S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/15/2018 - 22:12

పాడేరు, అరకులోయ, డిసెంబర్ 15: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) విచారణ చేపట్టనుంది. ఈ సంఘటనపై ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి సమగ్ర విచారణకు అప్పగించినట్టు తెలుస్తోంది.

12/15/2018 - 21:50

డోన్, డిసెంబర్ 15:డోన్ ప్రాంతంలో అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్న రేషన్ బియాన్ని శనివారం తెల్లవారుజామున డోన్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. పట్టణంలోని ఎంవీఐ కార్యాలయ సమీపంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా డోన్ పట్టణ సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

12/15/2018 - 02:13

షాద్‌నగర్, డిసెంబర్ 14: విద్యార్థులతో వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా పొగలు రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. శుక్రవారం ఉదయం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది.

12/15/2018 - 00:37

పాలకీడు, డిసెంబర్ 14: మండలంలోని రాఘవాపురం గ్రామంలోని కోదండరామాలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రెడ్ల చంద్రారెడ్డి తెలిపారు. హుండిలో రూ.50వేల వరకు నగదు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు

12/15/2018 - 00:34

సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 14: రాచకొండ అడవుల్లో చిరుతలు, హైనాలు సంచరిస్తూ కనిపించిన గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలను చంపుతుండటంతో గిరిజనులు, యాదవులు, ఇతర రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శుక్రవారం రాచకొండ గుట్టల్లోని తూంబావి తండాకు చెందిన కాట్రోతు కిషన్‌కు చెందిన పెద్దమేకను బూర్గుచెట్టుగుట్ట వద్ద చిరుత చంపితినేసింది.

12/15/2018 - 00:21

పెరవలి, డిసెంబర్ 14: నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండాప్రభుత్వం పంపిణీచేస్తున్న పౌష్టికాహార బియ్యం పశ్చిమ గోదావరి జిల్లాలో రీ సెక్లింగ్ అయ్యి ఎఫ్‌సీఐ గౌడౌనుకు మిల్లర్ల ద్వారా సరఫరా అవుతున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు రెండు రైస్ మిల్లులపై దాడులుచేసి, భారీగా నిల్వలను స్వాధీనం చెసుకొన్నారు. జిల్లాలోని పెరవలి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

12/14/2018 - 22:29

తిరువనంతపురం, డిసెంబర్ 14: కేరళ తీరంలో ఆయుధాలు,పేలుడు పదార్థాలతో ఉన్న మరపడవను నౌకాదళం అధికారుల పట్టుకున్నారు. సునాయ్‌నా అనే వైమానిక గస్తీ నౌక 20 నాటిలక్ మైళ్ల దూరంలో మత్స్యకారుల మరపడవను గుర్తించింది. ఇది సోమాలియా తీరానికి చేరువలో ఉంటుందని సదరన్ నేవల్ కమాండ్ వెల్లడించింది. ఆయుధాల అక్రమ రవాణాపై కోచీ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ కమాండ్ ఆపరేషన్ చేపట్టింది.

12/14/2018 - 21:58

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 14: వృద్ధురాలు అదృశ్యమైనట్టు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానిక జైభారత్‌నగర్‌లో నివాసముంటున్న కాప్పాడ రాజమ్మ(70) ఈనెల 13వ తేదీ సాయంత్రం నుండి కనిపించకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్ళ వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె కాంతం స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.

12/14/2018 - 02:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా వివిధ రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సమాచార కమిషనర్‌సహా ఇతర కమిషనర్లను భర్తీ చేయడం లేదని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తులు ఏకే సిక్రీ,అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

12/14/2018 - 02:36

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పని చేస్తున్న అర్చకుల వయస్సు 65 ఏళ్లు దాటితే పదవీవిరమణగా పరిగణించడాన్ని ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. టీడీడీ పాలక మండలి ఇచ్చిన అదేశాలు చెల్లవని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎస్ రామచంద్రరావుసంబంధిత పిటిషన్లపై విచారించారు.

Pages