S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/15/2016 - 07:53

న్యూఢిల్లీ, నవంబర్ 14: బాలల హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డును అందజేశారు.

11/15/2016 - 07:28

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి భారత సైన్యం విరుచుకుపడింది. వాస్తవాధీన రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భీంబర్ సెక్టార్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. తమ సైనిక పాటవాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది.

11/15/2016 - 07:04

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం బిజెపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు.

11/15/2016 - 07:05

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దుతో తమను దెబ్బ తీసిన ప్రధాని మోదీని ఎదురుదెబ్బ కొట్టేందుకు విపక్షాలు వ్యూహాత్మక అడుగులేస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయంలో తృణమూల్ కాంగ్రెస్, జెడి(యు), వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు.

11/15/2016 - 06:57

న్యూఢిల్లీ, నవంబర్ 14: తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారణకు చేపట్టనుంది. కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల కోటాది మందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇది పౌరుల జీవన, వాణిజ్య హక్కును హరించడమేనని పిటిషనర్లు స్పష్టం చేశారు.

11/15/2016 - 06:51

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోల్‌బంకులు టోల్‌బూత్‌లలో రద్దయిన 500, 1000 నోట్లను అనుమతించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే, దేశంలోని అన్ని హైవేలపై ఈనెల 18 అర్థరాత్రి వరకు టోల్‌టాక్స్ రద్దుచేసింది.

11/14/2016 - 03:12

రేణిగుంట, నవంబర్ 13: రేణిగుంటకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో వెనుదిరిగిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో ఉదయం 9 గంటలకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది.

11/14/2016 - 03:01

న్యూఢిల్లీ, నవంబర్ 13: పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడినప్పటినుంచి మొదలైన సామాన్యుల నగదు కష్టాలు అయిదు రోజులైనా తీరలేదు. నిజానికి సెలవు రోజయిన ఆదివారంనాడు మరింతగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఎటిఎంల ముందు డబ్బులకోసం వచ్చిన జనాల పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి.

11/14/2016 - 02:57

ముంబయి, నవంబర్ 13: పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం పొద్దుపోయేవరకు 30వేల కోట్ల రూపాయలను బ్యాంకులు వినియోగదారులకు అందించాయి. దేశంలోని బ్యాంకుల వ్యవస్థ ప్రజావసరాలకు తగ్గట్టుగా అన్ని విభాగాలను ముమ్మరంగా పనిచేయించడంతో కొన్ని లోటుపాట్లున్నా నగదు పంపిణీ చురుగ్గా సాగిందని భారత బ్యాంకుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

11/14/2016 - 02:55

ముంబయి, నవంబర్ 13: బ్యాంకుల వద్ద తగినంత నగదు ఉందని, అందువల్ల జనం ఆదుర్దా పడి పదే పదే బ్యాంకులకు, ఎటిఎంలకు వెళ్లాల్సిన పని లేదని రిజర్వ్ బ్యాంక్ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు, ఎటిఎంల వద్ద జనం రద్దీ తగ్గలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ ప్రకటన చేసింది.

Pages