S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/02/2019 - 22:48

అనంతపురం, జనవరి 2: ధర్మవరం పరిధిలో డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైల్లో నుండి నిండు గర్భిణిను కిందకు తోసి, ఆమె దగ్గర నుండి బంగారు నగలు దోచుకున్న ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 15 రోజుల్లో కేసును ఛేదించి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని రైల్వే ఎస్పీ సిద్దార్థ కౌశల్ పేర్కొన్నారు.

01/02/2019 - 22:43

టంగుటూరు,జనవరి 2:టంగుటూరుకు దక్షిణ వైపున ఉన్న సర్వీసురోడ్డులో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

01/02/2019 - 22:42

మార్కాపురం టౌన్, జనవరి 2: హత్యకేసులో సాక్ష్యాలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ 6వ అదనపుజిల్లా జడ్జి జి రామకృష్ణ బుధవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. మార్కాపురం డివిజన్ పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నాలి సాంబయ్యను 2012లో గోతం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు.

01/02/2019 - 22:42

త్రిపురాంతకం, జనవరి 2: కర్నూలు- గుంటూరు జాతీయ రహదారిలో మండలంలోని కేసినేనిపల్లి స్టేజీ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుఝామున జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేసినేనిపల్లి గ్రామ స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని నరసరావుపేట నుంచి మార్కాపురం వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

01/02/2019 - 22:18

జి.మాడుగుల, జనవరి 2: పరిమితులకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటోబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. లువ్వాశింగి పంచాయతీ సంగులోయ గ్రామం నుంచి ఆటోలో జి.మాడుగుల కు రావడానికి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వస్తు వరదమామిడి గ్రామం సమీపంలో ఘటీ ఎక్కే సమయంలో బోల్తా పడింది. ఈ ఘటన లో సంగులోయ గ్రామానికి చెందిన ఇంచెంగి చంద్రయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు.

01/02/2019 - 22:06

పార్వతీపురం (రూరల్), జనవరి 2: పార్వతీపురం డివిజన్ సీతానగరం మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన నీరస సింహాచలం (54) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్న సింహాచలం ఈ మద్య కుమార్తె వివాహం చేసాడు. వివాహం వలన కొద్దిగా అప్పులు ఉండటం వలన మనస్తాపం చెంది సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు.

01/02/2019 - 04:54

బాన్సువాడ/వనపర్తి, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అపశ్రుతులు దొర్లక తప్పలేదు. కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు.

01/01/2019 - 23:15

కొత్తూరు, జనవరి 1: ఎప్పటిలాగే కళ్లు గీతకు చెట్టుకు ఎక్కిన గిరిజనుడు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకసముద్రంలోకి నెట్టింది. పోలీసులకు తెలిపిన వివరాలు మేరకు మండలంలోని మహాసింగి గ్రామానికి చెందిన సవర బారికి (40) అనే గిరిజనుడు మంగళవారం తెల్లవారుజామున ఈతకళ్లు దించేందుకు చెట్టు ఎక్కాడు.

01/01/2019 - 23:11

పర్చూరు, జనవరి 1:మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

01/01/2019 - 23:00

కుప్పం, జనవరి 1: నూతన సంవత్సరం కోలాహలంగా, సంతోషంగా గడపాలని విహారయాత్రకు వచ్చిన 60మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి నీటమునిగి దుర్మరణం పాలైన సంఘటన ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగింది.

Pages