S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/05/2016 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో పది లక్షల మంది జనాభాకు 18 మంది న్యాయమూర్తులున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1987 నివేదిక ప్రకారం 10 లక్షల మందికి 50 మంది జడ్జీలుండాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికీ న్యాయమూర్తులు సంఖ్య పెరగలేదు. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం వివిధ రాష్ట్రాల జనాభా, న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

08/05/2016 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఉన్నత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 124, 217 ఆర్టికల్స్‌కు లోబడే సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

08/05/2016 - 00:38

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదేశం మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయంలో టిడిపిపి నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు.

08/04/2016 - 18:25

దిల్లీ: దిల్లీ ప్రభుత్వ పాలనలో ప్రధాని మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం మీడియాతో అన్నారు. కొంతమంది విపక్ష నాయకులు దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రధాని కారణమంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిదానికీ మోదీ స్పందించాలని అనుకోవడంలో అర్థం లేదన్నారు.

08/04/2016 - 18:18

ఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లును రేపు రాజ్యసభలో పెట్టనున్నారు. టీడీపీలోకి వలసల విషయంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, గవర్నర్ నరసింహన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసి0దే.

08/04/2016 - 16:51

దిల్లీ: ఈరోజు బంగారం ధర రూ.200 తగ్గింది. బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.31,050కి చేరింది. సింగపూర్‌లో ఔన్స్‌ బంగారం ధర 0.4 శాతం తగ్గి 1,352.48 అమెరికా డాలర్లకు చేరింది. కిలో వెండి ధర రూ.870 తగ్గి రూ.46,950కి చేరింది.

08/04/2016 - 16:29

ముంబయి: ఈరోజు మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 27714 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 8551 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.95 వద్ద కొనసాగుతోంది.

08/04/2016 - 16:25

ముంబై: 2015లో అమెరికా జాతీయురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బాలీవుడ్ దర్శక, నిర్మాత మహ్మద్ ఫరూఖీని దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష , రూ.50వేల జరిమానా విధించింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అమెరికా జాతీయురాలు పరిశోధన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఫరూఖీతో ఆమెకు పరిచయం అయింది. ఫరూఖీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

08/04/2016 - 15:50

కోల్‌కత: వైమానిక దళానికి చెందిన హాక్‌ అడ్వాన్స్‌డ్‌ జెట్‌ ట్రైనర్‌ కలైకుంద ( పశ్చిమ బెంగాల్‌లో టేకాఫ్‌ సమయంలోకుప్పకూలింది. జెట్‌లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. టేకాఫ్‌ అవ్వగానే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.

08/04/2016 - 15:34

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో పూర్తి అధికారాలు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటాయని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు అశనిపాతం లాంటిదని పరిశీలకులు భావిస్తున్నారు.

Pages