S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/04/2016 - 20:49

శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా జి.ఎస్.వి.సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ,నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా నటుడు రఘుబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

09/04/2016 - 20:48

‘బిచ్చగాడు’ చిత్రాన్ని అందించిన నిర్మాతలు తాజాగా మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ప తాకంపై అందిస్తున్న ఈ చిత్రంలో బేబి సారాఅర్జున్ (నాన్న ఫేమ్) ప్రధాన పాత్రలో నటించడం విశేషం. మలయాళంలో విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి ప్రశంసలు లభించాయని, ఓ చిన్నారి చేసిన సాహసం ఎలాంటి పరిణామాలకు దారితీసింది?

09/04/2016 - 20:47

మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యారామ్ ప్రధాన తారాగణంగా శ్రీనువిల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకంపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కుమారి 18+. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ సత్య మాట్లాడుతూ..

09/04/2016 - 20:43

‘మనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ ఇంటివాడయ్యారు.‘ఇష్క్’, ‘24’ చిత్రాలు కూడా ఆయన కెరీర్‌లో ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆదివారం చెన్నయ్‌లో ఆయన వివాహం శ్రీనిధితో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్‌రెహ్మాన్, సూర్య, నితిన్ సహా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

09/04/2016 - 20:40

తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి బైరవ అనే పేరును ఖరారు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కీర్తిసురేష్, అపర్ణా వినోద్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో జగపతిబాబు నటిస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

09/03/2016 - 20:57

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 30శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ సామాజిక కథాంశం నేపథ్యంలో రూపొందుతోంది. ఈనెలనుండి చెన్నైలో షూటింగ్ జరగనుంది.

09/03/2016 - 20:56

నాగచైతన్య, శ్రుతిహాసన్‌లతో ‘ప్రేమమ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న చందూ మొండేటి తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. దక్షిణాదిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐ డ్రీమ్ మీడి యా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన చందూ మొండేటి తన తదుపరి చిత్రంగా ‘ప్రేమమ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

09/03/2016 - 20:54

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన అనుష్క అటు స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ‘బాహుబలి-2’, ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాల్లో నటిస్తోన్న అనుష్క తాజాగా భాగమతి చిత్రంలో నటిస్తోంది.

09/03/2016 - 20:52

హనీష్, చిరాశ్రీ జంటగా కె.సూర్యనారాయణ దర్శకత్వంలో శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఆమే అతడైతే’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత పరుచూరి వేంకటేశ్వరరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్ కొత్తగా వుంది. ముఖ్యంగా భిన్నమైన కానె్సప్ట్ ఇది.

09/03/2016 - 20:51

రాజీవ్ సాలూరి, సిమీదాస్ జంటగా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.పి. ప్రొడక్షన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువుకాదురా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ ‘మా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగుతుంది. ప్రాణం కమలాకర్ ఇచ్చిన రీరికార్డింగ్ హైలెట్‌గా నిలుస్తుంది.

Pages