S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/30/2018 - 12:33

ఒడిశా : కెంజర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు నిర్ధారించారు.

06/30/2018 - 05:54

చిత్రం..కాశ్మీర్ పర్యటనలో ఉన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అక్కడి యువకులతో ముచ్చటిస్తున్న దృశ్యం.

06/30/2018 - 05:52

న్యూఢిల్లీ, జూన్ 29: పాకిస్తాన్‌పై అవసరమైతే మరోసారి మెరుపు దాడులు చేయగలమని లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా శుక్రవారం తెలిపారు. పాకిస్తాన్‌కు ఇంకోసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటే భారత దేశం మరోసారి మెరుపుదాడి చేయగలుగుతుందని మొదటి మెరుపుదాడిని రచించి పర్యవేక్షించిన పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ డీఏస్ హుడా చెప్పారు.

06/30/2018 - 05:58

న్యూఢిల్లీ, జూన్ 29: కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన అనంతరం భద్రతా దళాలు ‘ప్రజలతో స్నేహపూర్వక వైఖరి’ని వ్యవహరిస్తున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం వెల్లడించారు. కాశ్మీర్ లోయలో హింస, అస్థిరతను సృష్టిస్తున్న ఉగ్రవాదులను తరిమికొట్టడమే తమ ముందున్న ప్రాథమిక లక్ష్యమని, అదే సమయంలో తమ లక్ష్యసాధనలో సామాన్యపౌరునికి ఎలాంటి ఇబ్బంది కలిగించరాదన్నది తమ ఉద్దేశమని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.

06/30/2018 - 06:01

శ్రీనగర్, జూన్ 29: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆందోళనకారులు, భద్రతాబలగాలపై రాళ్లు రువ్విన ఘటనలో ఒక యువకుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు తుమ్మా అనే గ్రామంలో నక్కి ఉన్నారనే సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు.

06/30/2018 - 05:25

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్న బీజేపీ అగ్రనేత ఏబీ వాజపేయిని శుక్రవారం మరోసారి పరామర్శించారు. వాజపేయిని ప్రధాని పరామర్శించడం ఇది మూడోసారి. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వృద్ధుల కోసం నిర్మించతలపెట్టిన జాతీయ కేంద్రం, సూపర్ స్పెషాలిటీ, అత్యవసర విభాగానికి శంకుస్థాపన చేసిన ప్రధాని అక్కడ నుంచి ఎయిమ్స్‌కు వచ్చారు.

06/30/2018 - 05:23

న్యూ ఢిల్లీ, జూన్ 29: సుప్రీంకోర్టులో నిఖా హలాల, బహుభార్యాత్వం అంశాల కేసు విచారణకు వస్తే వ్యతిరేకిస్తామని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు ముస్లింలలో పెళ్లికి సంబంధించి ఉండే పైన పేర్కొన్న రెండు మత పద్దతులపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

06/30/2018 - 05:21

న్యూ ఢిల్లీ, జూన్ 29: దేశంలో కార్పోరేట్ రంగానికి చెందిన పెద్దలు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయడంతో, లక్షల కోట్ల సొమ్ము స్విస్ బ్యాంకుకు తరలి వెళ్లిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రంపై ధ్వజమెత్తారు. స్విస్ బ్యాంకులో 50 శాతం మేర భారతీయులు దాచుకున్న నగదు నిల్వలు 2017లో పెరిగాయని, నల్లధనంపై ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు.

06/30/2018 - 05:21

న్యూఢిల్లీ, జూన్ 29: తప్పిపోయిన, అనాధ పిల్లల సమాచారం ఇక సులభంగా తెసుకోవచ్చు. దీనికి సంబంధించి ఓ మొబైల్ యాప్‌ను కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ యాప్‌కు ‘రీ యునైట్’ అని నామకరణం చేశారు. బచపన్ బచావో ఆందోళన్, ఐటీ దిగ్గజం కేప్‌జెమినీ సంయుక్తంగా రీ యునైట్ యాప్‌ను రూపొందించాయి.

06/30/2018 - 05:20

ముంబయి, జూన్ 29: మహారాష్టల్రోని నానర్ రిఫైనరీ ప్రాజెక్టు విషయంలో అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అనుసరిస్తున్న వైఖరి నియంతలను గుర్తుకు తెస్తోందని, అటువంటి వారు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా విమర్శలు చేసే హక్కు ఏ మాత్రం లేదని శివసేన విమర్శించింది. పార్టీకి చెందిన సామ్నా తాజా సంచికలో ఈ మేరకు కేంద్ర, రాష్ట్రాల వైఖరిపై విరుచుకుపడింది.

Pages