S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2016 - 06:13

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో 50, 100 నోట్ల చెలామణి కూడా రద్దవుతుందంటూ వ్యాపిస్తున్న వదంతులను కేంద్రం ఖండించింది. ఈ వదంతులన్నీ అభూత కల్పనలేనని, వీటిని రద్దు చేసే యోచన తమకు ఎంత మాత్రం లేదని బుధవారం స్పష్టం చేసింది. 100, 50 రూపాయలే కాదు ఇతర విలువ కలిగిన కరెన్సీలను రద్దు చేసే ఆలోచన ఎంత మాత్రం లేదని తెలిపింది.

11/16/2016 - 04:07

హైదరాబాద్, నవంబర్ 15:దేశంలో 2030 నాటికి భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 101 మిలియన్లకు పెరుగుతుందని అపోల్ మునిచ్ ఆరోగ్య బీమా సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 70 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని, మరో 80 వేలమంది ప్రి డయాబెటిస్ వ్యాధి లక్షణాలతో ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. నీల్సన్ ఇండియా సంస్థతో కలిసి సర్వే చేసిన వివరాలను ఆ సంస్ధ సిఇవో ఆంటోనీ జాకబ్ తెలిపారు.

11/16/2016 - 04:06

కోల్‌కతా, నవంబర్ 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి దేశ ప్రజలను బిచ్చగాళ్లులా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీలు తనతో చేతులు కలిపినా, కలపకపోయినా ఈ విషయంపై బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.

11/16/2016 - 03:48

హైదరాబాద్, నవంబర్ 15: దేశంలో వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజిమెంట్ యాప్ వాల్‌నట్ సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులు తమకు దగ్గరలో పనిచేస్తున్న నగదుతో కూడిన ఎటిఎంలను కనుగొనేందుకు ఈయాప్ ఉపయోగపడుతుందని వాల్‌నట్ సిఇవో అమిత్ బోర్ తెలిపారు. వాల్‌నట్ 1.8 మిలియన్లకుపైగా ఉన్న తమ వినియోగదారులకు ఎటిఎంను వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఎటిఎంలను కనుగొనడంలో సహాయపడుతుంది.

11/16/2016 - 03:45

ముంబయి, నవంబర్ 15: నగదు కోసం బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి ఇప్పటి వరకూ 18మందినుంచి 20మంది వరకూ చనిపోతే ప్రధాని నరేంద్ర మోదీ ‘నవ్వుతున్నా’రంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఔచిత్యం, సహేతుకత లేని నిర్ణయంగా 500, 1000 నోట్ల రద్దుపై రాహుల్ విరుచుకు పడ్డారు. ‘అసలు మోదీ నవ్వుతున్నారో..కన్నీరు కారుస్తున్నారో వివరించాలి’అని అన్నారు.

11/16/2016 - 02:11

న్యూఢిల్లీ, నవంబర్ 15:చెలామణి నుంచి 500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దైనందిన అవసరాలకే నగదు లేక వారం రోజులుగా దురవస్థలు పడుతున్న సామాన్యుల ఇబ్బందులు తక్షణమే తీర్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.

11/16/2016 - 02:09

న్యూఢిల్లీ, నవంబర్ 15: నోట్ల రద్దు పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారం రేపనుంది. సర్కారు నిర్ణయాన్ని అన్ని కోణాల్లో తప్పుబడుతున్న విపక్షాలు, అస్తశ్రస్త్రాలతో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమాయత్తమయ్యాయి. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా కోట్ల జనం పడుతున్న కష్టనష్టాలను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తబోతున్నాయి. సర్కారు ఆకస్మిక నిర్ణయ వెనుకవున్న అనౌచిత్యాన్నీ ముక్తకంఠంతో ప్రశ్నించబోతున్నాయి.

11/16/2016 - 02:07

న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని అదుపు చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేశారు.

11/16/2016 - 02:04

న్యూఢిల్లీ, నవంబర్ 15: మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలుపై రూ.1.46పైసలు, డీజిల్‌పై 1.53పైసలు తగ్గించినట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. వ్యాట్‌తో సంబంధం లేకుండా ఈ రేట్లను తగ్గించడం వల్ల వాస్తవంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

11/16/2016 - 01:00

న్యూఢిల్లీ, నవంబర్ 15: పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి వారం రోజులు గడిచిపోయినప్పటికీ సామాన్యుడి కరెన్సీ కష్టాలు తగ్గలేదు. వాస్తవానికి ఒక రోజు సెలవు తర్వాత మంగళవారం బ్యాంకులు తెరచుకొన్నప్పుడు వాటి ముందు నగదుకోసం వేల సంఖ్యలో జనం క్యూలు కట్టి ఉండడం చూస్తే ఈ కష్టలు మరింతగా పెరిగాయనే చెప్పాలి.

Pages