S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతిని వీడం

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: తమతో చర్చలు జరిపేందుకు భారత్ విముఖంగా ఉన్నప్పటికీ దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన ప్రయత్నాలను తాము కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల హత్య నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో జరుపతలపెట్టిన చర్చలను భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాస్తవాల నుంచి తప్పించుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని, ముఖ్యంగా కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ఇది ఎంత మాత్రం దోహదం చేయదని ఖురేషీని ఉటంకిస్తూ ది డాన్ పత్రిక తెలిపింది.

సామాన్యుడు సైతం విమానం ఎక్కాలి

పాక్‌యాంగ్ (సిక్కిం), సెప్టెంబర్ 24: దేశంలో సామాన్యుడు సైతం విమానాల్లో ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ఇక్కడ ఉద్ఘాటించారు. హవాయి చెప్పులు వేసుకునేవారు సైతం విమానాల్లో విహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సిక్కింలో మొట్టమొదటి విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతాన్ని భారత వృద్ధికి శోధక యంత్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే ఈశాన్య భారతంలో అభివృద్ధి మందకొడిగా సాగిందని విమర్శలు గుప్పించారు.

అర్బన్ నక్సల్స్ పనిపడతాం

రాయ్‌పూర్, సెప్టెంబర్ 24: నక్సల్స్‌కు వారి సానుభూతిపరుల నుంచి మేధో, ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందకుండా తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ అన్నారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టామని, దీంతో సానుభూతిపరుల వ్యవస్థ క్రమేణా నిర్వీర్యం అవుతుందన్నారు. వరుసగా నాలుగోసారి సైతం రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లక్షకు ఇద్దరే!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో పది లక్షల మంది జనాభాకు 19 మంది న్యాయమూర్తులే ఉన్నారని న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కింది కోర్టులను కలుపుకుని 6000 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కింది కోర్టుల్లోనే కేవలం 5000 మంది జడ్జిలను నియమించాల్సి ఉంది. జడ్జిల ఖాళీలకు సంబంధించి గత మార్చిలో కేంద్ర న్యాయశాఖ ఓ నివేదిక రూపొందించింది. దానిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. జడ్జి-జనాభా నిష్పత్తి 19.49గా ఉన్నారు. అంటే పది లక్షల జనాభాకు 19 మంది న్యాయమూర్తులున్నట్టు గణాంకాలు వెల్లడించాయి.

రాహుల్ ఆరోపణలు అవాస్తవం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఆర్‌ఎస్‌ఎస్ సిఫార్సు చేసిన అధికారులను నియమించడానికి స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సు (ఎస్‌పిజి) మాజీ చీఫ్ నిరాకరించడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం, అవాస్తవమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబాల రక్షణ చూసే బాధ్యత ఎస్పీజీదే అన్న విషయం మరువరాదని, దీనిపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఒక ఉన్నతాధికారి వివరణ ఇస్తూ రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఎస్‌పిజి రక్షణలో ఉంటారని చెప్పారు.

కుప్పకూలిన మహా వృక్షం

దేశ రాజధాని నగరం వర్ష బీభత్సానికి అతలాకుతలమయంది. పెనుగాలుల తీవ్రతకు కుప్పకూలిన ఓ మహావృక్ష దృశ్యమిది.

రాఫెల్‌పై ఎఫ్‌ఐఆర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరిని కోరింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉప నాయకుడు ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకులు కపిల్ సిబల్, జైరాం రమేష్, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, వివేక్ తంఖా, ప్రమోద్ తివారీ, ప్రణవ్ ఝా తదితరులు సోమవారం చౌదరిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

జగ్గారెడ్డికి బెయిల్

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి కి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అనంతరం బెయిల్ ప్రక్రియను ఆయన న్యాయవాదులు పూర్తి చేయడంతో జగ్గారెడ్డి చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని షరతు విధించారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకువెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని ఈ నెల 10న పోలీసులు అరెస్టు చేశారు.

మెట్రో ప్రయాణం.. సుఖం, సురక్షితం

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ట్రాఫిక్ సమస్య, కాలుష్యం బారిన పడకుండా ప్రయాణించేందుకు నగరవాసులంతా మెట్రోరైలును సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ నరసింహాన్ విజ్ఞప్తి చేశారు. మెట్రోరైలు కారిడార్-1లోని అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రోరైలును గవర్నర్ నరసింహాన్, మంత్రులు కే. తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయలతో కలిసి అమీర్‌పేట స్టేషన్‌లో ప్రారంభించారు. ఎల్‌బీనగర్ వరకు ప్రయాణించిన గవర్నర్ మధ్య వచ్చే ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను కూడా పరిశీలించారు. గవర్నర్ మాట్లాడుతూ ఏ విషయంలోనైనా చెప్పే మాటలు తాను విననని, నేరుగా పరిశీలించిన తర్వాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్..టీడీపీలతో పొత్తా?

హైదరాబాద్, సెప్టెంబర్ 24: కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకోమని ఏ అమరుడు చెప్పారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌పై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా యువత అమరులు కావడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలతో పొత్తును ఎలా సమర్ధించుకుంటారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మర్యాదగా ఏమి ఇవ్వలేదని, వీపు చింతపండు అవుతుందన్న భయంతోనే ఇచ్చిందన్నారు.

Pages