S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/16/2016 - 00:55

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఇప్పటికే సన్నిహితమైన తమ రక్షణ సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని, అలాగే హింసాత్మక కార్యకలాపాల వైపు జనాన్ని మళ్లించడం, ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని మరింత తీవ్రం చేయాలని భారత్, ఇజ్రాయెల్ దేశాలు మంగళవారం నిర్ణయించాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపైన, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాలపైన కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి.

11/16/2016 - 00:53

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఎన్నికల సమయంలో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లకు గుర్తుగా వేలిపై ఉంచే ఇంక్ మార్క్‌ను ఇకపై బ్యాంకుల్లో కూడా వాడనున్నారు. పాతనోట్లను ఎక్స్ఛేంజి చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారులకు ఇంక్‌మార్క్ వేసేందుకు వీలుగా అవసరమైనంత ఇంక్‌ను సంసిద్ధంగా ఉంచుకోవాలని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌ను కేంద్రం ఆదేశించింది.

11/16/2016 - 02:13

అహమ్మదాబాద్, నవంబర్ 15: కరెన్సీ మార్పిడి దగ్గర సామాన్యులు, విఐపిలు అన్న ప్రశే్న లేదు. ఇక్కడ ఎవరైనా క్యూలో నిలుచోవలసిందే. 94 సంవత్సరాల వయసున్న మోదీ తల్లి హీరాబెన్ బ్యాంకుకు వచ్చి క్యూలో నిలుచుని తన దగ్గరున్న పాత నోట్లను మార్చుకున్నారు. గాంధీనగర్‌లోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు మంగళవారం ఉదయం తొమ్మిది రూ.500నోట్లను తీసుకుని వచ్చారు.

11/16/2016 - 00:50

ముంబయి, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు కారణంగా టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికి ఈ నెల 18 దాకా టోల్‌టాక్స్ వసూళ్లను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కారణంగా టోల్ వసూలు చేసే వారికి కలిగే నష్టంలో 75 శాతం దాకా భర్తీ చేయాలనే ఒక ప్రతిపాదనను జాతీయ హైవేల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఏ) ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

11/16/2016 - 00:48

బెంగళూరు, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము దాచుకున్న డబ్బును డిపాజిట్ చేయాలన్నా, మార్చుకోవాలన్నా జనం నానాయాతనలు పడుతున్న నేపథ్యంలో బుధవారం బెంగళూరులో అట్టహాసంగా జరగబోయే మైనింగ్ కింగ్, బిజెపి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి కర్నాటకకు చెందిన పలువురు బిజెపి నేతలు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11/16/2016 - 00:47

హైదరాబాద్, నవంబర్ 15: నల్లధనాన్ని వెలికితీయటంతో పాటు నకిలీ కరెన్సీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశంలో చిల్లర తగాదాలు మొదలయ్యాయ. బ్యాంకుల వద్ద గంటల తరబడి బారులుతీరి నిల్చున్నా, నగదు మార్పిడి కావటం లేదు. ఇందుకు బ్యాంకు అధికారులు రకరకాలుగా సాకులు చెబుతున్నారు. ఇక ఏటిఎంకు వెళితే అది ‘ఎనీ టైం మూతే’.

11/15/2016 - 08:49

ఘాజీపూర్, నవంబర్ 14:పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలు సుఖంగా నిద్ర పోతున్నారని, నల్లకుబేరులే నిద్ర పట్టక నిద్ర మాత్రల కోసం పరుగులు పెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1000, 500 కరెన్సీ నోట్ల చెలామణిని రద్దు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై నరేంద్ర మోదీ విమర్శలు, చతురోక్తులతో విరుచుకు పడ్డారు.

11/15/2016 - 08:46

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత్‌లో పెళ్లిళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. వివాహాల నిర్వహణ అనేది వారి సామాజిక హోదాకు చిహ్నంగా మారిన రోజులివి. సామాన్య ప్రజలు కూడా అట్టహాసంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో కరెన్సీ కొరత ఏర్పడటంతో ఇప్పుడు వివాహాల నిర్వహణ తీవ్ర సమస్యగా మారింది. ‘టెంట్ వాళ్లకు, బంగారం కొనుగోలుకు ముందు డబ్బులు ఇవ్వాలా?

11/15/2016 - 08:44

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతదేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా యావత్ ప్రజలంతా ఘనంగా నివాళులర్పించారు.

11/15/2016 - 08:44

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఆర్థిక గందరగోళం ఆరు రోజులయినా కుదుటపడలేదు. రూ.500, 1000 నోట్ల ఉపసంహరణతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర కరెన్సీ కొరతతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలంతా అల్లాడిపోతున్నారు. రోజువారీ అవసరాలకోసం చేతిలో చిల్లిగవ్వ లేక చితికిపోతున్నారు. బ్యాంకు శాఖలు, ఎటిఎం కేంద్రాల వద్ద నగదుకోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.

Pages