S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా కొత్త ఎత్తుగడ

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య సహజమైన సరిహద్దు లేదు. లేని సరిహద్దును పాకిస్తాన్ 1948-49వ సంవత్సరాలలో కృత్రిమంగా కల్పించగలిగింది. ఈ కృత్రిమమైన సరిహద్దును ఆ తరువాత వెడల్పు చేయగలిగింది. ఇదంతా మన ప్రభుత్వం 1960వ దశకం వరకు కూలబడి ఉండిన ఫలితం, దురాక్రమణకు ముందు మోకరిల్లిన ఫలితం.

కెరమెరిలో కుండపోత వర్షం

కెరమెరి, జూలై 22: కెరమెరి మండలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వర్షంతో కెరమెరి మండలంలోని అట్టి గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పక్కన వేసిన తాత్కాలిక వంతెన రోడ్డు కోతకు గురి కావడంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. 3గంటల నుంచి సాయంత్రం వరకు ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కడెం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

కడెం, జూలై 22: జిల్లాలోని ఐదు మండలాలకు సాగు నీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు జలాశయంలోకి గత రెండు రోజులుగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి దిగువన గోదావరిలోకి ప్రాజెక్ట్ రెండుగేట్లను ఎత్తి 21వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల మూలంగా ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తుంది.

చేలగట్లపై మొక్కల పెంపకం ఏదీ..?

ఆదిలాబాద్, జూలై 22: ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా సాగుతున్న హరితహారం కార్యక్రమం అమలుపై వ్యవసాయ శాఖ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందని, ఇప్పటికీ పంట చేను గట్లలో మొక్కలు నాటకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమేనని రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశా రు. శుక్రవారం మంత్రి జోగురామన్న హరితహారంలో భాగంగా ఆదిలాబాద్‌లోని పాలశీతలికరణ కేంద్రం, తంతోలి రోడ్డులోని కృష్ణనగర్‌లో, తాంసి మండలం బండల్‌నాగపూర్‌లో మొక్కలు నాటారు. బండల్‌నాగపూర్‌లో మొక్కలు నాటుతున్న తీరును, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ముంచెత్తిన వాన

ఆదిలాబాద్, జూలై 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా గురువారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం పశ్చిమ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, భైంసా, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, ఇచ్చోడలో సాధారణం మించి వర్షాలు కురిశాయి. భైంసా, తానూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గడ్డెన్న వాగు జలాశయం నిండుకుండలా తలపిస్తుండగా గోదావరిలోకి వరద నీరు వచ్చిచేరడంతో కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది.

జిల్లాలో ముంచెత్తిన వాన

ఆదిలాబాద్, జూలై 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా గురువారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం పశ్చిమ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, భైంసా, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుడిహత్నూర్, ఇచ్చోడలో సాధారణం మించి వర్షాలు కురిశాయి. భైంసా, తానూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గడ్డెన్న వాగు జలాశయం నిండుకుండలా తలపిస్తుండగా గోదావరిలోకి వరద నీరు వచ్చిచేరడంతో కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది.

స్మార్ట్ సర్వేకు సాంకేతిక బ్రేకులు

కాకినాడ, జూలై 21: జిల్లాలో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్యుమరేటర్ తన పరిధిలో రోజుకు 14 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా 8 నుండి 9 కుటుంబాలను మాత్రమే సర్వే చేయగలుగుతున్నట్టు చెప్పారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసాధికార సర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్నానఘట్టాలను పరిశీలించిన డిఐజి

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం కోటిలింగాలరేవు నుంచి ధవళేశ్వరంలోని రామపాదాలరేవు వరకు ఉన్న ప్రధాన ఘాట్లను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ బి రాజకుమారిని ఆరా తీశారు. కోటగుమ్మం, ఇతర అనుసంధాన ప్రాంతాలను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. అంత్య పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యాత్రికుల రాకపోకలకు విడివిడిగా మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. యాత్రికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వాచ్‌టవర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ముహూర్తం ముంచుకొస్తున్నా...

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి నది అంత్య పుష్కరాల ముహూర్తం తరుముకొస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అధికారులు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్తున్నారే తప్ప ఇంకా ఏర్పాట్లు కానరావడం లేదు. ఇటీవల వచ్చిన గోదావరి వరద వల్ల రేవుల పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోయ దుర్గంధభరితంగా మారాయి. దేశంలోనే అతి పెద్ద ఘాట్లు నిర్మించామని చెబుతోన్న స్నాన ఘట్టాలు సమన్వయ లోపం కారణంగా మురికి కూపాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంత్య పుష్కరాలు పట్టుమని పది రోజులు కూడా లేవు.

Pages