S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/10/2018 - 16:51

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరానికి ప్రయాగగా పేరు మార్చే విషయంలో ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోరారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ మొఘల్ పాలకులు, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పేర్లు మార్పు జరిగాయని, ఇపుడు వాటిని తొలగించి పాత పేర్లు పెట్టాలని కోరారు.

07/10/2018 - 16:50

న్యూఢిల్లీ: ప్రకృతి వ్యవసాయ సాగును పెంచేందుకు నీతి ఆయోగ్ దృష్టి సారించింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. వ్వవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కూడా హాజరయ్యారు. రైతులు వారి అనుభవాలను వివరించారు.

07/10/2018 - 16:44

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌కు తెలిపారు. ఈ మేరకు వారు లా కమిషన్‌కు లేఖ అందజేశారు. జమిలి ఎన్నికల విధానానికి ఇప్పటి వరకు ఐదు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

07/10/2018 - 13:36

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పోషియాన్ జిల్లాలో కుందలన్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. నలుగురు పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు చెలరేగి భద్రతాబలగాల మీద రాళ్లు రువ్వాయి.

07/10/2018 - 13:35

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్‌కు రాష్టప్రతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. మూన్ తన భార్య కిమ్‌జంగ్ సుక్‌తో కలిసి రాష్టప్రతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్టప్రతి దంపతులతోనూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. ఈరోజు హైదరాబాద్ భవన్‌లో ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్‌తో అధికారిక చర్చలు జరుపనున్నారు.

07/10/2018 - 13:33

విశాఖపట్నం: చత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగురాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో చెదురుమదురు జల్లులు, రాయలసీమలో జల్లులు, ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

07/10/2018 - 13:32

ముంబయి: నగరాన్ని వానలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. జోరువానలో విధులు ముగించుకుని ఇళ్లకు చేరే ఉద్యోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ వర్షాలకు టీచర్‌గా పనిచేసే మనీషా బోయిర్ మృతిచెందింది. సోదరుని టూ వీలర్‌పై వస్తుండగా వాహనం నీటిలో గుంత కనిపించక పడిపోయింది. ఆ మహిళపై నుంచి బస్సు వెళ్లటంతో చనిపోయింది.

07/10/2018 - 04:53

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టేను మరో సంవత్సరం పాటు పొడిగించటంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. హర్షవర్దన్ ఈ ఆదేశాన్ని జారీ చేయటంతో పోలవరం పనులు ఎలాంటి అంతరాయం లేకుండా సాగిపోతాయి. పోలవరం ప్రాజెక్టుకు 2005లోనే పర్యావరణ అనుమతులు లభించాయి.

07/10/2018 - 04:46

న్యూఢిల్లీ, జూలై 9: తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంతోపాటు, 1280 కిలోమీటర్ల జాతీ య రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

07/10/2018 - 04:28

ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన ఢంకాను మోగిస్తున్న
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే-ఇన్. చిత్రంలో భారత ప్రధాని నరేంద్ర మోది

Pages