S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/15/2018 - 01:34

ఖమ్మం(క్రైం), మార్చి 14: ఖమ్మం మునే్నరులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు విద్యార్థులు మునే్నరు వద్దకు వెళ్ళారు. స్నేహితులైన ఇరువురు విద్యార్థులు ఒకేసారి మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఖమ్మంలోని ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొదటి నుంచి కలిసి ఉండేవాళ్ళని, మృత్యువు కూడా వాళ్ళని విడతీయలేకపోయిందని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

03/15/2018 - 00:43

మోత్కూర్, మార్చి 14: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జవ్వారి జనార్థన్, భాగ్యమ్మల పెద్ద కుమారుడు విజయ్‌సాయి (10) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు.

03/15/2018 - 00:06

తెలకపల్లి, మార్చి 14: మండల పరిధిలోని దాస్‌పల్లికి చెందిన బల్మూరి రామస్వామిగౌడ్(60) ఆయన భార్య నర్సమ్మ(55) అనే భార్య భర్తలు ఇద్దరు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా తెలకపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్యగల దాస్‌పల్లి బస్‌స్టేజీ ద్గర తెలకపల్లి నుండి భార్య భర్తలు ఇద్దరు టీవీఎస్ లూనాపై వెళ్తున్నారు.

03/14/2018 - 22:28

కాళ్ల, మార్చి 14: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన కొల్లి వెంకట సత్యనారాయణతోపాటు అతని సోదరుడు నరసింహారావు, తండ్రి మారేశ్వరరావు విలేఖర్ల వద్ద తమ గోడు వెళ్లగక్కారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటున్నామన్నారు.

03/14/2018 - 04:20

కుప్పం, మార్చి 13: గుడుపల్లె మండలం తంజమ్మ కొటాలు గ్రామం వద్ద జరిగిన మురుగేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వలయాధికారి రాఘవన్ వెల్లడించారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తంజమ్మ కొటాలు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతు, అతని బావమరిది మురుగేష్ కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా ఆస్థి గొడవలు జరుగుతున్నాయి. కుప్పం, గుడుపల్లి మండలాల పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి.

03/14/2018 - 03:53

ఉప్పల్, మార్చి 13: అనుమానాస్పదస్థితిలో తండ్రి కొడుకు మురుగునీటి శుద్ధి ప్లాంటులో పడి మరణించారు. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి మరణించారా లేక దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. విషాదకరమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

03/14/2018 - 02:56

చల్లపల్లి, మార్చి 13: ఇంటర్మీడియేట్ చదువుతున్న మైనర్ బాలికను గత కొంత కాలంగా వెంబడిస్తూ ప్రేమించమని వేధిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ అవనిగడ్డ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ దాడి చంద్రశేఖర్ తెలిపారు.

03/14/2018 - 02:50

పాతబస్తీ, మార్చి 13: సామాన్య ముఠా కార్మికుడు పలువురు వ్యాపారులు, సహచర ముఠా కార్మికులకు రూ. 1.50 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. ఈ సంఘటన పాతబస్తీలో వెలుగుచూసింది. అందిన సమాచారం ప్రకారం.. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుండి విజయవాడ నగరానికి వలస వచ్చిన ఓ వ్యక్తి ఊర్మిళానగర్‌లో నివాసముంటున్నాడు.

03/14/2018 - 04:02

న్యూఢిల్లీ: ఆంధ్ర, తెలంగాణలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఉమ్మడి హైకోర్టును ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లోగా బార్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

03/14/2018 - 04:02

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రంలోని గుంతకల్‌లో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తమ వైఖరిని తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది. గుంతకల్‌కు చెందిన కె శ్రీనివాస చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించింది.

Pages