S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేటు ఎత్తివేత

భైంసా రూరల్, జూలై 22: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక గేటును ఎత్తివేసి 18వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుంది. ఉదయం గడ్డెన్నవాగు ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టును సందర్శించి ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో నీటిని వదిలారు.

మొక్కలు సంరక్షించే బాధ్యత మీదే

తాంసి, జూలై 22: తెలంగాణకు హరితహారంలో ప్రతి గ్రామానికి 40వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని, గ్రామస్తులు స్వచ్ఛందంగా మొక్కలు నాటడమే గాక వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గ్రామస్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తాంసి మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం బండల్‌నాగపూర్ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసమే కెసిఆర్ ముందుచూపుతో హరితహారం ప్రవేశపెట్టారన్నారు.

అమెరికా ఓ అమెరికా...

అది ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల ఆధారంగా అమెరికా మీద ఎక్కువమంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కాని ఎవరైనా అమెరికా పర్యటించి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. మన కమ్యూనిస్టు అగ్ర నాయకులు నారాయణ, రాఘవులు విషయంలో కూడా ఇది రుజువైంది. అమెరికా గొప్పదనం ఏమిటంటే తన దేశస్తులతోపాటు ఇతరులందరికి సమాన అవకాశాలు కల్పించడం. అందుకోసం నిత్యం తపన పడటం. తాము ఎప్పుడూ ఇతరులకంటే అగ్రగాములుగానే ఉండాలనుకోవటం అసూయ కలుగ చేయడంలో ఆశ్చర్యం ఏముంది.

- పుట్టా సోమన్నచౌదరి

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ

మామడ, జూలై 22: మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ముడిపడిఉందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలునాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నాటినప్పుడే వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందన్నారు. దీంతో వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ మనోహర్‌రెడ్డి, సిఐ నరేష్‌కుమార్, ఎస్సై మల్లేష్, శిక్షణ ఎస్సై వినయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆగస్టు 15లోగా హరితహారాన్ని పూర్తి చేయాలి

మంచిర్యాల, జూలై 22: ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడమేకాక వాటి సంరక్షణర బాధ్యత చర్యలుకూడా తీసుకోవాలని మెప్మా అడిషనల్ డైరెక్టర్ వందన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని తూర్పు జిల్లా మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీర్లు, అర్బన్ ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంచేసేలా మంత్రి కెటిఆర్ ప్రణాళిక రూపొందించారన్నారు. ఆగస్టు 15లోగా హరితహారం కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లో విజయవంతం చేయాలన్నారు.

యువతకు సరైన దిశానిర్దేశం కావాలి

వాణి, వీణ అవిభక్త కవలలు. నీలోఫర్ ఆసుపత్రిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. కవలల్ని విడదీసి వార్తల్లోకి ఎక్కిన గుంటూర్ డా.నాయుడమ్మ నుంచి ఆస్ట్రేలియా వైద్యుల దాకా స్పందించినా వారికింకా విముక్తి దొరకలేదు. వీరి దీన గాధను తెరకెక్కించాలని ఏ నిర్మాతకూ తట్టలేదు. తల్లిదండ్రుల అక్రమార్జనకు కొవ్వెక్కి తాగి తందనాలాడి, విచ్చలవిడిగా ప్రవర్తించే వారిపైగాని, వారు నడిపే కారుకిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులపై కాని ఒక్క సినిమా కనపడదు. అభివృద్ధి పేరున భూములు లాక్కోబడి నిర్వాసితులవుతున్న రైతుల నేపథ్యంలో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఏ నిర్మాతకూ రాదు.

నేడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆదిలాబాద్ రాక

ఆదిలాబాద్, జూలై 22: రాష్ట్ర షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఎస్సీల సంక్షేమానికి తీసు కుంటున్న చర్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులతో కలిసి సమీక్షించనున్నట్లు కార్పొరేషన్ ఎడి జెమ్స్ కల్వాల తెలిపారు. జిల్లాలో దళితబస్తీ కింద భూమి కొనుగోలు అభివృద్ధి పథకం, స్వయం ఉపాధి పథకాల కింద రుణాల పంపిణీ, హరితహారం కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీక్షిస్తారని అన్నారు.

కుంటాలలో భారీ వర్షం

కుంటాల, జూలై 22: మండల కేంద్రమైన కుంటాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో శుక్రవారం ఉదయం నుండి కుంటాల మండలానికి రాకపోకలు నిలిచిపోయి పంటలు నీట మునిగిపోయాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి 91.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎఎస్‌వో సాయన్న తెలిపారు. దీంతో ఉదయం నుండే మండలానికి రాకపోకలు నిలిచిపోవడంతోప్రయాణీకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుంటాల నుండి నిర్మల్ పట్టణానికి వెళ్లాలంటే అంబకంటి, నందన్, బామ్ని, నర్సాపూర్ మీదుగా ప్రయాణీకులు వెళ్లారు. భైంసా పట్టణానికి వెళ్లాలంటే ఓల, లింబా, భైంసా మండలంలోని సుంక్లీ గ్రామాల మీదుగా ప్రయాణీకులు గమ్యానికి చేరుకోవాల్సి వచ్చింది.

మానవ మనుగడ కోసం మొక్కలు నాటాలి

కడెం, జూలై 22: మానవ మనుగడ కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో ఎస్పీ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ అటవీ సంపదను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడంతోపాటు నాటిన మొక్కలను పరిరక్షించుకోవాలన్నారు. మొక్కలు నాటినప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని ఆయన తెలిపారు. మొక్కలు పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.

ఏజెన్సీ పల్లెల్లో ముసురుకున్న వ్యాధులు

ఆదిలాబాద్, జూలై 22: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నా యి. నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బీమిని, జన్నారం, నార్నూర్, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో విషజ్వరాల బారిన పడి వందలాది మంది గిరిజనులు ప్రతిరోజు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. విష జ్వరాల భారిన పడి జిల్లాలో వారం రోజుల్లోనే ముగ్గురు మృతి చెందిన సంఘటన అధికార యంత్రాంగం కలకలం సృష్టించగా పలు వసతిగృహాల్లోనూ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.

Pages