S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీన్‌దయాళ్‌కు ఘన నివాళి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: స్థానిక బిజెపి కార్యాలయంలో ఆదివారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని ఘనంగా నిర్వహించారు. దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసంఘ్ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చిలకలపూడిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

ఎంపిపి ఉప ఎన్నికపై ఉత్కంఠ!

పెడన, సెప్టెంబర్ 25: పెడన మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఈ నెల 29న జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయాన్ని కాక పుట్టిస్తున్నాయి. ఎంపిపి పదవిని దక్కించుకునేందుకు గతంలోనే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ నాడు టిడిపి వ్యూహానికి ఆ పదవిని కాస్తా చేజార్చుకుంది. వైకాపా తరఫున నందిగామ నుండి పోటీ చేసిన జన్ను భూలక్ష్మిని చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ వైపునకు తిప్పుకొని ఆమెకు ఎంపిపి పదవిని కట్టబెట్టారు. తర్వాత కొంతకాలానికి భూలక్ష్మిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడింది.

శ్మశానవాటికపై మళ్లీ వివాదం!

నాగాయలంక, సెప్టెంబర్ 25: స్థానిక శ్మశానవాటిక స్థలం విషయంలో నాగాయలంక, రేమాలవారిపాలెం గ్రామాల మధ్య తిరిగి వివాదం రాజుకుంది. ఈ నెల 24న రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన రేమాల వెంకటరత్నం అనే మహిళ మృతదేహాన్ని నాగాయలంక పంచాయతీ పరిధిలోని తాగునీటి చెరువు దక్షిణం వైపున ఖననం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగు చూడటంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి కె త్రిపురసుందరి, సర్పంచ్ శీలి రాము తమకు అందిన సమాచారం మేరకు శ్మశాన స్థలానికి వెళ్లి నివారించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

రేపు రైతులతో కలెక్టర్ సమావేశం

జి కొండూరు, సెప్టెంబర్ 25: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతలతో ఈ నెల 27న విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ సుధారాణి ఆదివారం తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు సమంజసమైన ధర ఇవ్వనందుకు రైతులు రహదారి విస్తరణ పనులను అడ్డుకున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు రైతులకు సరైన నష్టపరిహారం ఇప్పించేందుకు వారితో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 27న వారితోనే సమావేశమై చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు.

శ్రీ కొండలమ్మ ఆలయంలో దేవీనవరాత్రుల కరపత్రాలు ఆవిష్కరణ

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 25: మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో అక్టోబరు 1 నుండి 11వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జివిడిఎన్ లీలాకుమార్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా పదకొండు రోజులూ అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 11 రోజులు సాంఘిక, పౌరాణిక, జానపద, కూచిపూడి నృత్యాలు, హరికథా కాలక్షేపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దుర్గమ్మ సన్నిధి మొత్తం స్వర్ణమయం

ఇంద్రకీలాద్రి. సెప్టెంబర్ 25: పసిడికాంతులతోధగ ధగ మెరిస్తున్న శ్రీకనకదుర్గమ్మను బంగారు తలుపుల గుండాలోనికి వెళ్లి దర్శనం చేసుకునే భాగ్యం ఆదివారం నుండి భక్తులకు లభించింది. గతంలో కేవలం అమ్మవారి గోపురం మొత్తం స్వర్ణమయంగా ఉండేది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు గోపురాన్ని వీక్షించేవారు. వైజాగ్‌కు చెందిన ఒక భక్తుడు అమ్మవారి అంతరాయం, తలుపులు, వాటితోపాటు అంతరాలయం రెండు వైపుల గోడలకు సరస్వతీ, లక్ష్మీదేవి, ఇదేవిధంగా అమ్మవారి ప్రధాన ప్రవేశ ద్వారానికి పై భాగంలో ఉన్న గజలక్ష్మీ, ప్రధాన ద్వారం, అన్నింటిని స్వర్ణతాపడం పనులు చేయించారు.

పాలకుల్లో విభేదాలు..

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 25: విజయవాడ నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిందన్న సంతోషం కన్నా విచారమే ఎక్కువగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి 3నెలలకు జరిగే కౌన్సిల్ సమావేశాలు మొదటి నుంచి ఈనెల 23న జరిగిన కౌన్సిల్ వరకూ తీరును పరిశీలిస్తే ఒక పక్క పాలకుల్లో విభేదాలు కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి పెచ్చురిల్లుతున్నాయన్న విషయం మొన్న జరిగిన కౌన్సిల్ తీరే సాక్షిగా నిలుస్తుంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుంటే చరిత్రహీనులవుతారు

విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి డా కె నారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలా? ప్యాకేజీలు కావాలా? అనే అంశంపై ప్రజాభిప్రాయం కోరేందుకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం 7 డివిజన్ నిమ్మతోట సెంటర్‌లో ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు.

మానసిక వికాసానికి క్రీడలు దోహదం

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని మైదానంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్‌కు ఆటల పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సూచనలు, సలహాలు రాష్ట్ర, దేశ అభివృద్ధికి చాలా అవసరమని చెప్పారు.

ట్రాఫిక్‌పై అవగాహన తెచ్చేందుకు కదం తొక్కిన యువత

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: నగరంలో ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన తీసుకురావడానికి ఆదివారం యువతీ యువకులు కదం తొక్కారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో ట్రాఫిక్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పర్యవేక్షణలో నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాలను చేపట్టారు. ట్రాఫిక్ భద్రతపై పూర్తి అవగాహన తీసుకురావడానికి ట్రాఫిక్ పోలీస్, ఆంధ్రా లయోలా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశా ల విద్యార్థులతో కలిసి బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి ఆంధ్ర లయో లా కళాశాల వరకు 3కె రన్‌ను నిర్వహించారు.

Pages