక్తిలో సాంప్రదాయాలను నెర్పిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహా శేరి వెంకటయ్య అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

01/15/2017 - 23:35

మహబూబ్‌నగర్, జనవరి 15: భారతీయ సనాత ధర్మంలో గోవు ధర్మదేవతగా భావించి అనాదికాలం నుండి పూజిస్తున్నారని తిరుమల తిరుమతి దేవస్థానం సమన్వయ కర్త రామాచార్యులు తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పరమళగిరి కొండ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని తిరుమ తిరుపతి దేవస్తానం, హిందూధర్మప్రచార పరిషత్తు మహబూబ్‌నగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Pages