S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ-ఇవీ

ఆవాల మ్యూజియం - ప్రపంచంలో ఖరీదైన ఫలం - వెక్కిరింత లాంటి శుభాకాంక్ష, టోపీ హిస్టరీ ముచ్చటగొలిపేవిగా ఉన్నాయి. ఇప్పుడు మూడు కాదు ఒకటే కాలం. ఎండాకాలం! నీళ్లు లేని కన్నీళ్లు తెప్పించే మండేకాలం! అంటూ ‘సండే గీత’లో వ్యక్తం చేసిన ఆవేదన కలచివేసింది. తరచి చూస్తే చెట్లు నరికేసి, పర్యావరణ స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న మన వల్లనే మనకీ దుస్థితి. ప్రజా ప్రతినిధుల జీతభత్యాల పెంపుపై ఆక్షేపించింది ఇద్దరే అని ఒక పాఠకుడు అన్న దానికి మీ సమాధానం భలేగా ఉంది. ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయడానికే వద్దన్నారు. పుచ్చుకోవడం మానలేదు కదా! డబ్బు ఎవరికి చేదు?!
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)
ఓ చిన్న మాట

భవిష్య కాలం

చంద్రకిశోర్, విజయవాడ
ప్ర: గతంలో ఒకరి ప్రశ్నకు-‘పత్రికాముఖంగా మంత్ర వివరాలు తెలియజేయరాదు, ఉపదేశం పొందండి’ అని మీరు తెలిపారు. టీవీ చానళ్లలో చాలామంది పండితులు మంత్రాలు చెపుతూ, అలాగే చేసుకోమంటున్నారు కదా! అది తప్పంటారా?
సమా: చానళ్ల సంగతి పక్కన పెడితే, మంత్రము, మంత్రాంగము రహస్యంగా వుంటేనే బాగా పనిచేస్తాయి. దేవతా మంత్రము గురుముఖతః ఉపదేశం పొందాలి. ప్రసార సాధనాల వల్ల కాదు.
పుల్లా రామలింగేశ్వరరావు, రామంతాపూర్ (హైదరాబాద్)
ప్ర: ఆర్థికంగా పైకి రాగలనా?

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

నేర్చుకుందాం

క. మానాగ్ని హోత్రమును మఱి
మానాధ్యయనమును మాన వౌనంబు నవి
జ్ఞానమున మాన యజ్ఞము
నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్

భావం: గర్వంతో కూడిన అగ్ని హోత్రం, ఆడంబరానికై చేసే వేదాధ్యయనం , గర్వంతో కూడుకొన్న వౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరంతో చేసే యజ్ఞం అనే నాలుగున్నూ భూమి యందు అసత్యాలైనవి అంటే అయోగ్యమైనవి. యయాతి తాను స్వర్గలోకంలో సంచరించే అవకాశాన్ని పొంది గూడా అహంకారమనే అవగుణం వల్ల తిరిగి అధోలోకాలకు వెళ్లేటట్లు ఇంద్రుని చేత శపించబడి , తిరిగి చేసిన పనిని క్షమించమని అడిగి నక్షత్రలోకానికి వచ్చిన యయాతి తన మనుమలకు మంచిచెడుల గతులను తెల్పుతూ ఈవిధంగా భూలోకంలో అయోగ్యమైనవేవో వివరించాడు.

యమహాపురి 42

అటు ఆ గ్రామస్థులనుంచి కానీ, ఇటు మన మీడియా నుంచి కానీ- ఫిర్యాదులూ లేవు, సహకారమూ లేదు..’’ అని నిట్టూర్చాడు.
‘‘నేనో మాటంటాను సార్- ఏమీ అనుకోవద్దు’’ అన్నాడు సుందరం. శ్రీకర్ చెప్పమన్నట్లు చూడగానే, ‘‘ఇక్కడికి ఈశ్వర్ సారొచ్చారు. మధురాపురిలో నేరమన్నది లేకుండా పోయింది. ఆయన స్థానంలో మీరొచ్చారు. నరకపురి విషయం తేలిపోతుందని నాకనిపిస్తోంది’’ అన్నాడు.
‘‘ఎందుకని?’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.

వసుంధర

ఏది ముఖ్యం?

డిసెంబర్ నెల వచ్చినప్పుడల్లా ఇంటిని కొంత ఖాళీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. దినపత్రికలు, వారపత్రికలు, ప్రత్యేక సంచికలు, టెలిఫోన్ బిల్లులు, నల్లా బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, పుస్తకాలు, వ్రాసిన కాగితాలు, పాతబడిన బట్టలు, రాసిన డైరీలు, రాయని డైరీలు, క్యాలెండర్లు, తీర్పుల ప్రతులు, ఇట్లా ఎన్నో.

