S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

180 సిసి కెమెరాల ఏర్పాటు

నల్లగొండ, జూలై 19 : జిల్లాలో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పోలీసు శాఖ 6,751 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తుందని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పుష్కరాల బందోబస్తు ఏర్పాటు వివరాలను వెల్లడించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డి ఎస్పీలు, 95 మంది సి ఐలు, 437 మంది ఎస్ ఐలు, ఇతర సిబ్బంది 6,201 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పుష్కరఘాట్లు, దేవాలయాలు, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు వద్ద 50 లక్షల వ్యయంతో 180 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రులు

నాగార్జునసాగర్, జూలై 19: నాగార్జునసాగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలు మంగళవారం నాడు ప్రారంభించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం స్థానిక బుద్ధవనంలోని హెలిప్యాడ్‌లో దిగిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి డిజిపి అనురాగ్‌శర్మ, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, నల్లగొండ జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

హరితహారం ప్రగతికి మెట్లు

కోదాడ, జూలై 19: హరితహారం కార్యక్రమం కోదాడ ప్రాంతంలో జరుగుతున్నతీరు మరో ఉద్యమాన్ని తలపించేదిగావుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛందసంస్థల సభ్యులు, అన్నివర్గాల ప్రజలు హరితహారాన్ని బాధ్యతగా తీసుకొని మొక్కలను నాటుతుండటంతో కోదాడ ప్రాంతంలో అంతటా హరితహారం స్ఫూర్తి కన్పిస్తున్నది.

16మంది అధికారులకు షోకాజ్ నోటీస్‌లు

నల్లగొండ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ హరిత హారంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు, ఇద్దరు మంత్రులు సమీక్షా సమావేశానికి హాజరుకాని 16మంది జిల్లా అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు.

మరింత పచ్చదనాన్ని పెంచాలి

డిచ్‌పల్లి రూరల్, జూలై 19: హరితహారం కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం జిల్లాకు హాజరైన ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ డిచ్‌పల్లిలోని టిఎస్‌ఎస్‌పి 7వ పోలీసు బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలుకగా, బెటాలియన్ ఆవరణలో హరితహారం కార్యక్రమానికి ఒఎస్‌డిగా వ్యవహరిస్తున్న ప్రియాంకవర్గీస్‌తో కలిసి స్మితాసబర్వాల్ మొక్కలు నాటారు. బెటాలియన్ పరిసరాలన్నీ ఇప్పటికే విరివిగా చెట్లతో పచ్చదనంతో నిండి ఉండడాన్ని గమనించి బెటాలియన్ అధికారులను అభినందించారు.

గంజాయి ఘాటు

నిజామాబాద్, జూలై 19: జిల్లాను కేంద్ర బిందువుగా మల్చుకుని మహారాష్టక్రు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. ఈ విషయం ఇప్పటికే పోలీసుల దాడులతో స్పష్టమైనప్పటికీ, గంజాయి రవాణాను నిరోధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తును వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్తీ పేరిట కల్లు డిపోలపై విరివిగా దాడులు నిర్వహిస్తున్న ఆబ్కారీ అధికారులు, గంజాయి ఘాటు గురించి అసలేమాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది.

చెట్లను నరకడం ఆపాలి

సదాశివనగర్, జూలై 19: చెట్లను నరకడం ఆపి మొక్కలను సంరక్షించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ యోగితారాణా పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం భావితరాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో పెట్టిందన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు కురుస్తాయని తెలిపారు. గ్రామంలో నాటిన మొక్కలపై సంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యానికి మించి మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలన్నారు.

జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్దరణకు కృషి

ఎల్లారెడ్డి, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో జీర్ణావస్థలోఉన్న దేవాలయాల పునరుద్దరణ కోసం టిటిడి తరపున నిధులు మంజూరుతొపాటు, తిరుమల తిరుపతి దేవస్థానంలోశ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని సామాన్య భక్తులకు తక్కువ సమయంలోదర్శనం కలిగే విధంగా అన్ని రకాలచర్యలుతీసుకుంటున్నామని, టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు సభ్యులు, జిల్లాటిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు.

హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చండి

మాక్లూర్, జూలై 19: కొంతమంది ప్రజాప్రతినిధులు పత్రికల్లో ఫోజులు ఇచ్చేందుకే హంగామా చేస్తున్నారే తప్ప, హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో పని చేయడం లేదని, ఫలితంగా నిర్దేశించిన లక్ష్యం నీరుగారుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు ఈ వైఖరిని మానుకుని లక్ష్య సాధన కోసం పని చేయాలని సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిపి ఛాంబర్‌లో ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమావేశమై హరితహారం కార్యక్రమంపై సూచనలు చేశారు.

తెరుచుకున్న రైల్వేగేట్

కంఠేశ్వర్, జూలై 19: నగరంలోని కిసాన్‌గంజ్, శ్రద్ధానంద్ గంజ్‌లను కలిపే రైల్వేగేట్‌ను ఆ శాఖ అధికారులు మూసి వేయగా, రైల్వేగేట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 19రోజులుగా రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. వీరి దీక్షలను అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు సందర్శించి సంఘీభావం ప్రకటించడంతో పాటు ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో రైల్వేగేట్‌ను మూసి వేసిన విషయాన్ని జిల్లా ఎంపి కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వారు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం రైల్వేగేట్‌ను తెరిచారు.

Pages