S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2018 - 02:44

లక్నో, జూలై 8: దేశంలోని అన్ని జిల్లాల్లో ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా షరియత్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా కోర్టులు 40 ఉన్నాయని బోర్డు సీనియర్ సభ్యుడు జఫర్‌యాబ్ జిలానీ చెప్పారు.

07/09/2018 - 02:42

న్యూఢిల్లీ, జూలై 8: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వరుసగా రెండోసారి పట్టం కట్టనున్నారని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. దేశంలో ముస్లింలతో కలుపుకుని 30 నుంచి 35 శాతం ఉన్న మైనార్టీ ఓటర్లు బీజేపీకే ఓటు వేస్తారని ఆయన చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

07/09/2018 - 02:41

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీ ప్రజలకు సేవలందించడానికి సుప్రీం కోర్టు తమకు ‘సహేతుకమైన స్వతంత్రత’ను ఇచ్చిందని, దాంతో తాము రాత్రి పగలు పనిచేసి ప్రజల సంక్షేమానికి పాటుపడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

07/09/2018 - 04:18

చెన్నై: దేశంలో ఏడాదికి రెండు సార్లు నీట్ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని తమిళనాడు వ్యతిరేకించింది. ఈ విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే కూడా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను ఏటా రెండుసార్లు జరపాలన్న ఆలోచనపై మండిపడింది. ప్రతిసారీ నీట్‌పై గందరగోళ పరిస్థితులను సృష్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది.

07/09/2018 - 02:38

లక్నో, జూలై 8: ఉత్తర ప్రదేశ్ విధి నిర్వహణలో అశ్రద్ద కనపరిచే ఉద్యోగులను ఇంటికి పంపించాలనుకుంటోంది. 50 సంవత్సరాలు నిండి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులను గుర్తించి, వారి కోసం నిర్బంధ (కంపల్సరీ) పదవీ విరమణ స్కీంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో నాలుగు లక్షల మంది విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

07/09/2018 - 02:37

న్యూఢిల్లీ, జూలై 8: రష్యాతో కలిసి సంయుక్తంగా ఫైట్ జెట్ విమానాలను తయారు చేయాలనే ప్రాజెక్టుపై భారత్ పునరాలోచనలో పడింది. భారీ ఖర్చును దృష్టిలో ఉంచుకొని, ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎఫ్‌జీఎఫ్‌ఏ) జెట్ తయారీపై భారత సర్కారు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై రష్యా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు భారత సమాయత్తమవుతున్నది.

07/09/2018 - 02:36

లక్నో, జూలై 8: ఆది నోరా, లేదా మోరి నా అనే విధంగా చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్నారు. సున్నితమైన అంశాలపై నోరు పారేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల తరచుగా అనేక అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు దొరికిపోతున్నాడు. పైగా బీజేపీకి తలవంపులు తెస్తున్నారు.

07/09/2018 - 02:26

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీలోని బురాని ప్రాంతంలో సంచలనం సృష్టించిన 11 మంది అనుమానాస్పద మృతి వెనుక గల పూర్తి కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. దీనివెనుక కారణాలు తాంత్రికమైనవా? మానసిక పరమైనవా? ఆర్థిక పరమైనవా అన్నదానిపై పోలీసులు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో 11 మంది కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది వారం రోజులు గడిచాయి.

07/09/2018 - 02:21

హైదరాబాద్, జూలై 8: సినీ రచయిత కత్తి మహేశ్ తేనే పూసిన కత్తి అని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి దుయ్యబట్టారు. శ్రీ రాముడి గురించి కత్తి మహేశ్ వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని, ఈ వ్యాఖ్యలు దేశంలోని హిందువులందరినీ ఎంతో బాధకు గురి చేశాయని పరిపూర్ణనంద స్వామి ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

07/09/2018 - 02:19

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 101వ జయంతి సందర్భంగా బెంగళూరులో ఆదివారం జరిగిన
ఒక కార్యక్రమంలో ఆయన వేషధారణలో అలరించిన చిన్నారులు

Pages