S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్పీటిసి, సర్పంచ్‌పై కేసు

రేగోడ్, జూలై 19: రేగోడ్ మండల ఎంపిడిఓ బస్వన్నప్ప విధులను అటంకపర్చిన నేరంపై జడ్పీటిసి సభ్యుడు రాంరెడ్డి, గజ్వాడ సర్పంచ్ కిషన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎఎస్‌ఐ నారాయణ తెలిపారు. ఈ నెల 16న ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

విద్యుత్ విజిలెన్స్ దాడులు

చిన్నశంకరంపేట, జూలై 19: చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు 20 గ్రామపంచాయితీల్లో విద్యుత్ విజిలెన్స్ దాడులు కొనసాగాయి. మెదక్ డిఈ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ద్వారా వాడవాడకు ఇంటింటికి చేరుకొని అక్రమ విద్యుత్ వైర్లను గుర్తించారు. అలాగే అక్రమంగా విద్యుత్ వాడకందారులను గుర్తించి కేసులు చేస్తున్నట్లు తెలిపారు. మీటర్లు కలిగి ఉండి బిల్లులు కట్టని వారు వెంటనే చెల్లించి ట్రాన్స్‌కో సహకరించాలని సూచించారు.
సత్తా చాటిన టిఎంయు

మాసాయిపేటను మండల కేంద్రం చేయకుంటే జాతీయ రహదారి దిగ్బంధం

వెల్దుర్తి, జూలై 19: మాసాయిపేట గ్రామాన్ని ప్రత్యేక మండలం చేయాలని లేకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేసి, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, ప్రస్తుత డిసిసి అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో చేపట్టిన రిలేదీక్షలకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సైతం మాసాయిపేట గ్రామం ముందుడి పోరాటం చేసిందన్నారు. అప్పట్లో మంత్రి హరీష్‌రావు గ్రామాన్ని దత్తత తీసుకున్నామనడం తప్ప గ్రామానికి చేసింది ఏమీలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాసాయిపేట గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని దీనికోసం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు.

విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యార్థి మృతి

సిద్దిపేట, జూలై 19: సిద్దిపేట మండలం తడ్కపల్లి విద్యారణ్య ఆవాస విద్యాలయంలో టెన్త్ విద్యార్థి వినయ్‌కుమార్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే కారమణమని ఆరోపిస్తూ సిద్దిపేట ఏరియా ఆస్పత్రి వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి పోస్టుమార్టాన్ని ఏరియా ఆస్పత్రిలో చేయించవద్దని డిమాండ్ చేశారు. ఏరియా ఆస్పత్రి వైద్యుల్లో ఒకరు పాఠశాల యాజమాన్యం బాంధువుగా ఉండడంవల్ల రిపోర్టు తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇతర డాక్టర్లతో పోస్టుమార్టం చేయించాలన్నారు.

రైతుల రాస్తారోకో

చిన్నకోడూరు, జూలై 19: మా భూములు సర్వే చేయకుండా అనంతగిరి ప్రాజెక్టు పనులు ఏలా చేస్తారని రైతులు రాస్తారోకో చేసిన సంఘటన మండలంలోని అల్లీపూర్ శివారులో మంగళవారం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరికి చెందిన ప్రజలు, రైతులు చిన్నకోడూరు మండలం అల్లీపూర్ శివారులో జరుగుతున్న ఫ్రాజెక్టు పనులను అడ్డుకొని రోడ్డు పై బైఠాయించారు. మా భూములు సర్వే చేసి న్యాయం చేసేదాకా పనులు జరుగనీయమన్నారు. అనంతగిరి ఫ్రాజెక్టులో భూములు పోతున్న మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం వాసులకు సర్వే చేసి డబ్బులు అందించారన్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో టిఎంయుదే హవా!

నల్లగొండ, జూలై 19: ఆర్టీసి ఎన్నికల్లో టిఎంయు కార్మిక సంఘం సత్తా చాటుకుంది. జిల్లా పరిధిలోని ఏడు డిపోల్లోనూ టిఎంయు జయకేతనం ఎగురవేసింది. ఏడు డిపోల్లో రాష్ట్ర స్థాయి, నల్లగొండ రీజియన్ స్థాయికి సంబంధించిన మొత్తం 14స్థానాల్లోనూ, ఆర్‌ఎం కార్యాలయం రెండు స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని డిపోల్లోనూ కార్మికులు టిఎంయుకు పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టి సింహభాగం ఓట్లను వేశారు. రీజియన్ స్థాయిలో ఏడు డిపోల్లో మొత్తం 3161ఓట్లకుగాను టిఎంయు 2,280ఓట్లు, రాష్ట్ర స్థాయిలో 2,207ఓట్లు పొందడం విశేషం. ఈయు 682, 765, ఎన్‌ఎంయు 166, 135ఓట్లు సాధించాయి.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించి బ్రతికించాలి

చిట్యాల, జూలై, 19: హరితహారం కార్యక్రమంలో జాతీయ రహదారి వెంబడి నాటిన మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని నాటిన ప్రతి మొక్కను సంరక్షించడమేకాకుండా బ్రతికించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి శివారులో ఈనెల 8న సిఎం కెసిఆర్ నాటిన మొక్కను, రహదారి వెంబడి నాటబడిన మొక్కలను, ఎండిపోయిన మొక్కలను మంగళవారం అదనపు పిసిసిఎం మల్లార్సి, హరితహారం జిల్లా ఇన్‌చార్జి ఫణిగర్, జిల్లా అటవీశాఖ అధికారి మాధవరావు, సెక్షన్ అధికారి శేఖర్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి మంత్రి జోగు రామన్న పరిశీలించారు.

అందరి భవితకే హరితహారం

నల్లగొండ, జూలై 19: ప్రజలందరి భవిష్యత్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం వారు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ప్రాంగణంలో 47ఎకరాలలో 1కోటి 50లక్షలతో ఏర్పాటు చేసిన నీలగిరి నందన వనం పార్క్‌ను వారు ప్రారంభించి మొక్కలు నాటారు.

పుష్కరాలకు సమన్వయంతో పనిచేయాలి

నాగార్జునసాగర్, జూలై 19: కృష్ణాపుష్కరాల సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విజయవిహార్‌లో పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్‌పిలు, కలెక్టర్లు, ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఇతర ఉన్నతాధికరులతో పుష్కరాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. కృష్ణానది వేగంగా ప్రవహిస్తుందని, పుష్కరాల సమయంలో భక్తులకు ఎటువంటి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

వనం కోసం మనంలా హరిత ఉద్యమం సాగాలి

నల్లగొండ టౌన్, జూలై 19 : పర్యావరణ పరిరక్షణ వాతావరణ కాలుష్యాన్ని తగిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు వనం కోసం మనంలా హరిత ఉద్యమం కొనసాగాలని డ్రగ్స్ కంట్రోల్ ఏడి అంజుమ్ అబిదా బేగం సూచించారు. మంగళవారం స్దానిక 39వ వార్డులో కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలోమున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, కామినేని ఆసుపత్రి జనరల్ మేనేజర్ శ్రీ్ధర్‌రెడ్డి, డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు గోవింద్ సింగ్, శ్రీకాంత్, సంపత్‌ల సూచనలతో వెంకటేశ్వర, నలంద, రామానందతీర్ధ ఫార్మసీ కళాశాలల విద్యార్ధులచే మొక్కలు నాటించారు.

Pages