S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/23/2016 - 18:12

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక(ఆర్‌ఎల్వీ)ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి. నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్‌ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్‌ రన్‌వేపై సురక్షితంగా దిగింది.

05/23/2016 - 17:37

చెన్నై: జయలలిత ప్రమాణ స్వీకారోత్సవంలో తన కుమారుడు స్టాలిన్‌కు అవమానం జరిగిందని డిఎంకె అధినేత కరుణానిధి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టాలిన్‌కు వెనుకవరసలో సీటు కేటాయించారని, ఎన్నికల్లో ఓడిపోయిన నటుడు శరత్‌కుమర్‌కు ముందు వరసలో కూర్చోబెట్టారని ఆయన సోమవారం విలేఖరులతో అన్నారు. 89 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న స్టాలిన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?

05/23/2016 - 17:36

దిల్లీ: ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డును పొరపాటున రన్ వేగా భావించి ఇండిగో విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేసిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ రద్దు (డిజిసిఎ) చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్లిన ఇండిగో విమానాన్ని ఎయిర్ పోర్టు పక్కన రహదారిపై దింపేందుకు ఆ ఇద్దరు పైలెట్లు ప్రయత్నించారు.

05/23/2016 - 17:06

ముంబై: వెస్టిండీస్‌‌కు వెళ్లే భారత జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనున్నాడు. విజయ్, ధావన్, కెఎల్ రాహుల్, పుజారా, రహానే, ఆర్ శర్మ, డబ్ల్యూ సహా, అశ్విన్, జడేజా, ఇశాంత్, షమీ, బి కుమార్, ఉమేశ్, ఎస్ ఠాకూర్, బిన్నీ జట్టుకు ఎంపికయ్యారు.

05/23/2016 - 17:03

ముంబై: జింబాబ్వే వెళ్లే భారత జట్టును బిసిసిఐ సోమవారం నాడు ప్రకటించింది. ధోనీ (కెప్టెన్‌), మనీశ్ పాండే, రాయుడు, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, మన్‌దీప్ సింగ్, జయంత్ యాదవ్, రుషి ధావన్, కెఎల్ రాహుల్, ఫైజల్, బరిందర్ సరన్, జయదేవ్ ఉనడ్‌కట్, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, ధవళ్ కులకర్ణి, బుమ్రా ఎంపికయ్యారు. మూడు వన్డే, మూడు టి20 మ్యాచ్‌లు భారత జట్టు ఆడనుంది.

05/23/2016 - 15:03

ముంబయి: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగంపై బాలీవుడ్ నటుడు, నిర్మాత రాకేశ్ రోషన్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. తనయుడు హృతిక్ రోషన్ హీరోగా రాకేశ్ నిర్మించిన ‘క్రిష్ 3’ సినిమాకు తన నవల ‘సూఅర్దాన్’ నవలలో నుంచి కథను చౌర్యం చేశారని రూప్ నారాయణ్ సోంకార్ అనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

05/23/2016 - 15:02

చెన్నై: రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి డిఎంకె కోశాధికారి స్టాలిన్ సోమవారం ఉదయం జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అందరి దృష్టి స్టాలిన్‌పై పడింది. జయలలిత ఆహ్వానం పంపినప్పటికీ డిఎంకె అధినేత, మాజీ సిఎం కరుణానిధి ఈ కార్యక్రమానికి రాలేదు. ఆయన కుమారుడు స్టాలిన్ నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే హాజరుకావడం చర్చనీయాంశమైంది.

05/23/2016 - 13:51

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచిబయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

05/23/2016 - 12:45

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండోసారి గెలిచిన అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సోమవారం ఉదయం 28 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై జయకు శుభాకాంక్షలు తెలిపారు.

05/23/2016 - 12:44

శ్రీనగర్: శ్రీనగర్ పట్టణంలోని జైదల్ పోలీస్ స్టేషన్‌పై కొందరు ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎఎస్‌ఐ, కానిస్టేబుల్ మరణించగా, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో సంఘటన ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Pages