S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్రమాలు

ఈ సృష్టిలో మానవ జన్మ చాలా పవిత్రమైనది. ఉత్కృష్టమైనది. ఎన్నో పుణ్యాలు చేస్తేనే ఈ మానవ జన్మ సిద్ధిస్తుంది. మానవ జీవిత చతుర్విధ ఆశ్రమాలమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి మనుగడలో ఉన్న వివిధ స్థాయిలలోని తేడాను ‘ఆశ్రమ’ అనే పదం ఉద్భవించింది. ‘శ్రమ’ అనే ప్రాతిపదిక నుండి ఇది ఉద్భవించింది.
ఎలా శ్రమించాలి? ఎచ్చటెచ్చట శ్రమించాలి? అనే విషయాలు వివరిస్తుంది. మానవుని జీవితాన్ని సక్రమ మార్గంలోనికి నడుపునదే ఈ ‘ఆశ్రమ’ జీవితం. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేవి నాల్గు రకాలైన ఆశ్రమ ధర్మాలు. హిందూ పురాణము, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాల్లో వీటి గురించి వివరించారు.

-రావుల రాజేశం

ఆస్తులు కాదు.. ఆప్యాయతలే పదిలం..

ఒకప్పుడు పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటపుడు పెద్ద కుటుంబాన్ని చూసి ఇచ్చేవారు. ఆడపడుచులు, మరుదుల చెణుకులతో హాయిగా, ఆనందంగా గడిపేవారు. ఇప్పుడలా కాదు. పెద్దలే ఆడపిల్లకు అన్నీ నచ్చచెపుతున్నారు. తల్లి కల్పించుకుని, ‘‘మంచి సంబంధం ఒప్పుకో అమ్మా..’’ అని బతిమాలుతూ- ‘‘ఆడబిడ్డలు లేరు, అత్తగారు కిందటేడే పోయిందట.. మామగారు మొన్ననే రిటైరైపోయాడు.. మరిది హైదరాబాదులో బ్యాంక్ ఉద్యోగి... సెంటర్లో నాలుగు షాపులు.. పైన రెండు ఫోర్లు.. స్థలాల ధరలు పెరిగిపోయి లక్షల్లో వున్న ఆస్తి కోట్లకి చేరింది. భార్య పోయాకా ఎన్నాళ్ళు బతుకుతాడాయన?

-వేమూరి అనూరాధ

సాఫ్ట్‌వేర్ రంగంలో మహిళలదే పైచేయి...?

‘‘ఆకాశంలో సగం మేము- అవకాశాలలో కూడా సగం’’ కావాలంటూ ఉద్యమిస్తూన్న మహిళలకు బాసటగా నిలవడానికి మేము సైతం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఐటి కంపెనీలలో మహిళా ఉద్యోగులు 35 శాతం మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, పీపాల్స్, డెల్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వినూత్న రీతిలో పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.

-పి.హైమావతి

రాబందు

కథల పోటీలో ఎంపికైన రచన
------------------
అదిరిపడ్డాడు చైతన్య.
ఎదుట వ్యక్తి చెప్పింది వినేసరికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి.
‘‘ఇదంతా నిజమేనా? నువ్వు చెప్పిందంతా యధార్థమేనా?’’ ఆందోళనగా అడిగాడు చైతన్య. అతను దేవునిమీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు.
ఇదే నిజమైతే? అమ్మో! ఇంకేమైనా ఉందా? ఊరంతా ఒల్లకాడు కాదూ?
‘‘ఈ విషయం ఇంతటితో వదిలెయ్యడానికి వీల్లేదు. దీన్ని అమీ తుమీ తేల్చిపారెయ్యాలి’’ మనసులోనే స్థిరంగా అనుకున్నాడు చైతన్య.

ఇందూ రమణ

రష్యాపై సానుకూల ధోరణి

ఇద్దరు ప్రేమికుల మధ్య విషాందాంత ప్రేమ కథ మాదిరిగా రష్యా-పశ్చిమదేశాల వ్యవహారశైలి కొనసాగుతోం ది. వీరికి పరస్పర సంబంధాలు కొనసాగించాలనే ఉంది కానీ ఎక్కడినుంచి, ఏవిధంగా మొదలుపెట్టాలో తెలియకపోవడమే విషాదం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మన్ ఛాన్సలర్ ఆంజెల్లా మార్కెల్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. మరి అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లోవ్‌రోవ్‌ల మధ్య ఈ మధ్య పారిస్‌లో జరిగిన సమావేశం ఏవిధమైన ఫలితాలివ్వకుండానే ముగిసింది.