-జింబో 94404 83001

హరివంశం 133

వారీ దంపతులను చూసి బహు మెచ్చుకున్నారు. ఆనంద పులకిత తధులైనారు.
అపుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు ఎనిమిది వేల రథాలను దానమిచ్చాడు. ఇవికాక పదకొండు వేల ఐదు వందల గజాలను బహూకరించారు. వేల గుర్రాలనిచ్చాడు. అసంఖ్యకమైన ఆల మందలను ఇచ్చాడు. మణికాంచన ఆభరణాలు అమూల్యమైన పట్టుదుకూలాలు చదివించాడు. సూత మాగధ గాయక నర్తక వంది వైతాళికులకు కొల్లలుగా ధనమిచ్చాడు. అనురాగపూర్వకంగా అనేకమైన కానుకలు వాళ్ళకు చదివించాడు. షడ్రసోపేతమైన భోజనాలు అభీష్ట సిద్ధిగా ఏర్పాటుచేశాడు.

మెరుపు

నవంబర్ నెల ఉదయం తొమ్మిది గంటల సమయం. ఎండ తాకితే హాయిగా ఉంటుంది. మా ఆవిడ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కారులో ఆవిడని బస్టాండ్‌కి తీసుకొని వెళ్లాను. దార్లో టిఫిన్ చేశాం. టిఫిన్ చేసి బయటకు వస్తుంటే ఎవరో ముసలావిడ డబ్బులు అడుగుతూ కన్పించింది. ఆవిడ ప్రార్థనని ఏ మాత్రం పట్టించుకోకుండా కారు తీసుకొని బస్టాండ్‌కి పరుగు తీశాం.
ఆవిడని పంపించి తిరిగి వస్తున్నప్పుడు అదే టిఫిన్ సెంటర్ కన్పించింది. ఎర్రలైటు పడటంతో అక్కడ ఆపాల్సి వచ్చింది. అదే ముసలావిడ అక్కడ మళ్లీ కన్పించింది. యాభై సంవత్సరాలు దాటిన ఓ మహిళ ఆమె దగ్గరకు వచ్చి రెండు ఇడ్లీలు, ఓ పది రూపాయలు ఇచ్చింది. ఆ ముసలావిడ కళ్లల్లో మెరుపు మెరిసింది.

ప్రత్యేకత

ఒకే వయసు పిల్లలు ఒకే విధంగా ఆలోచించరు. ఏ ఇరువురి ఆలోచనలు సైతం ఒకేలా వుండవు. వారి వారి అభిరుచులు, ఆలోచనలు, అలవాట్లు, నలుగురిలో మసలుకునే తీరు వేరుగా వుంటుంది. చేసే పనిలో ఒకరు అంకితభావానికి మారుపేరులా కన్పిస్తే, ఇంకొకరు నిర్లక్ష్యానికి మరొక పేరులా కనిపిస్తారు. ఒకరు భక్తికి పర్యాయపదమన్నట్లు కన్పిస్తే, ఇంకొకరు భక్తిదేనికని ప్రశ్నిస్తున్నట్లు కన్పిస్తుంటారు. మొక్కై వంగనిది మానై వంగడం అంత తేలికైన విషయం కాదు. పిల్లలు బాల్యంలో అలవరచుకున్న దృక్పథానికి అనుగుణంగానే వారి భవిత వుంటుందనేది నిర్వివాదాంశం.

- కొల్లు రంగారావు

టెస్టు సెంచరీ

* నలభయ్యేళ్ల వయసులో టెస్టు మ్యాచ్ ఆడడం సామాన్యం కాదు. అందులోనూ సెంచరీ సాధించడమంటే మాటలు కాదు. ఈ అరుదైన రికార్డు విజయ్ మర్చంట్ ఖాతాలో ఉంది. 1952లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఢిల్లీ టెస్టులో సెంచరీ చేసినప్పుడు అతని వయసు 40 సంవత్సరాల 22 రోజులు. మన దేశం తరఫున సెంచరీ చేసిన వారిలో ఎక్కువ వయసుగల బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు. రాహుల్ ద్రవిడ్ తన 39వ ఏట అడుగు పెట్టడానికి రెండు నెలల ముందు, 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతనికి అది 36వ శతకం. అదే ఆఖరి సెంచరీ కూడా.

Pages