S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం

మానవపాడు, జూలై 22: ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తయారైందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. గద్వాల జిల్లా సాధన కోసం చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు శుక్రవారం ఉండవెల్లి నుంచి బూడ్దిపాడు వరకు కొనసాగింది. ముందుగా వైష్ణవి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పాదయాత్రను కొనసాగించారు. అనంతరం ఉండవెల్లి గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బూడ్దిపాడు ఆర్డీఎస్ క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయని తెలయని జిల్లా మంత్రులు కూడ ఉన్నారంటే ఎంత విడ్డూరమో తెలుసుకోవాలన్నారు.

ఎల్-27 ఎత్తిపోతల పథకం ఆదర్శనీయం

గరిడేపల్లి, జూలై 22 : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎల్-27) తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉందని గోదావరి జలాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులోని సాగర్ ఎడమ ప్రధాన కాల్వపై ఉన్న ఎల్-27 ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం నిపుణలతో కలిసి సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 1969లో రైతుల సహకారంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడం హర్షణీయమన్నారు. తక్కువ ఖర్చుతో నూతన టెక్నాలజీ ద్వారా ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

దళితులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలి

నకిరేకల్, జూలై 22: గుజరాత్‌లో మూడురోజుల క్రితం చనిపోయిన జంతు చర్మాలను తీస్తున్న దళితులపై హిందూ మనోన్మాద శక్తులు దాడులు చేయడాన్ని ప్రజలంతా ఖండించాలని పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సతీష్ పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయపు దాడులపై పివైఎల్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలన్ని, మతద్వేషాలను పెంచి పోషిస్తుందన్నారు.

మహిళ దారుణ హత్య

నూతనకల్, జూలై 22: మండలంలోని పోలుమల్ల గ్రామానికి చెందిన రాగిరి లావణ్య(22) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంట్లో లావణ్య ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి గొంతుకు చున్నీ బిగించి, చేతి మణికట్టుపై గాయపరిచి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు. సంఘటన జరిగిన కొద్ధిసేపటికే ఇంటికి చేరుకున్న మృతురాలి భర్త లింగయ్య రక్తపు మడుగులో పడివున్న తన భార్య లావణ్యను చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలిపారు.

గడువులోగా పుష్కర పనులు పూర్తి

నల్లగొండ, జూలై 22: పుష్కర ఘాట్‌లు, రోడ్ల పనులు ఈ నెల 28వ తేదిలోగా పూర్తి చేయాలని కృష్ణా పుష్కరాల పర్యవేక్షణా ప్రత్యేకాధికారి, ఇరిగేషన్ కార్యదర్శి ఐఏఎస్ వికాస్‌రాజ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ పుష్కరాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పుష్కర ఘాట్‌ల ఇన్‌చార్జి అధికారులు, పోలీస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఘాట్‌లను సందర్శించి చేపట్టాల్సిన కార్యక్రమాలను సమీక్షించాలని, పుష్కరాలకు సంబంధించిన సిబ్బందిని, కావాల్సిన వసతులను ముందస్తుగా సిద్ధం చేసుకుని సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.

ప్రశ్నించే మనస్తత్వమే వికాసానికి మార్గం

నల్లగొండ, జూలై 22: ప్రశ్నించే మనస్తత్వమే విజ్ఞాన, వికాసాలకు మూలమని విద్యార్థులు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతు దేశానికి ప్రశ్నించడం నేర్పింది నల్లగొండ జిల్లాయని, మొదటి నుండి ఈ జిల్లాకు అది సహజ గుణంగా ఉందన్నారు. ఎదుటివారిని ఆలోచింపచేసేలా చైతన్యం కల్గించే ప్రశ్నలు ఎప్పుడు నేరంకావన్నారు. లక్షమందికి పైగా విద్యార్థులు సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా అందించిన చరిత్ర ఎన్‌జి కళాశాల సొంతమన్నారు.

అరాచకవాదానికి కళ్లెం

దేశంలో సామాజిక అశాంతిని కలుగజేయడానికి అరాచకవాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఆ అవకాశం కోసం విచ్ఛిన్నకరవాదులు సిద్ధంగానే ఉంటారు. ఈ పెడధోరణులకు సమాజంలో స్థానం లేదని స్పష్ట పరచడంలో ప్రభుత్వం ముందుండాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపుదిద్దుకొంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన వ్యవస్థని స్వతంత్ర భారతం ఏర్పాటు చేసుకుంది. చట్టాల రూపంలో అందుకు తగ్గ ఆయుధాలు పాలకులకు అందుబాటులోనే ఉన్నాయి.

సూర్యాపేటలో భారీ వర్షం

సూర్యాపేట, జూలై 22: పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో గతంలో తేలికపాటి వర్షం కురియగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుండి 3.30గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని కొత్తబస్టాండ్, జీ-షాపింగ్‌మాల్ సమీపంలో రోడ్డుపై మొకాళ్ల లోతులో వరదనీరు నిలిచిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా హరితహారం

భువనగిరి: తెలంగాణ రాష్ట్రాన్ని ఫూల, పండ్ల, సాంప్రదాయ చెట్లతో ఆకుపచ్చని సస్యశ్యామలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావ్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖా మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. శుక్రవారం భువనగిరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణాకేంద్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా నాయిని నర్సింహ్మరెడ్డి, ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్‌రెడ్డి, ఉపాధికల్పన, శిక్షణాశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీబ్, డైరెక్టర్ కె.యాకూబ్‌నాయక్, రీజినల్ డిప్యూటి డైరెక్టర్ ఎస్.రాజ, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్విలావణ్యలు మొక్కలు నాటారు.

ఎవరు ముందు?

వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా అధికార, పాలక ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో కొత్తదనం ఏముందీ? ఏ పార్టీలైనా అధికారం కోసం వెంపర్లాడడం సహజమే కదా అని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య పోటా పోటీ నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరచడంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి అగ్ర నాయకుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎం. వెంకయ్య నాయుడు స్పష్టంగా చెప్పారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి

Pages