S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/03/2017 - 01:32

త్యాగానికి ప్రతీకగా జరుపుకున్న బక్రీద్ పండుగను దేశంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లోనూ పెద్దఎత్తున పండుగ జరుపుకున్నారు. ఢిల్లీలోని జూమా మసీద్‌లో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తున్న ముస్లిం సోదరులు

09/03/2017 - 01:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పాత కొత్తల మేలు కలయికగా, ప్రతిభ, అంకిత భావం మేళవింపుగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం మరికొన్ని గంటల్లో కొత్త రూపును, సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకోబోతోంది. మరో రెండేళ్లలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు.

09/03/2017 - 00:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఓ కేంద్ర మంత్రి టెలీఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలు అంటూ సిబిఐ శనివారం కొట్టిపారేసింది. ఆ మంత్రి టెలిఫోన్‌ను సిబిఐ ట్యాప్ చేస్తోందని ఓ టీవీ చానల్‌లో వచ్చిన కథనాలను ప్రస్తావించిన సిబిఐ అధికారులు ఇవి పూర్తిగా దురుద్దేశపూరితమైనవని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

09/03/2017 - 00:16

న్యూఢిల్లీ, సెస్టెంబర్ 2: సికింద్రాబాద్ లోకసభ సభ్యుడు, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తొలగింపుతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణాకు స్థానం లేకుండాపోయింది. బండారు దత్తాత్రేయ స్థానంలో ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే ప్రశ్నకు బిజెపి అధినాయకత్వం సమాధానం చెప్పలేకపోయింది.

09/02/2017 - 02:33

చెన్నై, సెప్టెంబర్ 1: ఇటీవలే విలీనమైన అధికార అన్నాడిఎంకె వర్గాలు ఈ నెల 12న నిర్వహించనున్న జనరల్ కౌన్సిల్, కార్యనిర్వాహక కమిటీ సమావేశాలకు హాజరు కావొద్దని శశికళ వర్గానికి చెందిన ప్రధాన కార్యదర్శి దినకరన్ శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.

09/02/2017 - 02:32

చెన్నై, సెప్టెంబర్ 1: జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్2పరీక్షను ఉమ్మ డి ప్రాతిపదికన నిర్వహించవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓ దళిత విద్యార్థిని తమిళనాడులోని కాలేజీల్లో అడ్మిషన్ లభించకపోవడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్పందించిన సినీనటుడు రజనీకాంత్ ఆ బాలిక ఉదంతం తన గుండెను కరిగిస్తోందని వ్యాఖ్యానించారు.

09/02/2017 - 02:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఇవిఎంల వినియోగంపై రాజకీయ పార్టీలు, ఎన్‌జిఓలు, వ్యక్తులు ఎలాంటి విమర్శలు చేయకుండా ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖన్‌విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

09/02/2017 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రతి జిల్లాలోను ఓల్డేజ్ హోమ్స్ (వృద్ధాశ్రమాల) స్థితిగతులపై తమ సమాధానాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్రాలను కోరింది. సీనియర్ సిటిజన్స్ హక్కులను పరిరక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

09/02/2017 - 02:24

ముంబయి, సెప్టెంబర్ 1: దక్షిణ ముంబయిలోని భిండీబజార్‌లో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 33కు చేరింది. 117 ఏళ్లనాటి ఐదంతస్తుల భవనం గురువారం ఉదయం కుప్పకూలిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఇరవై రోజుల చిన్నారి ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థమైంది. సంఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

09/02/2017 - 02:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: పన్ను ఎగవేతదారుల కారణంగా నిజాయితీగా పన్ను కడుతున్నవారు మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఇం కెంత మాత్రం ఉండకూడదని ప్రధాని నరేం ద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులను ఉద్దేశించిన శుక్రవారంనాడు మాట్లాడిన ఆయన ఎప్పటికప్పుడు రెవెన్యూను పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలన్నారు.

Pages