S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు మధ్యలో ఆడకూతురు

ఆమె
రోడ్డు మధ్యలో
జడుసుకుంటూ బతికే జనం మధ్యలో
అర్ధనగ్నంగా...
అడ్డొచ్చిన గుడ్డలను పీకేస్తూ
గౌరవం ముసుగేసుకున్న మనుషుల
మీదకు విసిరేస్తోంది
విలాసంగా వికారాలను
దాచుకున్న మగాళ్లను కడిగేస్తోంది
ఆచ్ఛాదన లేని ఆ దేహం
అందరి అమ్మలాగే ఉంది

అది రాయైనా, రప్పైనా
రాటుదేలిన మాటైనా
పరికించి చూసే పురుషుల మీదకు
విసురుతూనే ఉంది

ఎవడో...
ప్రేమించి, నమ్మించి,
కామంతో తూకం వేసి
తెల తెల్లవారుజామున జారుకుని
దొరలా ఈ సభ్య సమాజంలో కలిసిపోయాడు

- బసు పోతన, 9440878247

నా ఊహల పిచ్చుక గూడు

పచ్చి పచ్చి తాటికమ్మలు
పెద్ద పెద్ద బండరాళ్లను నెత్తికెత్తుకుని
సచ్చిపుట్టిన
తాటి కమ్మల బతుకు చిత్రం నాది
గుడిసె కొనగొమ్ము మీద
గోనెసంచి కట్టుకుని
సుతిలబద్ద పట్టుకున్న అయ్య
రుషి లెక్కనే మాట్లాడుతడు
నేనేమో
గుడిసెకన్ని సక్క సక్కటి వాసాలు
వెట్టాలని అంటా
తానేమో
వంకర దాని దాపున సంకటిది
సంకటి దాని దాపున వంకరది
మనిషి కూడా అంతే అంటడు
మళ్లవోతే
అన్ని గల్తెనే గుడిసె పొంకంగ ఉంటదని
వాసాలన్నిటినీ కలిపే పెండెకట్టు లెక్క
మాట్లాడుతడు.
పాతకమ్మలు అసలే పెట్టద్దు
అవి మూడేండ్లయి అని నేనంటే

- నాగిళ్ల రమేశ్, 7382744824

వొక పగిలిన కల

ఈ రాత్రి ననె్నలా నిద్రపుచ్చుతుంది?

సౌకర్యాల లేపనం రాసుకున్న ఒంటికి
చెమట చుక్క బరువైన వాడిని
పట్టిందల్లా బంగారంగా మెరిసి
నడమంత్రంగా అందలమెక్కిన వాడిని
చుట్టూరా పచ్చనోట్ల రెపరెపల గాలులకు
ఉల్లాసంగా పరవశాల ఊయలలూగిన వాడిని

అయినా ఈ రాత్రి నేనెలా నిద్రపోవాలి?

చట్టాల లొసుగులకు వల పన్ని
నల్ల పుస్తకంలో దాచుకున్న వాడిని
ఏ ముఖానికి తగిన ఆ రంగు పూసుకుని
మరకలు అంటని చొక్కా ధరించిన వాడిని
డబ్బుని ప్రేమించి మోహించి
సకల మానవ సంబంధాల్ని తెంచుకున్న వాడిని

అయినా, గానీ ఈ రాత్రిని ఎలా దాటించగలను?

- దాట్ల దేవదానంరాజు, 9440105987

కథావస్తు వైవిధ్యం ( శ్రీవిరించీయం 24)

కథావస్తువులో వైవిధ్యం కనబరుస్తున్న కథలు వస్తూనే వున్నాయి. కాని బహు స్వల్ప సంఖ్యలో వున్నాయి. రచయితలు యింకా నేల-నీరు వదలి, గాలి-వెలుతురు- ఆకాశ అవకాశాల వయిపు అలవోకగా పరుగులు తీయలేకపోతున్నారు. భౌతికతను అధిగమించి, మానసికత- బౌద్ధికత- ఆత్మీయత వయిపు చేతులు చాచలేకపోతున్నారు.
మనిషి తన స్వస్వరూపాన్ని కనుగొనడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. ఈ శ్రమను కథలుగా ‘రికార్డ్’ చేసుకుంటున్నాడు. అతన్ని ఆకట్టుకోవడం కోసం, కాల్పనిక రచయిత కొత్త సంవిధానాలు కనుగొని తప్పనిసరిగా ముందుకు వెడుతున్నాడు.

