S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/25/2016 - 08:11

ఇంఫాల్, మే 24: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో ఆదివారం ఆరుగురు అసోం రైఫిల్స్ జవాన్లను మట్టుబెట్టిన మిలిటెంట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని సైన్యం మంగళవారం స్పష్టం చేసింది. ‘తీవ్రవాద నిరోధక ఆపరేషన్లలో చొరవ, అవకాశం అనేది ముఖ్యమైనవి. ఈ అవకాశం మిలిటెంట్లకు లభించింది.

05/25/2016 - 08:10

న్యూఢిల్లీ, మే 24: దేశంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. మోదీ రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రత, పని దినాల కుదింపువంటిని మెరుగు పరచాలంటే చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు.

05/25/2016 - 08:10

డెహ్రాడూన్, మే 24: రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ను మంగళవారం సిబిఐ విచారించింది. మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించిన తరువాత బలపరీక్షలో తనకు అనుకూలంగా ఓటేయాలంటూ ఎమ్మెల్యేలతో రావత్ బేరసారాలు చేశారని ఆరోపణ. స్టింగ్ ఆపరేషన్ వీడియో క్లిప్పింగ్‌లు సంచలనం సృష్టించాయి.

05/25/2016 - 08:09

న్యూఢిల్లీ, మే 24: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీట్‌పై తాజాగా చేసిన ఆర్డినెన్స్‌తో ఈ రెండేళ్లలో ఎన్‌డిఏ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 21కు చేరింది. ఆర్డినెన్స్‌లలో అత్యంత వివాదాస్పదమైంది భూ సేకరణ బిల్లు. 2014 మేనెలలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రెండు ఆర్డినెన్స్‌లకు సిఫార్సు చేసింది.

05/25/2016 - 08:08

న్యూఢిల్లీ, మే 24: దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన విదేశీయుల వేలిముద్రల సేకరణ భారీ డేటాబ్యాంకును సృష్టించింది. ఈ-టూరిస్టు వీసాపై దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడి వేలిముద్రలను సేకరించి భద్రపరిచే వ్యవస్థను కొన్ని రోజుల క్రితం ప్రారంభించింది.

05/25/2016 - 08:08

న్యూఢిల్లీ, మే 24: సామాన్యుడు మొదలుకొని సంపన్నుల దాకా అందరూ తినే ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారక రసాయనాలున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడయిన ఒక రోజు తర్వాత ఈ అంశంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నివేదిక అందిన వెంటనే తగుచర్య తీసుకుంటామని ప్రభుత్వం తెలియజేసింది.

05/25/2016 - 07:06

పుణె, మే 24: ఉల్లిపాయ కోస్తే కన్నీరు... ధర పెరిగితే వంటింట్లో కన్నీరు... ధర తగ్గిపోతే రైతు కంట్లో కన్నీరు... ఉల్లిపాయ విషయంలో ఎటుచూసినా కన్నీరే మిగులుతోంది. కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటి దేశవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. తాజాగా ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. ఇదీ నేటి పరిస్థితి.

05/25/2016 - 07:00

గౌహతి, మే 24: ఈశాన్య రాష్ట్రం అసోంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సోమవారం పగ్గాలు చేపట్టింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నాయకుడు శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఖనపరా ఫీల్డ్స్‌లో జరిగిన భారీ బహిరంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల సమక్షంలో గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సోనోవాల్ చేత ప్రమాణం చేయించారు.

05/25/2016 - 06:59

గువహటి, మే 24: అసోంతోపాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి సహాయ, సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈశాన్య రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓ పటిష్టమైన విధానాన్ని ముందుకు తెస్తుందని తెలిపారు. మొత్తం ఈశాన్య భారత సమగ్ర అభివృద్ధికి అసోం కేంద్రం కాబోతోందని, దీని ఆలంబనగానే ఈ ప్రాంతం సర్వతోముఖంగా ప్రగతి పరుగులు పెడుతుందని మోదీ తెలిపారు.

05/25/2016 - 05:50

న్యూఢిల్లీ, మే 24: ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీ) జాబితాలో వరంగల్‌కు చోటులభించింది. రెండో విడతలో 13 స్మార్ట్ సిటీస్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ప్రకటించారు. స్మార్ట్ సిటీస్‌లో హైదరాబాద్‌కు బదులు కరీంనగర్‌కు స్థానం కల్పిచాలన్న అంశం పరిశీలనలో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు.

Pages