S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు రేషన్ తీసుకోకపోతే... కష్టమే!

రామచంద్రపురం/ మండపేట, జూలై 21: ఆగస్టు నెలలో తెల్లకార్డు వినియోగదారులు ఆగస్టు నెలలో రేషన్ సరుకులను తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులు మనుగడలో ఉండవని జిల్లా పౌర సరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జిల్లాలో 14 లక్షల 40 వేల తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో సక్రమ రీతిలో 13 లక్షల 30 వేల మంది మాత్రమే రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్నారు. మిగిలిన లక్షా 10 వేల మంది రేషన్‌కార్డుదారుల పరిస్థితి విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోను ఎక్కడి నుండైనా తెల్లకార్డుదారులు తమ సరుకులను పోర్టబిలిటి విధానంలో తీసుకునే అవకాశం ఉందన్నారు.

కోటిపల్లి -నరసాపురం రైల్వే లైను ఏడేళ్లలో పూర్తి

అమలాపురం, జూలై 21: కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏడేళ్లలో పూర్తిచేసే విధంగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసిందని కోనసీమ రైల్వే లైను నిర్మాణ చీఫ్ ఇంజనీర్ బలిజ అశోక్ వెల్లడించారు. గురువారం కోనసీమ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక కాటన్ గెస్టు హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచామని, టెండర్లు ఖరారైన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారన్నారు. ముందుగా కోటిపల్లి గోదావరిపై సుమారు 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు.

శృంగార వల్లభునికి టిటిడి నిధులు

పెద్దాపురం, జూలై 21: పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని స్వయంభువు శ్రీ శృంగార వల్లభస్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఇంత వరకు అభివృద్ధికి నోచుకోక, జీర్ణదశకు చేరిన ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకుని అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. గతంలో టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి గ్రామంలో పర్యటించి, ఆలయాన్ని సందర్శించి వెళ్లారు. హోం మంత్రి చినరాజప్ప అభ్యర్థన మేరకు ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకునేందుకు ఛైర్మన్ అంగీకారం తెలిపారు.

కొండగుంటూరు, హెచ్‌బి కాలనీలో సబ్-స్టేషన్లు

రాజానగరం, జూలై 21: రాజానగరం మండలంలోని కొండగుంటూరు, హౌసింగ్ బోర్డు కాలనీలో రెండు సబ్ స్టేషన్లు మంజూరుకానున్నాయని రాజమహేంద్రవరం ఇపిడిసిఎల్ ఎస్‌ఇ వై ప్రసాద్ తెలిపారు. రాజానగరం మండలంలోని కానవరం గ్రామంలో రెండుకోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన స్విచాన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజానగరం మండలంలో లోవోల్టేజీ సమస్యను నిర్మూలించేందుకు నూతన సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఫైవ్ స్టార్ జనరేటర్ల పనితీరు బాగానే ఉందని, వాటిపై అపోహలు వద్దని సూచించారు.

అంత్య పుష్కరాలకు 30న ట్రయల్న్

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాల నిర్వహణపై ఈ నెల 30న ట్రయల్ నిర్వహిస్తామని కమిషనర్ వి విజయరామరాజు వెల్లడించారు. 29వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 31న ఉదయం గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమవుతాయన్నారు. గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అంత్య పుష్కరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 27నాటికి స్నానఘట్టాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 31వ తేదీన ఉదయం 5గంటలకు సంబంధిత అధికారులంతా విధులకు హాజరుకావాలన్నారు.

మావోయస్టు సానుభూతిపరులు లొంగుబాటు

చింతూరు, జూలై 21: మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేస్తున్న ఏడుగురు గురువారం జిల్లాలో పోలీసులకు లొంగిపోయారు. ఎటపాక పోలీసు స్టేషన్లో ఒఎస్‌డి ఫకీరప్ప, ఎఎస్పీ శే్వత ఎదుత వీరు లొంగిపోయారు. వీరంతా చింతూరు మండలం లంకపల్లి గ్రామానికి చెందినవారు. కొవ్వాసి ముఖేష్, చోడే ముఖేష్, మడకం ఇడుమా, వంజం దేవ, వెట్టి బేడి, వంజం జోగి, మడకం లలిత గతంలో మావోయిస్టు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్‌కు సానుభూతిపరులుగా పనిచేశారని పోలీసు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వీరంతా లొంగిపోయినట్లు ఒఎస్‌డి ఫకీరప్ప తెలిపారు.

రత్నగిరిపై ఇద్దరు వ్రత పురోహితులు సస్పెన్షన్

శంఖవరం, జూలై 21: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారి సన్నిధి రత్నగిరిపై పనిచేస్తున్న వ్రత పురోహితులు ఇద్దరిని దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు గురువారం సస్పెండ్‌చేశారు. మొదటి శ్రేణి వ్రత పురోహితుడు మొక్కరాల రామకృష్ణ వైదిక నియమావళి పాటించడంలో అనుచితంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. తృతీయ శ్రేణి వ్రత పురోహితునిగా పనిచేస్తున్న మొక్కరాల రవికిరణ్‌శర్మ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, సమయ పాలన సరిగా పాటించకపోవడం, అక్రమ పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవడం వంటిఆరోపణల నేపథ్యంలో ఇరువురు వ్రత పురోహితులను సష్పెండ్ చేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ బాలికలు కాకినాడలో ప్రత్యక్షం!

ఐ పోలవరం, జూలై 21: హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పాఠశాల నుండి బుధవారం అదృశ్యమైన ఇద్దరు బాలికలు వడకుర్తి మాధవి (13), వైష్ణవి (5) కాకినాడ రైల్వే స్టేషన్‌లో గురువారం ప్రత్యక్షం అయ్యారు. ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మాధవి, వైష్ణవిని బంధువులో కోసం స్టేషన్‌లో నిరీక్షిస్తున్న యానాంకు చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం గమనించారు. బాలికలను పిలిచి ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి వచ్చామని, ఎదుర్లంకలో మా మామయ్య ఉన్నారని మాధవి తెలిపింది. వెంటనే సుబ్రహ్మణ్యం వారిద్దరినీ ఎదుర్లలంక తీసుకువచ్చి మాధవి మేనమామ విత్తనాల వీరాస్వామి ఇంటివద్ద అప్పగించారు.

విద్యార్థులకు సన్మార్గం చూపే వ్యాసాలు

విద్యార్థి వ్యాసాలు
-ఒంటెద్దు
రామలింగారెడ్డి
వెల: రు.100/-
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజయవాడ
మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు
***

-కె.ఎల్.ఎ.

Pages