S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

కౌడిపల్లి, జూన్ 23: హైదరాబాద్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగల ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అనే వ్యక్తి 45 దొంగతనాలకు పాల్పడి ఐదేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి 2009 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చాడు. మహ్మద్ షఫీ, మహ్మద్ ముజాహిద్ పాషా, మీర్జా షోయబ్ బేగ్, మిర్జాఇర్ఫాన్ బేగ్‌లతో ఒక దొంగల ముఠాగా ఏర్పర్పుచుకొని కిడ్నాపులు, దొంగతనాలు, హత్యలకు పాల్పడ్డారు.

రైల్వే టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నలుగురు యువకుల కిడ్నాప్!

చాగల్లు, జూన్ 23: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో నలుగురు యువకుల కిడ్నాప్‌నకు గురయ్యారు. కోల్‌కతాకు చెందిన ఒక ముఠా చాగల్లుకి చెందిన నలుగురు యువకులకు రైల్వేలో టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుండి రూ.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. వారంరోజుల క్రితం కోల్‌కతా నలుగురు యువకులకు ఉద్యోగాలు వచ్చాయని, విధుల్లో చేరటానికి రావాలని ఫోన్లో తెలియజేశారు. దాంతో ఆ యువకులు నలుగురు కోల్‌కతా వెళ్లారు. కోల్‌కతాకు వెళ్లిని ఆ నలుగురు యువకులను ఒక గదిలో బంధించి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు 30 లక్షల రూపాయలు చెల్లిస్తేనే వారిని విడిచిపెడతామని ముఠా సభ్యులు హెచ్చరించారు.

బాలీవుడ్‌లోకి ప్రభాస్?

ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న చిత్రం ‘బాహుబలి’. ఉన్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అంతే క్రేజ్‌ని దక్కించుకున్నారు దర్శకుడు రాజవౌళి, హీరో ప్రభాస్. జూలై 10న విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలేంటి? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయని తెలిసింది. ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ బాలీవుడ్‌లో సినిమా చేయడానికి తానెప్పుడూ రెడీగానే ఉన్నానని, మంచి స్క్రిప్ట్‌వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నారు.

పూర్తి కావస్తున్న త్రిపుర

స్వాతి ప్రధాన పాత్రలో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ రూపొందిస్తున్న ‘త్రిపుర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈనెల 15నుండి ముగింపు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, నెలాఖరువరకు ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు మినహా సినిమా పూర్తివుతుందని’ తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో పాటల చిత్రీకరణలో భాగంగా ఒకటి స్వాతి ఇంట్రడక్షన్ పాటను తమిళనాడులోని కుట్రాంలో, మరొకటి పొల్లాచ్చి, కొడైకెనాల్‌లోను చిత్రీకరించనున్నామని తెలిపారు.

చీరకు సాటి ఏది..?

ఫ్యాషన్లు ఎంతగా మారినా చీరకట్టుకు సరితూగే దుస్తులేవీ ఇకముందు కూడా రావని బాలీవుడ్ భామ విద్యా బాలన్ అంటోంది. సంప్రదాయబద్ధమైన చీరలు మాత్రమే మగువల సొగసుల్ని రెట్టింపు చేస్తాయని చెబుతోంది. ప్రతి భారతీయ మహిళా తప్పనిసరిగా ఓ కంచి పట్టు చీరనో, బనారస్ చీరనో శుభకార్యాల వేళ ధరించాలని ఆమె సూచిస్తోంది. ఆదరణ కోల్పోతూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేతపని వారిని ఆదుకునేందుకైనా అతివలు చీరలను కొనాలని విద్య విజ్ఞప్తి చేస్తోంది. తాను హైస్కూల్ రోజుల్లోనే తన తల్లి వాడే చీరలను కట్టుకుని ఆనందించేదాన్నని అప్పటి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేస్తోంది.

మేలైన బోధనతో సృజనకు చేయూత

ఆధునిక కాలంలో అత్యధిక రాబడి వచ్చే వ్యాపారాల్లో స్కూళ్ల నిర్వహణ ఒకటి. కెజి విద్యార్థులకు కూడా పి.జి. విద్యార్థులకు చెల్లించేటంతటి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తల్లిదండ్రులకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ- ‘మా స్కూల్లో చదివితే పిల్లల్ని అంతటి వాళ్లని చేస్తాం.. ఇంతటి వాళ్లను చేస్తాం’ అంటూ ఊదరగొట్టే పాఠశాలలు కార్యాచరణకు వచ్చేసరికి శూన్య హస్తం చూపిస్తున్నాయి.

ట్రాఫిక్ కష్టాలు

పంజాగుట్ట ప్రధాన రహదారిపై కొనసాగుతున్న మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది . నిత్యం వేలాది వాహనాలుసంచరించే ఈరోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డా.. అధికారులు పట్టించుకోకపోవడంతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

పిలిస్తే..పలుకుతాం

* రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి
* బందోబస్తుపై పోలీసు కమిషనర్ హామీ

లష్కర్ బోనాల ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం

బేగంపేట, జూన్ 23: లష్కర్ బోనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బోనాల ఉత్సవాల వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించడంతో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. మంగళవారం బల్దియా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, అధికారులు ఉజ్జయిని మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో 30 వరకు చిన్న దేవాలయాలు ఉన్నాయి. బోనాల ఉత్సవాలను ఆర్భాటంగా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మహంకాళి ఉజ్జయిని ఆలయ చుట్టూ ఉన్న రహదారులకు మరమ్మతు చేయాలని నిర్ణయించారు.

ఎవరెస్ట్ శిఖరంపై ఎగిరింది.. ఎగిరింది.. తెలంగాణ కీర్తి పతాకం

శామీర్‌పేట, జూన్ 23: ప్రపంచ చరిత్రలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సుమారు 20వేల అడుగుల ఎత్తులో జరుపుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2ను 20 వేల అడుగుల పర్వతంపై ఈ వేడుకలను జరుపుకొని, బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. తమ ప్రాణాలకు తెగించి మైనస్ 20 డిగ్రీల నుండి మైనస్ 30 డిగ్రీల ప్రతికూల వాతావరణంలో ఈ సాహస యాత్రను మే 22 నుండి ప్రారంభించారు.

Pages