S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/17/2019 - 03:38

కొందుర్గు, జూలై 16: ఆకతాయి వేధింపులు తాళలేక, మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జిల్లేడుచౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన రాజేశ్వరి(15) అనే బాలిక, పెద్దఎల్కిచర్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.

07/17/2019 - 03:32

రాజేంద్రనగర్, జూలై 16: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పద్మశాలిపురం ప్రాంతానికి చెందిన శంకరయ్య(50), పుష్పలత దంపతులు. వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం. శంకరయ్య మద్యానికి బానిసై ఇంట్లోని సభ్యులతో తరుచూ గొడవ పడుతున్నాడు.

07/16/2019 - 23:09

న్యూఢిల్లీ : ప్రజారోగ్య వ్యయంతో ఆర్థికాభివృద్ధి జరగదని, ఈ నేపథ్యంలో దేశంలో ‘కఠినమైన కాలుష్యం’, ‘తీవ్ర కాలుష్యం’ వెదజల్లడానికి కారణభూతమవుతున్న పరిశ్రమలను మూడు నెలల్లోగా మూసివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)ని ఆదేశించింది.

07/16/2019 - 22:45

హైదరాబాద్: తెలుగులో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో సీజన్లోకి అడుగుపెడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. షో ప్రసారం కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ అనుమానాలున్నాయని ఒక పిటిషన్, ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్‌లు దాఖలయ్యాయి.

07/16/2019 - 05:58

విజయవాడ (క్రైం), జూలై 15: నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడిపేవారిపై కొరఢా ఝలిపించే క్రమంలో తనిఖీలు చేపట్టారు.

07/16/2019 - 05:56

విజయవాడ (క్రైం), జూలై 15: వివి ధ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు ఆధారం గా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ పోలీసులు సోమవారం అరె స్టు చేశారు.

07/16/2019 - 05:00

న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్-జెడీ(ఎస్) తిరుగుబాటు ఎమ్మెల్యేల వాదన వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. అధికార కాంగ్రెస్-జెడీ(ఎస్) ఎమ్మెల్యేల రాజీనామాల పర్వంతో కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను ఆదేశించాల్సిందిగా కోరుతూ ఇదివరకే కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

07/16/2019 - 04:56

న్యూఢిల్లీ, జూలై 15: బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనపై విచారణ ముగించేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ సుప్రీం కోర్టును కోరారు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన కేసులో బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులపై ప్రత్యేక న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారు.

07/16/2019 - 04:49

న్యూఢిల్లీ, జూలై 15: పోటీ పరీక్షలను లోపరహితంగా నిర్వహించేందుకు వీలుగా తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాము నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి అయ్యే ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జిఎస్ సింఘ్వి సారథ్యంలో ఏడుగురు సభ్యులతో ఈ ఏడాది మే 9న సుప్రీం కోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

07/16/2019 - 04:48

న్యూఢిల్లీ, జూలై 15: గర్భస్రావ చట్టంలోని అంశాలను పునఃపరిశీలించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.

Pages