S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/31/2020 - 06:45

నందిగామ, జనవరి 30: మండలంలోని ఐతవరంలో విద్యుదాఘాతానికి ఒక రైతు కూలీ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన మార్కపూడి గురవయ్య, యేసయ్య, శివ ట్రాక్టర్‌పై పొలం నుండి వరిగడ్డి వేసుకుని పొలం మధ్య నుండి వస్తుండగా 11కెవి విద్యుత్ వైర్లు గడ్డికి తగిలి మంటలు లేచాయి.

01/31/2020 - 06:34

తలకొండపల్లి, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో గురువారం ఎదురు ఎదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొవడంతో రెండు గ్రామాలైన జంగారెడ్డిపల్లి, రాంపూర్‌లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం..

01/31/2020 - 01:10

ఆదిలాబాద్, జనవరి 30: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సమత హత్యాచార కేసులో నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. సమతపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు కిరాతకంగా హతమార్చిన ఘటనపై సర్వత్రా అందోళనలు రేకెత్తిన విషయం విదితమే.

01/30/2020 - 04:30

న్యూఢిల్లీ, జనవరి 29: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలుకు తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతుండగా ముద్దాయిలు తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటునే ఉన్నారు. దోషుల్లో ఒకడు ముకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. ముకేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో అతడు సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు.

01/30/2020 - 01:44

నేరేడ్‌మెట్, జనవరి 29: చెడు వ్యసనాలకు అలవాటు పడి నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరధిలో జరిగింది. నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కందుకూర్ మండలం నేదునూర్‌లో నివసించే కల్యాణ్‌కర్ భవాన్‌జీ(36) సెక్యూరీటి గార్డుగా పని చేస్తున్నాడు.

01/30/2020 - 01:44

నేరేడ్‌మెట్, జనవరి 29: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరధిలో జరిగింది. బుధవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.

01/30/2020 - 01:07

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కార కేసులో బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. 2018లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలను వినకుండానే అధికారులు డిక్లరేషన్లు, అవార్డు ఇచ్చారని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

01/29/2020 - 23:53

న్యూఢిల్లీ, జనవరి 29: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న హౌసింగ్ కాంప్లెక్స్ పనులు నిలిపివేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలకు సుప్రీం కోర్టు పక్కబెట్టింది. ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్‌ను ఆనుకుని హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. అయితే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాన్న ఎన్‌జీటీ స్టేటస్ కో విధించింది.

01/29/2020 - 23:53

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రవాస భారతీయుడైన వ్యాపారవేత్త సీసీ థంపీకి ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విదేశాల్లో రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తుల కొనుగోలు అంశంలో మనీలాండలింగ్ వ్యవహారంలో థంపీకి ప్రత్యేక జడ్జి అర్‌వింద్ కుమార్ బెయిల్ మంజూరు చేశారు.

01/29/2020 - 23:52

బండ (యూపీ), జనవరి 29: ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠినతరమైన చట్టం తీసుకుని వచ్చినా, ట్రిపుల్ తలాఖ్‌లు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. అంతేకాకుండా సదరు మహిళ తన మరిదితో లైంగికంగా వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గత ఏడాది ఆమెకు వివాహం జరిగింది.

Pages