S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/14/2018 - 02:50

పాతబస్తీ, మార్చి 13: సామాన్య ముఠా కార్మికుడు పలువురు వ్యాపారులు, సహచర ముఠా కార్మికులకు రూ. 1.50 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. ఈ సంఘటన పాతబస్తీలో వెలుగుచూసింది. అందిన సమాచారం ప్రకారం.. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుండి విజయవాడ నగరానికి వలస వచ్చిన ఓ వ్యక్తి ఊర్మిళానగర్‌లో నివాసముంటున్నాడు.

03/14/2018 - 04:02

న్యూఢిల్లీ: ఆంధ్ర, తెలంగాణలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఉమ్మడి హైకోర్టును ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లోగా బార్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

03/14/2018 - 04:02

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రంలోని గుంతకల్‌లో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తమ వైఖరిని తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది. గుంతకల్‌కు చెందిన కె శ్రీనివాస చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది.

03/13/2018 - 22:28

హిందూపురం, మార్చి 13 : హిందూపురం ప్రాంతంలో మట్కా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి 25 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుండి రూ.6,52,480 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు.

03/13/2018 - 22:28

ఓబుళదేవరచెరువు, మార్చి 13: మండల పరిధిలోని కొండకమర్ల దిగువ ఎస్సీ కాలనీకి చెందిన గౌరమ్మ (28) అనే వివాహిత కడుపునొప్పి తాళ లేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు గౌరమ్మకు తరచూ కడుపునొప్పి వస్తుండేదని, పలు వైద్యశాలల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాలేదన్నారు. సోమవారం విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

03/13/2018 - 22:27

నల్లమాడ, మార్చి 13: మండల పరిధిలోని చెరువువాండ్లపల్లికి దగ్గరలో వున్న భైరాన్ చెరువు వద్దనున్న అడవిలో ఓ వ్యక్తి శవం లభ్యమైనట్లు స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి బుక్కపట్నం వాసి విష్ణువర్ధన్ (35)గా గుర్తించారు. చెరువువాండ్లపల్లికి చెందిన గొర్రెల కాపరులు తమ పశువులను మేతకు తోలుకుని అడవికి పోగా అక్కడ వచ్చిన దుర్వాసన కారణంగా విష్ణువర్ధన్ శవం వున్న విషయాన్ని తెలుసుకున్నారు.

03/13/2018 - 04:28

కేపీహెచ్‌బీకాలనీ, మార్చి 12: పట్టపగలు రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థిపై వేటకొడవళ్లతో వెంటాడి దారుణంగా హతమార్చారు. ఈ హత్య నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. ప్రశాంతంగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతంలో ఈ తరహా హత్య స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య చేసిందే హతుడి స్నేహితులే కావడం విశేషం.

03/13/2018 - 04:14

అవనిగడ్డ, మార్చి 12: అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఎసీబీ అధికారులు నిర్వహించిన దాడులు కలకలం సృష్టించాయి. ఎసీబీ డీజీపీ ఆర్‌పి ఠాగూర్ ఆదేశాల మేరకు సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, విబి ప్రసాద్, హరికృష్ణలతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కకురాని రూ.లక్షా 29వేల 480 నగదును స్వాధీనం చేసుకున్నారు.

03/13/2018 - 03:11

అనంతపురం అర్బన్, మార్చి 12: అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పరిధిలోని కట్టకిందపల్లి గ్రామంలోని అలమూరు చెరువులో మునిగి సోమవారం ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ తల్లి నారాయణమ్మ, ఆమె కుమారుడు అఖిల్, అతని స్నేహితుడు నందకిషోర్ ఉన్నారు. గ్రామానికి చెందిన లక్ష్మినారాయణమ్మ తన కుమారుడు అఖిల్, అతని స్నేహితుడు నందకిశోర్ కలిసి బట్టలు ఉతకడానికి ఆలుమూరు చెరువు వద్దకు వెళ్లింది.

03/13/2018 - 03:10

హైదరాబాద్, మార్చి 12: నలుగురు మంత్రులతో సహా 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించినందున వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ఎ వెంకటరాంబాబు అనే మాజీ ఎమ్మెల్యే పిల్ దాఖలు చేశారు. మంత్రులు సి ఆదినారాయణ రెడ్డి, ఎస్ కృష్ణ రంగారావు, ఎన్ అమర్‌నాధ్‌రెడ్డి, భూమా అఖిలప్రియలను మరో 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పిల్‌లో కోరారు.

Pages