S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/18/2018 - 00:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్‌కు కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ మురళీధర్, వినోదక్ గోయల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పును వెలువరించింది. సజ్జన్ రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని కోర్టు స్పష్టం చేసింది.

12/17/2018 - 23:03

చోడవరం, డిసెంబర్ 17: గూడ్సు ఆటోను టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ప్రమాదం మండలంలోని అడ్డూరు గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి.

12/17/2018 - 23:03

అనకాపల్లిటౌన్, డిసెంబర్ 17: స్థానిక లక్ష్మీదేవిపేట సమీపంలో రైల్వేట్రాక్‌పై సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. రైల్వే జిఆర్‌పి ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవిపేట ఎఎంసి కాలనీకి చెందిన బండి వెంకటరమణ (30) కూలి పని కోసం తెల్లవారు ఐదు గంటలకు ప్రతీరోజు రైలులో వెళుతుంటాడు.

12/17/2018 - 22:47

మార్కాపురం టౌన్, డిసెంబర్ 17 : గిద్దలూరు పోలీసులు 2015 ఫిబ్రవరి 2వ తేదీన నమోదు చేసిన హత్యకేసును మార్కాపురం 6వ అదనపు జిల్లా జడ్జి రామకృష్ణ సోమవారం నేరం రుజువు కాకపోవడంతో కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. నిందితుడి తరపు న్యాయవాది భూపని కాశయ్య, విజయవర్దన్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

12/17/2018 - 22:36

గుంటూరు (లీగల్), డిసెంబర్ 17: అభరణాల కోసం మహిళను హతమార్చిన కేసులో ఓ యువకుడికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు మహిళా నేరాల ప్రత్యేక న్యాయస్థానం, ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎల్ శ్రీ్ధర్ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... జిల్లాలోని వినుకొండకు చెందిన కొప్పురావూరి శ్రీనివాసరావు భార్య లక్ష్మీకుమారి (45) పచ్చళ్లు, ప్లాస్టిక్ గ్లాసుల వ్యాపారం చేస్తుండేవారు.

12/17/2018 - 22:35

గుంటూరు (అరండల్‌పేట) డిసెంబర్ 17: చెడు అలవాట్లుకు బానిసలయ్యారు... పేకాట, మద్యం మత్తులో పడి దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నారు. జిల్లాతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన మోటారు వాహనాలు చోరీ అమ్ముతున్న ఘరానా దొంగల ముఠా గుట్టును రట్టుచేశారు గుంటూరు అర్బన్ సిసియస్ పోలీసులు.

12/17/2018 - 22:33

చంద్రగిరి, డిసెంబర్ 17: హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు రేకుల లోడ్‌తో వెళ్తున్న లారీ, తవణంపల్లి నుండి తిరుపతికి బ్రాయిలర్ కోళ్ల లోడుతో వస్తున్న ఈచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలు అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున మండలంలోని అగరాల వద్ద జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/17/2018 - 22:33

శాంతీపురం, డిసెంబర్ 17: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాళ్లబూదుగూరు ఎస్సై వెంకటేశ్వర్లు కథనం మేరకు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్‌రావు కుమారుడు హరికి, ఎస్.గొల్లపల్లి గ్రామానికి చెందిన బూసెపరావు కుమార్తె కాంతమ్మ(27)ను ఇచ్చి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ సంతానం కలిగారు.

12/17/2018 - 22:32

చిత్తూరు, డిసెంబర్ 17 : అప్పుల బాధ తాళలేక హోమ్ గార్డు అత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చిత్తూరు రూరల్ మండలం జంబుగోళం గ్రామంలో చోటుచేసుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు రూరల్ మండలం జంబుగోళం గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి (26) చిత్తూరు ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

12/16/2018 - 04:42

గుంటూరు, డిసెంబర్ 15: సొసైటీ రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్ చేసిన గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుంటూరు పొట్టి శ్రీరాములు నగర్‌కు చెందిన గోళ్ల శివశంకర్ మాస్టర్ ప్రింటింగ్ బిల్లింగ్ సొసైటీ పేరుతో సొసైటీ నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి గత నెల రోజులుగా జిల్లా రిజిస్ట్రారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

Pages