S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/29/2018 - 03:31

మదనపల్లె, జూలై 28: ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తు ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రతిపక్షాల పోరాటం, వామపక్షాలు, ప్రజాసంఘాల ఉద్యమాలతో కేంద్రం స్పందించకపోవడం.. ఇక రాదేమో అన్న ఆవేదనతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది.

07/29/2018 - 00:53

అనంతపురం సిటీ, జూలై 28: అనంతపురం నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగలు పడ్డారు. జేఎన్‌టీయూ సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచిలోకి శుక్రవారం రాత్రి ఇద్దరు దొంగలు చొరబడి రూ.39 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీ చువ్వలు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లాకర్‌కు రంధ్రం చేసి అందులోని నగదు చోరీ చేశారు.

07/28/2018 - 22:36

గుర్రంపోడు, జూలై 28: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చేపూరు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్వపల్లి సైదులు (33) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో పత్తిని సాగు చేశాడు.

07/28/2018 - 05:12

గుడివాడ, జూలై 27: గుడివాడ రాజేంద్రనగర్లోని ఆర్టీవో కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో తిరుగుతున్న 15మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుండి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

07/28/2018 - 04:23

శేరిలింగంపల్లి, జూలై 27: బల్దియా సఫాయి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సెప్టిక్ ట్యాంక్ కూలి ట్రాక్టర్‌తో సహా కార్మికుడు అందులో పడిపోయాడు. దశాబ్దకాలంగా డ్రైనేజీని శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికుడు అందులోనే ప్రాణాలు కోల్పోవడంతో పారిశుద్ధ్య కార్మికులను తీవ్రం గా కలచివేసింది. నాలుగు గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీమ్ సహాయంతో మృతదేహాన్ని బయటకు వెలికితీశారు.

07/28/2018 - 01:49

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)లలో ఖాళీలను భర్తీచేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఎందుకు భర్తీచేయలేదో వివరణ ఇవ్వడంతో పాటు ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం సహా ఏడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది.

07/28/2018 - 01:45

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

07/28/2018 - 01:32

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంపత్ కుమార్ సభ్యత్వాల రద్దును కొట్టి వేస్తూ తాము లోగడ ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామచందర్ రావును ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాదివా లేక పార్టీ ప్రతినిధివా అంటూ ఏజీని నిలదీసింది.

07/28/2018 - 00:50

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక హింసాత్మక ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల వదంతులతో చోటు చేసుకుంటున్న ఈ ఘటనల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీ లోకూర్, జస్టిస్ లలిత్ ఈ కేసును విచారిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

07/27/2018 - 23:53

చింతలపూడి, జూలై 27: పశ్చిమగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై మూడురోజులపాటు ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో ఉండాల్సిన బాలిక యువకుల చెరలో ఉండటం, దీనిపై మేట్రిన్ సమాధానం చెప్పకుండా మొహం చాటేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Pages