వూటుకూరి సాహితీ సౌరభం

తెలుగు పరిమళం
పేజీలు: 74 వెల: రూ.75/-
ప్రతులకు :
వూటుకూరి కృపారాణి;
12/29/1, అశోక్‌నగర్,
కొయ్యలగూడెం, ప.గో.జిల్లా- 534312
అన్ని పుస్తకాల షాపుల్లోనూ...

- వి.యస్.ఆర్.యస్.సోమయాజులు

మరుగునపడిన మహనీయుడు

అమెరికా, న్యూజిలాండ్‌లోని ఆదిమ తెగల్లాగే హిందూ జాతి కూడా
అంతరించి పోతుందని లెఫ్టినెంట్ కల్నల్ యు.ఎన్.ముఖర్జీ నూరేళ్లకు పూర్వమే ప్రమాద ఘంటిక
మోగించాడు. దానికి స్పందించే స్వామి శ్రద్ధానంద శుద్ధి, సంగఠన్ లను మహోద్యమంగా చేపట్టి,
బలవంతంగా మతాంతరీకరణ
అయినవారిని లక్షల సంఖ్యలో హిందూ ధర్మంలోకి తిరిగి
తీసుకొచ్చాడు.

2న అండర్ వరల్డ్..

అండర్ వరల్డ్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అండర్‌వరల్డ్ బ్లక్‌వార్స్ 3డి పేరుతో రూపొందుతున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది అన్నా పోర్‌స్టర్. హాలీవుడ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి హీరోయిన్ అన్నాపోర్‌స్టర్ మాట్లాడుతూ, ఇంటిలిజెంట్‌గా ఉండే ఓ అమ్మాయి అండర్‌వరల్డ్‌పై ఎలా అటాక్ చేసింది అనే ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుందని, ఇందులో బ్రిలియంట్ యువతిగా కనిపిస్తానని చెప్పింది.

బేతాళుడు సిద్ధం

విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా మానస్‌రిషి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ప్రదీప్‌కుమార్ దర్శకత్వంలో కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘బేతాళుడు’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పది నిమిషాల టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ నటుడిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా ఉన్న తనకు ఈ చిత్రం సరికొత్త గుర్తింపు ఇస్తుందని, సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించిన తాను గత చిత్రాల పాత్రలకు భిన్నమైన కథలో నటించానని, సరికొత్త ఫ్లేవర్ చిత్రంలో ఉంటుందని తెలిపారు.

పోకిరి రాజా వస్తున్నాడు

జీవా, హన్సిక జంటగా సెల్వకుమార్ సమర్పణలో రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉసిరికల హనీప్రమోద్, పి.శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పోకిరిరాజా. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్నామని, జీవా నటన, హన్సిక గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారని తెలిపారు.

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

లక్కీ మీడియా పతాకంపై హెబ్బాపటేల్, రావురమేష్, తేజస్వి మడివాడ, అశ్విన్‌బాబు, పార్వతీశం, నోయల్‌సేన్ ప్రధాన తారాగణంగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్’. నిర్మాత మాట్లాడుతూ,‘అమ్మాయికి తండ్రంటే ప్రాణం. తండ్రికి కూతురు అంటే ఆరోప్రాణం. పుట్టినప్పటి నుంచి కాలు కందకుండా పెంచితే, ఆ అమ్మాయికి ఈడువచ్చాక బాయ్‌ఫ్రెండ్స్ పేరిట ఆమె జీవితంలోకి ముగ్గురు వస్తారు. ఇంతకీ ఎవరాముగ్గురు? ఆ ముగ్గురి పట్ల ఆమె తండ్రికి ఉన్న అభిప్రాయం ఏమిటి? అంతరార్థం ఏమిటి? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించామ’ని తెలిపారు.

Pages