S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్నకు భక్తజన నీరాజనం

వేములవాడ,జూన్ 5: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది.శుక్రవారం 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.స్వామివారి దర్శనానికి భక్తులకు రెండుగంటలకు పైగా సమయం పట్టింది. మొదట స్వామివారికి భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామివారి నిత్య కళ్యాణం,సత్యనారాయణ వత్రాలు, ఆకుల పూజ,అన్నపూజ,కుంకుమపూజ తదితర మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయం బయట స్వామివారి పేరిట తులాభారం (బెల్లం మొక్కు) మొక్కును చెల్లించుకొని కొంత పేద భక్తులకు పంపిణీ చేశారు.

ముందడుగు! (కథ)

స్కూలు బస్సు దిగి ఇంటికి వస్తున్న నాకు ఇంట్లో ఏదో సందడిగా అనిపించింది. పిల్లలిద్దరు స్కూళ్ల నుండి ఇంటికి వచ్చి ఉంటారు. కాని వేరే వాళ్ల గొంతులు కూడా వినపడుతున్నాయి. ఎవరయి ఉంటారబ్బా అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన నాకు ముగ్గురన్నదమ్ములను చూడగానే ఎంతో సంతోషం కలిగింది. ఎప్పుడు రానివారు ముగ్గురూ కల్సి మా యింటికి రావడం విచిత్రంగాను తోచింది. వాళ్లను పలుకరించి వంటింట్లోకి పోయి కాఫీ తయారుచేసి, తెచ్చి వారికందించాను.

మహిళలెక్కడ?

మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెలుగు చిత్ర నిర్మాతలు సినిమాలు రూపొందించే పద్ధతి మారిపోతోంది. ఆకాశంలో సగం నిండితేనే మిగతా సగం కూడా నిండుతుంది. మహిళా ప్రేక్షకులు లేని థియేటర్లలో నడిచే చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ అందదు. వారిని దృష్టిలో పెట్టుకొని నిర్మించిన చిత్రాలకు కనకవర్షం కురుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు మహిళల ఇతివృత్తాలతో చిత్రాలను నిర్మించేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా తిలోదకాలిచ్చారు. మహిళలు కేవలం టీవీలలో వచ్చే సీరియల్స్‌కే అంకితమైపోవడంతో మహిళాప్రేక్షకులను విస్మరించి చిత్రాలను కేవలం యువత కోసమే నిర్మించే సంప్రదాయం టాలీవుడ్‌లో నెలకొంది.

- మురహరి ఆనందరావు

సామాన్యుడికి ఇది ‘వేదం’

చతుర్వేద భాష్యము
డా.క్రోవి పార్థసారథి
వెల: రూ.1500/-
ప్రతులకు: రచయత
23-11/1-10/2, ఓగిరాల వారి వీధి
సత్యన్నారాయణపురం
విజయవాడ-11
ఫోన్: 0866 2530672

-ముదిగొండ శివప్రసాద్

test

test

హాట్ స్వీట్!

తెలుగు తెరపై అదృష్టాన్ని వెతుక్కుంటూ బెంగాల్ నుంచి ఎగిరొచ్చిన బంగారు బొమ్మ -మిస్తీ. అసలు పేరు -ఇంద్రాణి చక్రవర్తి. ముద్దుపేరు మిస్తీ. పేరుకు తగ్గట్టే తియ్యని అందం. -‘చిన్నదాన నీకోసం’ అంటూ వెతుక్కుంటున్న నితిన్‌తో ఫస్ట్‌టైం టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి కెమెరాకు మిస్తీ కొత్తేం కాదు. ఏరికోరి సుభాష్‌ఘాయ్ ఎంచుకున్న కుందనపు బొమ్మే ఈ -‘కాంచి’. మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్, మహిబా చౌదరిలాంటివాళ్లను స్క్రీన్‌కు పరిచయం చేసిన సుభాష్ -తన ‘కాంచి’ ప్రాజెక్టు కోసం వెతికివెతికి ఎంపిక చేసుకున్నాడు. 350కి ఆడిషన్స్ నిర్వహించి -ఒక్క లుక్‌లోనే మిస్తీని ఒకే చేశాడు సుభాష్.

మాలిక్ కాఫర్ - 14

ఇంకా శరభాంకారాధ్యుడు, మల్లికార్జున పండితుడు ఇత్యాది పాలకుర్తి సూరనాధ్యుడు, శివగణము ఐదువేలమంది, విష్ణ్భుక్తులైన ఆచార్య స్వాములు మూడు వందలమంది, శాక్తేయులు, గాణాపత్యులు, క్షేత్రపాలకులు నాలుగువేల మూడు వందలమంది వీరందరితోను నిండు పేరోలగము కిటకిటలాడుతుండగా ముందు వేదస్వస్తి జరిగింది. తర్వాత కవితా గోష్ఠి విద్యనాధ అగస్త్యుడు సంస్కృతంలో కవిత్వం చెప్పాడు.

శ్రీ వేంకటేశ్వర వైభవం - 22

వారిలో కొందరు బ్రహ్మ గొప్పవాడని వాదించగా, ఇంకొందరు కాదు విష్ణువే గొప్పవాడనీ ఇంకొందరు పరమశివుడే గొప్పవాడనీ వాదులాడనారంభించారు. ఇంతలో కొందరు విజ్ఞులు, ‘‘ఇలా మనలో మనం వాదులాడుకోవడం వల్ల కాలం వ్యర్థం కావడం తప్ప, మన సమస్యకు పరిష్కారం దొరకదు. దీనికి ఒకటే మార్గం.

Pages