మళ్లీ తప్పటడుగులు వేస్తున్న కేజ్రీవాల్

అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ఒక బృందంగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 70 సీట్లలో 67 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పరచినప్పుడు మొత్తం దేశ ప్రజలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుండి ఎన్నో ఆశించారు. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించగలరని ఎదురుచూశారు. అయితే అధికారాల విషయ మై లెఫ్టినెంట్ గవర్నర్‌తో వివాదాలకు కాలు దువ్వుతూ కాలం గడపగలరని ఎవ్వరూ ఊహించలేదు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఘర్షణకు తలబడుతూ ఢిల్లీ ప్రజలకు మెరుగైన పౌర సదుపాయాలు కల్పించడం పట్ల దృష్టి సారించడం లేదు.

మార్కెట్ మాయాజాలంలో సగటు జీవి..!

‘అబ్బా! ఆ ఏనుగును కొనుక్కుందాం...! 50 శాతం డిస్కౌం ట్ మళ్ళీరాదు...’, ‘నీకెమన్నా పిచ్చా...? మనకెందుకు ఏనుగు...?’ అనే ఈ కార్టూను డైలాగును చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ వుంటాం! అయినా మన ఆలోచనల్లో ఏమైనా మార్పువచ్చిందా.... వస్తుందా...? అనేది తేలని ప్రశ్ననే! ‘ఏ కొనుగోలు చేయకున్నా మా నూతన షోరూంను దర్శించే జంటలకు ఆశ్చర్యకరమైన బహుమతులు..’ భార్యా, భర్తలమధ్య గల వైరుధ్యాల్ని సొమ్ముచేసుకోవడం వీరికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇలా దర్శించిన జంటలు ఉత్తపుణ్యానికి బహుమతి తీసుకోకుండా, ఏదో ఒక వస్తువును కొనకమానరని వారి ఆలోచన! కేవలం ఒక్క రూపాయే చెల్లించండి!

జాతిభేదం లేని ‘అమ్మ’తనం!

రాయదుర్గం, జూన్ 23: ఆవుదూడ బంధం గురించే మనకు తెలుసు. మనకు తెలీని మరోబంధం ఉంది అదే ఆవు వరాహ బంధం. ఓ ఆవు తనజాతి కాని పందిపిల్లలకు ప్రతిరోజూ పాలిస్తోంది. ఈ వింత అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని నేతాజీరోడ్డు పాత కరెంటు ఆఫీస్ వద్ద ఉదయం సాయంత్రం పూట ఓ ఆవు పందిపిల్లలకు పాలిస్తోంది. నిత్యం కనిపించే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు అచ్చెరువొందుతున్నారు. ఆవు అలా వచ్చి పడుకోగానే చుట్టుపక్కల ఉండే పంది పిల్లలు బిలబిలమంటూ వచ్చి ఆవురావురంటూ పాలు తాగేస్తుంటాయి. పందిపిల్లలు పాలు తాగుతున్నంతసేపు ఆవు కదలకుండా ఉండడం గమనార్హం.

సర్కారు బడుల్లో వసతులు డొల్ల

కరీంనగర్ టౌన్, జూన్ 23: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలనే మాటలు నిజమయ్యాయి. ఏటా వందలాది కోట్లు వెచ్చించి వౌలిక వసతులు కల్పిస్తున్నామంటూ చెప్పుకునే నేతలు తమ మాటలకు కార్యరూపం పెట్టడంలో విఫలమవుతుండగా, విడుదలవుతున్న నిధులు మధ్యలోనే మాయమవుతుండగా, వౌలిక వసతుల కల్పన కల్లగానే మారుతోందనేది సుప్రీంకోర్టు బృందం తనిఖీల్లో స్పష్టమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులైన తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడంలో యంత్రాంగం ఏమేరకు పనిచేసిందో క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన సుప్రీం కోర్టు బృందం ఖంగుతినే నిజాలను గుర్తించింది.

Pages