S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/25/2016 - 05:21

న్యూఢిల్లీ, మే 24: రాష్ట్రాల బోర్డులను నీట్‌నుంచి మినహాయిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోద ముద్ర పడింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం నాలుగు రోజుల చైనా పర్యటనకు బయలుదేరే ముందు నీట్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ఈమేరకు మెడికల్‌కు, డెంటల్‌కు వేర్వేరుగా ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయ.

05/24/2016 - 18:12

చెన్నై: తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు డిఎంకె అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను వెనుకసీట్లో కూర్చోబెట్టి అవమానించినట్టు వచ్చిన వార్తలపై సిఎం జయలలిత స్పందించారు. స్టాలిన్ వస్తున్నారని ముందుగా సమాచారం లేనందువల్లే ఇలా జరిగిందని ఆమె మంగళవారం వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన పొరపాటు కాదని, ఈ విషయమై ఇక రాద్ధాంతం అనవసరమని ఆమె స్పష్టం చేశారు.

05/24/2016 - 18:11

చెన్నై: డిఎంకె శాసనసభా పక్షం నాయకుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిఎంకె ఎమ్మెల్యేలతో మంగళవారం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అసెంబ్లీలో డిఎంకె నాయకుడిగా ఎన్నికైన స్టాలిన్ ఇక ప్రతిపక్ష నేతగానూ వ్యవహరిస్తారు. 1989 నుంచి ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికయ్యారు. గతంలో చెన్నై మేయర్‌గా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ సిఎంగా స్టాలిన్ పనిచేశారు.

05/24/2016 - 18:11

దిల్లీ: మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్‌బేడీ బుధవారం నాడు పుదుచ్చేరి గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొంతకాలంగా అండమాన్, నికోబార్ గవర్నర్ అజయ్‌కుమార్ సింగ్ పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకె కూటమి అధికారం కైవసం చేసుకున్న తరుణంలో కిరణ్‌బేడీని అక్కడికి గవర్నర్‌గా కేంద్రం పంపడం చర్చనీయాంశమైంది.

05/24/2016 - 17:17

గౌహతి: అస్సాం ముఖ్యమంత్రిగా బిజెపి శాసనసభా పక్షం నేత శర్వానంద సోనోవాల్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు హాజరయ్యారు.

05/24/2016 - 17:16

దిల్లీ: దేశ రాజధానిలో మంచినీరు, విద్యుత్ సరఫరాలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాంగ్రెస్, బిజెపి ఆధ్వర్యంలో మహిళలు మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలు, కుండలతో ప్రదర్శన జరిపారు. విద్యుత్ ఓల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు పాడైపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/24/2016 - 17:18

దిల్లీ: ‘నీట్’ పరీక్ష నుంచి ఏడాది పాటు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు న్యాయవాది అమిత్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలుకాకుండా ఇలా ఆర్డినెన్స్ విడుదల చేయడం దేశ చరిత్రలో ప్రథమమని, ఆర్డినెన్స్‌పై తాను సుప్రీంలో చాలెంజ్ చేస్తానని ఆయన ప్రకటించారు.

05/24/2016 - 17:14

దిల్లీ: పాకిస్తాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను త్వరలోనే పట్టుకుని భారత్‌కు తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దావూద్ నేరాలకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలను ఇప్పటికే పాక్ సర్కారుకు అందజేశామని ఆయన మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. మతోన్మాద తీవ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐఎస్) వల్ల మన దేశానికి ముప్పు లేదన్నారు.

05/24/2016 - 17:14

దిల్లీ: ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఎయిర్ అంబులెన్స్ మంగళవారం ఉదయం దిల్లీ సమీపంలోని నజఫ్‌గఢ్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఇందులో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్ అంబులెన్స్ ఇంజన్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు.

05/24/2016 - 17:11

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (నీట్) 2017-18 విద్యా సంవత్సరం నుంచి అనివార్యమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ‘నీట్’పై త్వరలోనే చట్టాన్ని చేసి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలు ‘నీట్’ ద్వారానే జరుగుతాయన్నారు.

Pages