S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యాకేజీ స్పష్టం చేస్తేనే ఆర్‌అండ్‌ఆర్ సర్వే జరగనిస్తాం

వేలేరుపాడు, సెప్టెంబర్ 25: వేలేరుపాడు మండలంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ఆర్‌అండ్‌ఆర్ సర్వేను ప్యాకేజీ స్పష్టం చేస్తేనే జరగనిస్తామని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుగా ఏర్పాటుచేసిన వివిధ సమావేశాల్లో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ వేలేరుపాడు మండలానికి 2007లోనే పోలవరం భూసేకరణ చేపట్టి కేవలం ఎకరానికి లక్షా 15 వేల రూపాయలే ఇచ్చి, అందులోనే బ్యాంకు రుణాలు జమ చేసుకుని తీరని నష్టం చేశారని, ప్రస్తుతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో సైతం పాత చట్టంతోనే అందించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు.

వ్యాపార రంగంలో నూతన ఒరవడులు సృష్టించాలి

భీమవరం, సెప్టెంబర్ 25: ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతను మరింత మెరుగుపెట్టి వ్యాపార రంగంలో నూతన ఒరవడులు సృష్టించాలని దక్షిణ భారతదేశ థర్మాక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ సామిల్ షా పిలుపునిచ్చారు. భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రెండురోజులుగా ఉత్సాహవంతంగా జరుగుతున్న జాతీయస్థాయి విష్ణు ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 (ఇ-బైక్ రేసింగ్) పోటీలు ఆదివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 25 విద్యార్థి బృందాలు ఇ-బైక్ నమూనాలను వివిధ పరీక్షల్లో ప్రదర్శించి తుది మెరుగులు దిద్దుతున్నారు.

‘ఓపెన్’ దందా

ఏలూరు, సెప్టెంబర్ 25 : చిన్నప్పుడు చదువుకున్న బేతాళ కధలా ఈ వ్యవహారం కూడా మారిపోయింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న తంతు అంతా తప్పుదోవ పడుతూనే వున్నా దానిపై విమర్శలు చెలరేగుతూనే వున్నా ఉన్నతాధికారుల దృష్టి మాత్రం ఈ వ్యవహారంపై లేకుండా పోతుంది. చివరకు ఇది ఒక బహిరంగ రహస్యంలా, ఓపెన్ దందాగా మారిపోయిందనే చెప్పవచ్చు. ఈ ఉపోద్ఘాతమంతా ఓపెన్ స్కూల్స్ పరీక్షల గురించే. వాస్తవానికి పాఠశాలల్లో సాధారణ విద్యను అభ్యసించే వారు పదేళ్లపాటు చదివితే పదవ తరగతి పరీక్షలురాయడానికి అర్హులవుతారు. అలాగే మరో రెండేళ్లు చదివితే ఇంటర్మీడియట్ పరీక్షలకు అర్హులవుతారు.

అవకాశాల కోసం ఎదురు చూడకుండా.. చేదక్కించుకోండి..

విజయవాడ: జీవితంలో అన్నిటికన్నా సమయం విలువైనదని, యువత అవకాశాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను చేదక్కించుకోవాలని మాజీ సిఐడి జాయింట్ డైరక్టర్, మహారాష్ట్ర, నాం దేడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ సూచించారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో జరిగిన ఇం పాక్ట్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి అవకాశాలను ఎలా సద్వినియోగపరచుకోవాలి అనే అంశంపై ప్రసంగించారు.

నాది ‘పాల పార్టీ’!

కూచిపూడి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కృష్ణామిల్క్ యూనియన్ శ్రేయస్సు కోసం తాను అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటానని, తనది ‘పాల పార్టీ’ అని ఛైర్మన్ మండవ జానకిరామయ్య అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన పాల సరఫరా, పాల రైతులకు అత్యధిక ధరను చెల్లించి ఏడాదికి రూ.560 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోని అన్ని మిల్క్ యూనియన్‌ల కన్నా కృష్ణామిల్క్ యూనియన్ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. కృష్ణామిల్క్ యూనియన్‌కు 6వ విడత ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన మొవ్వ సొసైటీ అధ్యక్షులుగా తొలిసారిగా ఆదివారం గ్రామానికి వచ్చారు.

అభయాంజనేయుని దర్శించుకున్న సింధు

హనుమాన్ జంక్షన్: ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన భారత షట్లర్ పివి సింధు ఆదివారం స్థానిక అభయాంజనేయుని దర్శించుకున్నారు. గన్నవరం నుంచి ద్వారకా తిరుమల వెళుతున్న సింధు హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈసందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధు వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లూరి రమేష్, అభయాంజనేయ స్వామి ఆలయ పాలక మండలి ఛైర్మన్ పావులూరి రామారావు, తదితరులు ఉన్నారు.

పెరుగుతున్న కృష్ణా నీటిమట్టం

అవనిగడ్డ: కృష్ణానదికి వరద నీరు విడుదల కావటంతో మండల పరిధిలోని తీరగ్రామాల నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మండలంలోని కృష్ణానది పరీవాహక గ్రామాలను ఆదివారం సందర్శించారు. రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు గ్రామస్తులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి లక్షా 41వేల క్యూసెక్కుల నీరు విడుదల కావటంతో నీటి ప్రవాహ వేగం ఆదివారం రాత్రికి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదార్లకు ప్రథమ ప్రాధాన్యం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్గత రహదారులు నిర్మించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తాళ్ళపాలెం పంచాయతీ పరిధిలోని సత్తెనపాలెం దళితవాడకు ఎన్‌పిఆర్‌ఎంపి పథకం కింద రూ.56 లక్షల వ్యయంతో చేపట్టిన తారురోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గ్రామీణ డొంక రోడ్ల నిర్మాణానికి, అన్ని రహదారుల నిర్మాణానికి ఎక్కువగా ఉపాధి హామీ నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు.

పంట పొలాలను ముంచిన భారీ వర్షం

చందర్లపాడు, సెప్టెంబర్ 25: వారం నుండి కురుస్తున్న వర్షాలకు తోడు ఆదివారం చందర్లపాడు మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. జూన్‌లోనే పత్తి వేయటంతో పంట చేతికొచ్చే సమయానికి కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు నల్లబడి దిగుబడి పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.20వేలు కౌలు చె ల్లించి వేలాది రూపాయలు పెట్టుబడు లు పెట్టి పంట చేతికొస్తుందన్న సమయంలో వర్షాలు నిండా ముంచా యి. ఇప్పటికే గూడ మొత్తం రాలిపోగా ఉ న్న కాయలు నల్లగా మారిపోయాయి. మిరప చేలలో నీరు నిలవటంతో మొక్కలు వడబడి పోయి ఎండి పోతున్నాయి.

తెలుగు జాతిరత్నం ‘మండలి’

అవనిగడ్డ, సెప్టెంబర్ 25: తెలుగు జాతిరత్నం దివంగత మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10గంటలకు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ముగ్గురు ప్రముఖులకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన తనయుడు, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమాలను వివరించారు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు పద్మశ్రీ డా. ఎస్‌వి రామారావు, ప్రముఖ సినీ గీత రచయిత, సాహితీవేత్త డా. భువనచంద్ర, ప్రపంచ ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు తమ్మా శ్రీనివాసరెడ్డిలకు ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. దివంగత రాష్టప్రతి డా.

Pages