S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల హాకీ

మెల్బోర్న్, నవంబర్ 27: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు ఆదివారం జరిగిన చివరి, మూడో టెస్టులో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్‌లో చెరొక విజయాన్ని సాధించిన భారత్, ఆస్ట్రేలియా మహిళలు చివరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగారు. ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మొదటి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో దీపిక, రాణి కలిసి బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఆసీస్ గోల్ పోస్టు సమీపంలో దానిని వందన కతారియాకు పాస్ చేశాడు. ఆమె దానిని సమర్తంగా గోల్ పోస్టులోకి పంపించి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది.

పరువు నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా

అడెలైడ్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, మూడో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెలు కున్న ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థి చేతిలో వైట్‌వాష్ వేయంచుకునే దుస్థితి నుంచి బ యటపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 124 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ ముందు కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో మూడు వికెట్లు చేజార్చు కొని విజయభేరి మోగించింది.

వికాస్‌కు ఎఐబిఎ అవార్డు

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) అవార్డు లభించనుంది. వచ్చేనెల 20న జరిగే వార్షిక సమావేశంలో ‘ఉత్తమ బాక్సర్’ అవార్డును బహూకరిస్తామని వికాస్‌కు రాసిన లేఖలో ఎఐబిఎ తెలిపింది. బాక్సింగ్ రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నామని 2010 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2014లో అవే పోటీల్లో కాంస్య పతకం సాధించిన వికాస్ తనను అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

ఆదుకున్న బాబర్

హామిల్టన్, నవంబర్ 27: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో బాబర్ ఆజమ్ ఆదుకోవడంతో పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయగలిగింది. అయితే, న్యూజిలాండ్ కంటే 55 పరుగులు వెనుకంజలో నిలిచింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించగా, రెండు వందల పరుగుల మైలురాయిని చేరడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే బాబర్ ఆజమ్ 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు కోరుకుంది.

సంస్కృతి

ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగినవారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయ భావనచే ప్రభావితులై ఒక దేశ వాసులుగా మెలుగుతున్నారు. జాతీయ సంస్కృతికి మారుపేరయినది.
మానవ సంస్కృతి మనిషి భూమిపై జన్మించినప్పటినుంచీ అనేక మార్పులకు లోనై నేటి దశకు చేరుకొంది. మనిషి భావ సంపద పెరిగే కొలదీ నాగరికత సంస్కృతులు ఫెరుగుతూనే ఉంటాయి. కాలానుగుణంగా అవి ప్రభావితమవుతూనే ఉంటాయి. అయితే సంస్కృతికి నాగరికతకు స్పష్టమైన భేదం ఉంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

కాశీఖండం 74

శివుడు త్రిపురాసురుల భార్యల చెక్కిళ్ల రచించబడిన గజాకార మకరాకార కస్తూరికా పత్రములు తుడిచిపెట్టినవాడు. జలంధరాక్షసుడి హృదయ గర్వాన్ని నాశనం చేసినవాడు. గజాసురుడి శిరోగ్రభాగాన్ని అణచివేసినవాడు. ధక్షుడి అధ్వరం అనే లేడిని చంపడంలో క్రూరమైనవాడు. హిమగిరి కన్య అయిన పార్వతీ దేవి భ్రూవల్లీ విలాస రేఖామాదిర లలిత శృంగం కలదీ అజగవం ఆ అజగవం లేక పినాకం అనే ధనుస్సులో శివుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని సంధించాడు.

శ్రీపాద కృష్ణమూర్తి

కొత్త స్నేహితులు 28

‘‘అవ్వ పేరే ముసలమ్మ అబ్బాయిగారూ! ఇంతకుముందు మీరన్నారే.. భార్యాభర్తలు ఒకరి మనసులోకి మరొకరు పరకాయ ప్రవేశం చేయాలని. చెప్పాలంటే స్నేహం మాత్రమే చేస్తున్నామనే భ్రమలో.. మీరిప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నారు.
నా అంచనా నిజమైతే.. మీరు స్నేహమనుకుంటున్న మీ పరిచయం మున్ముందు ప్రేమగా రూపాంతరం చెంది అతి త్వరలోనే మీరూహించని మలుపులు తిరిగే అవకాశం నా కళ్లక్కట్టినట్టుగా గోచరిస్తోంది’’ అన్నాడు గౌతమ్.
‘‘మావాణ్ణి మరీ అంతలా బెదరగొట్టేయకండి గౌతమ్‌గారూ.. మావాడసలే భయస్తుడు కూడానూ!’’
వాళ్లిద్దరి మాటలు వింటూ అప్పటివరకూ వౌనంగా ఉన్న మహర్షి అన్నాడు, విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తూ.

సీతాసత్య

నేర్చుకుందాం

మ తలమీదం గుసుమ ప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండనాసిక తుదన్ గంధప్రసారంబులో
పల నైవేద్యము జేర్చు నే మనుజుడా భక్తుండు నీకెపుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

Pages