S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2016 - 06:32

ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తాను సభలో ఇచ్చిన హామీని అమలు చేయటం ద్వారా రాజ్యసభ గౌరవాన్ని నిలపాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బిజెపి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదా విషయమై అప్పటి కేంద్ర కేబినెట్‌లోనూ నిర్ణయించామని స్పష్టం చేశారు. అప్పటి రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఆరు హామీలిచ్చాను. వాటిని తప్పకుండా అమలు చేయండి అని మన్మోహన్ డిమాండ్ చేశారు.

08/06/2016 - 06:30

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించే భారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌దే. ఆ బిల్లు ద్రవ్య బిల్లేనని స్పీకర్ నిర్ధారిస్తే దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరగదు. ఇందుకు భిన్నంగా స్పీకర్ నిర్ణయించే పక్షంలో సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.

08/06/2016 - 06:22

న్యూఢిల్లీ, ఆగస్టు 5:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. చంద్రబాబు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో దాదాపు 25 నిమిషాలసేపు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఇరువురూ చర్చలు జరిపారు.

08/06/2016 - 06:48

న్యూఢిల్లీ/విజయవాడ, ఆగస్టు 5:ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా తేల్చాలని ప్రధాని మోదీని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకూ చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. కాగా ప్రత్యేక హోదా ఇవ్వటం, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ప్రధాని ఎం తో పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పా రు.

08/06/2016 - 06:21

కోక్రాఝార్, ఆగస్టు 5: అస్సాంలో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝార్ జిల్లాలో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌పై దాడి చేసి 14 మందిని కాల్చి చంపేసారు. కాల్పులకు తెగబడ్డ దుండగుల్లో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. మిలిటెంట్ల కాల్పుల్లో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

08/05/2016 - 18:24

సూరత్: గుజరాత్ కొత్త సిఎంగా గుజరాత్ బిజెపి చీఫ్ విజయ్ రూపాని శుక్రవారం ఎంపికయ్యారు. విజయ్ రూపాని పేరును బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర సీనియర్ నేతలు ఖరారు చేశారు.డిప్యూటీ సిఎంగా నితిన్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఆనందిబెన్ పటేల్ రాజీనామాతో కొత్త సిఎం ఎంపిక అనివార్యమైంది.

08/05/2016 - 18:07

దిల్లీ: దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై బీబీసీ ఫిల్మ్‌మేకర్‌ లెస్లీ ఉడ్విన్‌ రూపొందించిన ‘ఇండియాస్‌ డాటర్‌’ అనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయలేమని దిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. నిర్భయ సులో శిక్ష పడిన దోషుల్లో ఒకరి వాంగ్మూలాన్ని లెస్లీ ఉడ్విన్‌ చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రసారం కాకుండా ట్రయల్‌ కోర్టు నిషేధించింది.

08/05/2016 - 17:36

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారం ప్రకటించారు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించలేమని చెప్పారు. మనీ బిల్లు అవునా? కాదా? నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ప్రైవేటు బిల్లు మనీ బిల్లు అవునా? కాదా?

08/05/2016 - 17:32

ఢిల్లీ: ప్రత్యేకహోదాకు వచ్చే వారం పరిష్కారం రావచ్చనికేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు . ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించారని, ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా చెప్పడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్, వైసీపీకి చిత్తశుద్ధి లేకనే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయని విమర్శించారు.

08/05/2016 - 17:16

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు. జులై 14న కాలి ఎముక విరగగా ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆళ్వార్‌పేట్‌లోని ఆయన ఇంటి ముందు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పూర్తిగా కోలుకున్న వెంటనే ‘శభాష్‌ నాయుడు’ సినిమా షూటింగ్‌ కొనసాగిస్తారు.

Pages