S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంజాయి స్మగ్లర్ల అరెస్టు

శేరిలింగంపల్లి, జనవరి 22: చట్టవిరుద్ధంగా నిషేధిత గంజాయిని తరలిస్తు న్న ముఠా సభ్యులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్‌ల నుంచి మూడు కిలోల గంజాయి, రూ.5వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌పెక్టర్ బీ.రవీందర్ కథనం ప్రకారం... పాపిరెడ్డి కాలనీలోని ప్లాట్ నెంబర్ 2031లో నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రం, మెయిల్‌కర్ బీదర్, సీఎంసీ కాలనీకి చెందిన అల్లావుద్దీన్ (32), మహారాష్టల్రోని బడెలింగవ్ కల్యాణ్ జిల్లా, తిగ్బాలకు చెందిన సలీం ఇఖ్బాల్ ఖాజీ (57)లు గంజాయి సరఫరా చేస్తున్నారు.

పోలీస్ కంట్రోల్‌ను సందర్శించిన విద్యార్థులు

హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఇండియాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మెనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌కు చెందిన 25 మంది సభ్యులు కలిగిన విద్యార్థుల బృందం సందర్శించింది. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకతను గురించి వివరించారు.

అదనపు భారం

హైదరాబాద్: నగరంలో సొంతిల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూం.. ఎంతో ముందుచూపుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రతిష్టాత్మకమైన పనులు ఊపందుకున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆర్థికంగా కష్టకాలం కొనసాగుతున్న సమయంలోనే బల్దియాలో రాంకీ ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాంకీ ఒప్పందాన్ని అమలుచేస్తే అది బల్దియాకు అదనపు ఆర్థిక భారంగా, గుదిబండగా మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.

24న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

హైదరాబాద్: మహానగరంలోని పలు ప్రాంతాలకు ఈనెల 24వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మండు వేసవిలో సిటీలో నీటి కొరత ఏర్పడినపుడు నగరవాసుల గొంతు తడిపే మంజీరా పైప్‌లైన్‌కు విద్యుత్ సరఫరా చేసే లైన్లలో భాగంగా ఏర్పాటుచేసిన 33 కేవీ మంజీరా ఫీడర్ లైన్‌లో నాలుగు స్తంభాల మార్పిడి కారణంగా అత్యవసరంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం కల్గుతోందని జలమండలి అధికారులు తెలిపారు.

శివకుమారస్వామి మరణం దేశానికి తీరని లోటు

ఖైరతాబాద్: సిద్దగంగ మఠం పీఠాదిపతి శివకుమార స్వామి మరణం దేశానికి తీరని లోటని శ్రద్ధాంజలి సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లింగాయత్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. సమితి నాయకులు అశోక్, శివరత్నం, సోమేశ్వర్ కవిత దేశ్‌ముఖ్ పాల్గొని నివాళి అర్పించారు. 111 ఏళ్ల పాటు జీవించిన స్వామిజీ ఆధ్యాత్మిక, విద్యా రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. సర్వమానవాళి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన శివకుమార్ స్వామిని కర్నాటక రాష్ట్రంలో నడిచే దైవంగా కొలుస్తారని చెప్పారు. విద్యతోనే పేదరికాన్ని రూపుమాపవచ్చని ప్రగాఢంగా విశ్వసించిన స్వామిజీ..

రెండు దఫాలు ఈవీఎంల ట్యాంపరింగ్

హయత్‌నగర్, జనవరి 22: 2014, 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహింపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధికారులను బెదిరించి పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు.

పట్టపగలే భారీ చోరీ

రాజేంద్రనగర్, జనవరి 22: రాజేంద్రనగర్ సర్కిల్లో పట్టపగలే భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించి పకడ్భందీగా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏక మొత్తంగా సుమారు రూ.4 లక్షల నగదు, 18 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. వివరాల ప్రకారం... నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్లోని అత్తాపూర్ డివిజన్‌లోని నందిముస్లాయిగూడ ప్రాంతంలో నివాసముండే మహేశ్వర్ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మహేశ్వర్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు.

నటి జమునకు పురస్కారం

కాచిగూడ: ప్రజానటి డా.జమున రమణారావుకు ‘ఎన్‌టీఆర్-ఎఎన్‌ఆర్ - వంశీ’ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని జమునకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు ‘వెండి కిరీటం’ బహుకరించారు. నేటి తారలకు జమున ఆదర్శప్రాయమని అన్నారు. వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కేవీ రమణారావుకు ఎన్‌టీఆర్ సేవా పురస్కారం, రామకృష్ణమఠ్ డిప్యూటీ డైరెక్టర్ ఎఎస్ మూర్తికి ఎఎన్‌ఆర్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.

రెండో విడత ‘పంచాయతీ’ పోలింగ్‌కు ఏర్పాట్లు

ఉప్పల్, జనవరి 22: నగర శివారు కాచవానిసింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 25న రెండో విడుత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావు తెలిపారు. గ్రామంలోని 10 వార్డులలో మొత్తం ఓట్లు 3416 ఉండగా తాజాగా 103 కొత్తగా ఓట్లు వచ్చాయి. మూడు పోలింగ్ కేంద్రాలలో 10 బూత్‌లు ఉన్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుందని, మధ్యలో ఒకగంట భోజన విశ్రామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుందని పేర్కొన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీ

గుడిలోకి అనుమతించాలని కమిషనర్‌కు వినతి

శేరిలింగంపల్లి, జనవరి 22: మియాపూర్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న అమ్మవారి గుడిలోకి అనుమతించాలని కోరుతూ సైబరాబాద్ కమిషనర్‌కు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కార్పొరేటర్, విశే్వశ్వరయ్య కాలనీవాసులు కలిసి సమస్యను వివరించారు. పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో అమ్మవారి దేవాలయం ఉన్నందున పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సీపీ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ నవతరెడ్డి తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు బొబ్బ కరుణాకర్ రెడ్డి, పోచయ్య, అనంతరెడ్డి, రాజశేఖర్, సౌజన్య, కాలనీవాసులు ఉన్నారు.

Pages