S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలి

ఖైరతాబాద్: దేశ చరిత్రలోనే చారిత్రాత్మక బిల్లుగా నిలిచిపోనున్న బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్ధుతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం సోమాజిగడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి యువ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నిల వెంకటేష్ అధ్యక్షత వహించగా, సమన్వయకర్తగా గజ్జకృష్ణ వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించి 71 ఏళ్లు గడిచినా చట్టసభల్లో ఆశించిన స్థాయిలో బీసీలకు ప్రాతినిధ్యం దక్కలేదని అన్నారు.

శ్రీరేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఉప్పల్, జూన్ 25: బోడుప్పల్ టెలీఫోన్ కాలనీలో శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రధమ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం తల్లి కల్యాణం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిధ్యాల మధ్య జరిగిన వేడుకల్లో మంత్రి మల్లా రెడ్డి, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చర్ల ఆంజనేయులు, రాపోలు వీరారెడ్డి, జడిగె రమేశ్, జే.రాములు, కాలనీ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు బోనాలతో ర్యాలీగా వచ్చి తల్లికి నైవిద్యం సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నికల ప్రచారాస్త్రంగా ‘యుద్ధం’!

ఎన్నికలు వస్తే చాలు.. హామీల సునామీ మనకు కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం పరిపాటి. ఒకప్పుడు జాతీయ అంశాలు ఎన్నికల వేళ ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉండేవి. ఆ తర్వాత జాతీయ సమస్యలు ప్రధానాస్త్రాలుగా మారాయి. కూడు, గూడు, గుడ్డ ఉంటే చాలు అనే భావనతో ఉన్న భారతీయ సమాజం అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, శాస్ర్తియ, విజ్ఞాన పరిణామాల అనంతరం ఆధునికతను సంతరించుకుంది. రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల్లో ప్రచారాస్త్రాలను సంధిస్తూ, ఓటర్లను ఆకర్షిస్తూ గెలుపే ప్రధానంగా పనిచేస్తున్నాయి.

-బీవీ ప్రసాద్ 98499 98090

స్టార్టప్‌లతో సమాజంలో మార్పు!

‘స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా’ అన్న నినాదం ఎందరినో ఉత్తేజితుల్ని చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఓ కొత్త ‘లెవల్’కు చేరుకోవాలంటే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని విధానకర్తల భావన. మన దేశంలో అత్యధికంగా యువత ఉన్న సంగతి అందరికీ తెలుసు. వారి శక్తియుక్తులు దేశ ఆర్థికవృద్ధిలో కీలకమన్న అంశం అందరూ గుర్తించారు. దాంతో వారిని ప్రోత్సహించేందుకు, వారి సృజనను వెలికి తీసేందుకు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కొత్త వాతావరణం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గ్రహించడంతో ఆ నినాదం పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైతన్యమే ఇది. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం ఇక్కడా కొనసాగుతోంది.

-వుప్పల నరసింహం 99857 81799

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

వర్షాలు మొదలవడంతో అపుడే పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజలు, స్థానిక సంస్థల అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో పలురకాల వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రపర్చుకుంటామో అలాగే మన పరిసరాలను సైతం అలా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహించాలి.

-డా. పోలం సైదులు

విచిత్ర చికిత్స..

మన జీవన విధానంలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జా తీయ అంతర్జాతీయ ఆరోగ్య విశే్లషకులు చెపుతున్న మాట! ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’- వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్- డబ్ల్యూహెచ్‌ఓ-వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు. ‘అల్లోపతి’ వైద్యవిధానంలోని మందులు, మందులిస్తున్న వైద్యులు మనుషులలో రోగ నిరోధకశక్తి తగ్గిపోవడానికి దోహదం చేస్తుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ వైపరీత్యం మన ఆధునిక జీవన రీతిలో నిహితమైంది. అవసరం లేని మందులను అమ్ముతున్నారు. అవసరం లేకుండానే ‘వ్యాధి భ్రాంతి’కి గురైనవారు ఆ మందులను కొని తింటున్నారు.

హోదా ఇవ్వండి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చేతులు జోడించి కోరుతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. బాలశౌరి, శ్రీనివాసులు రెడ్డి మంగళవారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని చెప్పారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు 3,700 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు.. ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని బాలశౌరి వాదించారు.

ఇద్దరు సీఎంల భేటీకి అజెండా ఖరారు

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న ప్రగతిభవన్‌లో భేటీకి అజెండా ఖరారు అయింది. నీటిపారుదల రంగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, కోర్టులు, ట్రిబ్యునల్ కేసులను వెలుపల పరిష్కరించుకునే అంశంపై చర్చించనున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపిణీ, ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశం గతంలో వివాదమైంది.

నిష్పాక్షికతే ప్రభుత్వ విధానం

విజయవాడ: పోలీసింగ్‌లో పారదర్శకత, నిష్పాక్షికత తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మంగళవారం శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు సహా ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించేందుకు గ్రామాల్లో ప్రజాదర్బార్లను నిర్వహిస్తామని వెల్లడించారు. కచ్చితమైన పరిశోధన, త్వరితగతిన బాధితులకు న్యాయం వంటివి తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలని వివరించారు.

సుముహూర్తం..

హైదరాబాద్, జూన్ 25: సుముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న గురువారం, దశమి ఉదయం 11 గంటల సమయానికి కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాల నిర్మాణాలకు భూమి పూజకు వాస్తుపండితులు ముహూర్తం ఖరారు చేశారు. భూమి పూజకు సచివాలయంలో డీ బ్లాక్‌కు వెనుక పొర్టికోకు ఎదురుగా ఉన్న లాన్స్‌ను, అసెంబ్లీ భవనానికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాలశాఖ ఇఎన్‌సి కార్యాలయ భవనానికి ఉత్తర దిశను ఎంపిక చేశారు. ఈ రెండు చోట్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణలో నేలను చదునుచేసి గుంతలు తీశారు.

Pages