S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలడిగ్బంధం!

చోడవరం, సెప్టెంబర్ 25: అల్పపీడనం ప్రభావంతో శనివారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. పట్టణంలో అనేక కాలనీలు నీటమునిగాయి. అర్ధరాత్రి 12గంటల నుండి మూడు గంటల వరకు వర్షం బీభత్సం సృష్టించింది. ద్వారకానగర్, రెల్లికాలనీ, బాలాజీనగర్, చైత్రానగర్, కోఆపరేటీవ్ కాలనీ, బానయ్య కోనేరు, దుడ్డు వీధి, గోవిందమ్మకాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేవలం రెండుగంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే మూడు గంటల నుండి ఐదు గంట ల వరకు మరో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకం

విజయనగరం (పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: దేశ ఆర్ధికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుందని జెడ్పీచైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ విద్యార్థులు ఆదివారం దక్షిణాది రాష్ట్రాల వంటకాలు, సంస్కృతి ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వాతిరాణి మాట్లాడుతూ ప్రభుత్వాలు పర్యాటక రంగ ం అభివృద్ధికి కృషి చేస్తే వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు.

పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ‘శ్రీకారం

విజయనగరం(పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: వైభవంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు ఆదివారం పందిరి రాటతో శ్రీకారం చుట్టారు. చదురుగుడి ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు, వనంగుడి ప్రాంగణంలో ఉదయం పది గంటలకు మేళతాళాలతో, వేదమంత్రాల నడుమ పందిరిరాటను వేశారు. ఈసందర్భంగా వేకువజామున అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.పందిరిరాటకు ముందు వినాయకపూజ, భూమి పూజలను నిర్వహించారు. అనంతరం పసుపు-కుంకుమలు రాసిన పందిరిరాటను ఆలయ ప్రాంగణంలో నిలిపారు.

మిద్దె ఇల్లు కూలీ భార్యభర్తలు మృతి

వేపాడ, సెప్టెంబర్ 25: వేపాడ పంచాయతీ శివారు బక్కునాయుడుపేటలో ఆదివారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో మిద్దె ఇల్లు కూలిపోయి భార్యభర్తలు మృతి చెందారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిగోడలు పూర్తిగా నానిపోవడంతో మిద్దె ఇల్లు ఆకస్మికంగా కూలిపోయింది. ఈ సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న కర్రి అప్పారావు(70), భార్య నాగరాజు(65) మృతి చెందారు. కూలిపోయిన సమయంలో ఉరుములు, మెరుపులతో బోరున వర్షం కురుస్తున్నందున చుట్టుపక్కల ఇళ్లవారు ఎవరు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. నిరుపేదలైన ఈ దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

ఆదాయంలో మిన్న...అభివృద్ధిలో సున్నా

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 25: పట్టణంలో శివారు ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల రూపంలో మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదని, మున్సిపల్ పాలకవర్గసభ్యులు కూడా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజల వాపోతున్నారు. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను, భవన నిర్మాణాల వచ్చే ఆదాయం, ఖాళీ స్థలాలపై పన్ను విధింపుతదితర వాటిద్వారా ప్రతీయేటా 25 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. ఇవి కాకుండా పలు గ్రాంట్ల ద్వారా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు మాత్రం జరగడంలేదు.

మాదేపల్లిలో ప్రబలిన డెంగ్యూ

ఏలూరు, సెప్టెంబర్ 25 : ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో 40 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళకు డెంగూ వ్యాధి వచ్చినట్లు గుర్తించి ఆమెను వైద్య ఆరోగ్య శాఖ వారు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కాదని వైద్యాధికారులు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి హుటాహుటిన మాదేపల్లి గ్రామంలో పర్యటించి నివాసాలకు వెళ్లి పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు. డి ఎంహెచ్ ఓ దగ్గరే వుండి గ్రామంలో రోడ్ల ప్రక్కన బ్లీచింగ్ చల్లించడం, దోమలు ప్రబలకుండా ఫాగింగ్ చేయించడం నిర్వహించారు.

లక్ష్య సాధన వైపు గురిపెడితే విజయం ఖాయం

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25: యువత అపజయాలను లెక్కచేయకుండా లక్ష్య సాధన వైపు గురిపెడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ రజత పతక విజేత పివి సింధు అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆమె తన తల్లిదండ్రులు పివి రమణ, విజయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకొన్నారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.5 కోట్లు రుణం

ఏలూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు అయిదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లాస్థాయి బ్యాంకర్లతో ఆయన బ్రాహ్మణులకు రుణాలందించే విషయంపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుండి 3103మంది పేదలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని పశ్చిమగోదావరి జిల్లాలో 360 మందికి రుణ సౌకర్యం కల్పించడంలో బ్యాంకులు సహకరించాలని ఆయన కోరారు.

ఉద్ధృతంగా యనమదుర్రు డ్రెయన్

భీమవరం, సెప్టెంబర్ 25: అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల యనమదుర్రు డ్రెయిన్‌కు జలవనరుల శాఖ అధికారులు వరద నీటిని వదిలారు. ఈ నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నందమూరు అక్విడెక్ట్ వద్ద క్రమేణా నీటి పరిమాణం పెరుగుతోంది. యండగండి, భీమవరం వరకు అదే విధమైన నీటి ప్రవాహన్ని చూపుతోంది. నీటి ప్రవాహం కారణంగా యనమదుర్రు డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.

పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఏలూరు, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి 2015-16 సంవత్సరంలో 31 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి 11 వేల మందికి లబ్ధిచేకూర్చిందని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐ వై ఆర్ కృష్ణారావు చెప్పారు. స్థానిక శనివారపుపేట శ్రీరామ్‌నగర్‌లోని శ్రీశ్రీ విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ అవగాహనా సదస్సులో కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. గత సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లాలో 1288 మంది లబ్ధిదారులకు 3.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు.

Pages