S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/30/2016 - 00:47

అహ్మదాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ప్రభావం చూపించలేదు. 123 స్థానాల్లో ఏకంగా 107చోట్ల అధికార బిజెపి జయకేతనం ఎగరేసింది. మోదీ ప్రభుత్వం సర్జికల్ దాడి, పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు.

11/30/2016 - 00:46

చెన్నై, నవంబర్ 29: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగా మెరుగైందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకె వర్గాలు వెల్లడించాయి. అమ్మ ఆరోగ్యం మామూలు స్థితికి చేరుకుందని పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి మంగళవారం తెలిపారు. ‘అమ్మ చక్కగా ఆహారం తీసుకుంటున్నారు. ఫిజియోథెరపీ జరుగుతోంది. త్వరలోనే ఇంటికి వచ్చేస్తారు’ అని ఆమె స్పష్టం చేశారు.

11/30/2016 - 00:45

న్యూఢిల్లీ, నవంబర్ 29: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో మంగళవారం ఇక్కడ గంగారాం ఆసుపత్రిలో చేరారు. వైరల్‌ఫీవర్‌తో సోనియా ఆసుపత్రిలో చేరారని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల తెలిపారు. పార్టీ అధ్యక్షురాలి ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘రెండు రోజుల్లో సోనియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారు.

11/30/2016 - 00:45

న్యూఢిల్లీ, నవంబర్ 29: తల్లిదండ్రుల స్వార్జితమైన ఇంటిలో నివసించేందుకు పెళ్లయినా, కాకపోయినా కుమారుడికి ఎలాంటి హక్కూ లేదని, వారి దయాదాక్షిణ్యాలపై మాత్రమే అతను ఆ ఇంటిలో ఉండవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సుహృద్భావ సంబంధాలు కొనసాగినంతకాలం తల్లిదండ్రులు తమ కుమారుడ్ని ఇంటిలో ఉండడానికి అనుమతించినంత మాత్రాన జీవితాంతం అతని భారాన్ని వారు భరించాలని అర్థం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.

11/29/2016 - 07:18

కోల్‌కతా, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోకపోతే అధికార పీఠంనుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు ఆయన నివాసం ఎదుటే నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.

11/29/2016 - 07:16

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్య ప్రజల ఉసురు పోసుకుంటున్నారని వామపక్షాలు ఆరోపించాయి. జన ఆక్రోశ్ దివస్‌లో భాగంగా సిపిఎం, సిపిఐలతో సహా ఏడు వామపక్షాల నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశంలో అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ సృష్టించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

11/29/2016 - 07:15

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను పెంపొందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇప్పటికే దేశంలో నగదు అన్నదే లేదని ఎద్దేవా చేశారు. 86 శాతం పెద్దనోట్ల రద్దు కారణంగా ఎవరి దగ్గరా చిల్లిగవ్వ కూడా లేకుండా పోయిందని, నగదు రహిత భారతానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏమిటని ఆయన అన్నారు.

11/29/2016 - 07:15

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఇపిఎఫ్‌ఓ ప్రకటించింది. జనవరి 15లోగా యాభై లక్షల మంది పెన్షనర్లు తమ జీవన సర్ట్ఫికెట్‌ను సమర్పించవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇపిఎఫ్‌ఓ అధికారి తెలిపారు.

11/29/2016 - 06:38

న్యూఢిల్లీ, నవంబర్ 28: కేంద్రం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు థర్నాలో పాల్గొన్నారు.

11/29/2016 - 05:16

న్యూఢిల్లీ/ తిరువనంతపురం, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు మూలంగా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్, ఆందోళన కార్యక్రమాల పిలుపులతో సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది.

Pages