S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/27/2018 - 00:20

రావికమతం, సెప్టెంబర్ 26: పొలం పనుల్లో పాల్గొనేందుకు వెళ్ళిన రైతు స్పృహ తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో మేడివాడ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈసంఘటనకు సంబంధించి రావికమతం ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడివాడ గ్రామానికి చెందిన సీహెచ్ అప్పలనాయుడు(40) పొలం పనుల కోసం ఉదయం వెళ్ళి పొలానికి నీరు పెడుతుండగా స్పృహ తప్పి పొలంలోకి జారిపడిపోయాడన్నారు.

09/27/2018 - 00:20

కోటవురట్ల, సెప్టెంబర్ 26: మండలంలో రామచంద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై మధుసూధనరావు బుధవారం అందజేసిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన యువకుడు కొండ అశోక్‌కుమార్ (23) గ్రామంలో ఇంటి నుంచి రామాలయానికి వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఢీ కొంది.

09/27/2018 - 00:14

కూచిపూడి, సెప్టెంబర్ 26: న్యాయస్థానం ఆదేశం మేరకు మొవ్వ తహశీల్దార్ రామానాయక్ సూచనల మేరకు స్థలం కొలుస్తున్న అధికారులను చూసి ఆందోళన చెందిన వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మొవ్వ మండలం నిడుమోలులో చోటు చేసుకుంది.

09/27/2018 - 00:10

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 26: నగరంలో సీఐడీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించారు.

09/27/2018 - 00:09

కంకిపాడు, సెప్టెంబరు 26: విద్యుదాఘాతానికి గురై ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంతెన గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని మంతెన గ్రామానికి చెందిన డీ ఏడుకొండలు (55) తన ఇంటి వద్ద బోరు బావి మోటర్ సరిగా పనిచేయటం లేదని దానిని పరిశీలించేందుకు చేతిపంపుని పట్టుకుని చూస్తుండగా వర్షం కురవటంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు.

09/26/2018 - 23:37

కేవీబిపురం, సెప్టెంబర్ 26: మండలంలోని రాగిగుంట గ్రామంలో కేశవజగన్నాథం తన భార్య వరలక్ష్మిపై కిరోసిన్ పోసి తగలబెట్టడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఆమెను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. వరలక్ష్మి పేరుపై ఉన్న హౌసింగ్ నగదు 70వేల రూపాయలను విలాసాలకు భర్తకు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది.

09/26/2018 - 22:18

సంబేపల్లె, సెప్టెంబర్ 26: మండల పరిధిలోని రౌతుకుంట-దినె్నమీదపల్లె గ్రామీణ రోడ్డు మార్గమధ్యలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొని లక్షుమయ్య(36) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/26/2018 - 00:31

వికారాబాద్, సెప్టెంబర్ 25: నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చోటుచేసుకున్న విద్యార్థుల అనుమానాస్పద మృతి సంఘటన గ్రామీణ ప్రాంతానికి పాకింది. స్థానిక గౌతమి జూనియర్ కళాశాలలో మంగళవారం తెల్లవారుజామున విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

09/26/2018 - 00:28

వనస్థలిపురం, సెప్టెంబర్ 25 : తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ నిందితుడి వివరాలను వెల్లడించారు. చడీ డగ్యాంగ్‌లో ఒకడైన ఖజుమవోజిని ఎస్‌ఓటీ, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

09/26/2018 - 00:24

గచ్చిబౌలి, సెప్టెంబర్ 25: అందమైన యువతుల ఫోటోలను వెబ్‌సైట్‌లో పెట్టి యువకులకు యువతులను ఎస్కాట్‌గా పంపిస్తామని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

Pages