S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/24/2016 - 07:34

సయోధ్య భావ సుగంధం వెల్లివిరుస్తోంది. సుగంధ జలభరితమైన స్రవంతులు పొంగులెత్తి పరుగులు తీస్తున్నాయి. వినూతన సమైక్య భావ పరిమళ పవనం ‘సహ్యాద్రి’ నుంచి ‘నల్లమల’ వరకు విస్తరిస్తోంది, పడమటి కనుమలకూ తూర్పు కనుమలకూ మధ్య స్నేహ సేతువుగా రూపొందుతోంది...

08/22/2016 - 23:57

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేవలం సూత్రప్రాయంగా బలూచిస్థాన్‌ను ప్రస్తావించారు. బలూచిస్థాన్ ప్రజలు తన కు కృతజ్ఞతలను తెలుపుతూ సందేశాలను పంపినట్టు మాత్రమే డెబ్బయ్యవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని వెల్లడించారు. కానీ ఈ సూత్రానికి బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాలు విస్తృత భాష్యాలను వివరిస్తుండడం నడుస్తున్న చరిత్ర.

08/22/2016 - 07:30

పాకిస్తాన్‌కు వెళ్లరాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించడానకి, జమ్మూకశ్మీర్‌లోకి పాకిస్తాన్ టెర్రరిస్టులు నిరంతరం చొరబడుతుండడం నేపథ్యం. గత కొద్ది రోజుల్లో దాదాపు అరవైమంది కరడు కట్టిన జిహాదీ ఉగ్రవాదులు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోనుండి కశ్మీర్‌లోయ ప్రాంతంలోకి ప్రవేశించడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావానికి సరికొత్త ఉదాహరణ.

08/20/2016 - 08:11

ఒక దేశం ఉప్పొంగింది. ఒక జాతి సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఓ తెలుగు తేజం ఇందుకు ఉద్దీపనగా నిలిచింది. రియో వేదికగా తెలుగమ్మాయి సింధు చేసిన భారతీయ సింహనాదం దశదిశలా పిక్కటిల్లింది. స్వర్ణమే లక్ష్యంగా ఒలింపిక్స్ బాడ్మింటన్ ఫైనల్ బరిలోకి దిగి విశ్వ విజేతను ముప్పుతిప్పలు పెట్టిన వైనం, క్రీడల్లో భావి భారత పోరాట పటిమను కళ్లకు కట్టింది.

08/18/2016 - 23:35

మాదక ద్రవ్యాలను పంపిణీ చేస్తున్న నైజీరియా బీభత్సకారులు మరోసారి పట్టుబడడం ఆశ్చర్యకరం కాదు. పదే పదే హైదరాబాద్‌లో మాత్రమే కాక దేశంలోని అనేకచోట్ల నైజీరియా తదితర ఆప్రికా దేశాలకు చెందిన మాదక ముఠాలవారు పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో మరో ఏడుగురు నైజీరియా మాదక ఉగ్రవాదులను పోలీసులు బుధవారం పట్టివేయడం అందువల్ల ఆశ్చర్యం కాదు.

08/17/2016 - 23:30

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా-అన్న ప్రభుత్వేతర సంస్థ-నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్-ఎన్‌జివో-కు వ్యతిరేకంగా దేశద్రోహం ఆరోపణ నమోదు కావడం ప్రతీక మాత్రమే! విదేశీయ నిధులతోను స్వదేశీయ అక్రమ నిధులతోను తెగబలిసిపోతున్న నకిలీ స్వచ్ఛంద సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలు అసలు సమస్య! ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అన్నది మానవ అధికారాలను పరిరక్షించడానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది.

08/16/2016 - 23:40

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిశంసనకు గురి అయిన ‘నకిలీ గోరక్షకులు’ ఎవరన్నది స్పష్టం కాకపోవడం అనేక అనవసర వివాదాలను సృష్టిస్తోంది. ఈ తథాకథిత-సోకాల్డ్- నకిలీలు గోరక్షకులు కాదన్నది ప్రధానమంత్రి కనిపెట్టిన మహావిషయం. గోరక్షకులు కానివారు, గోరక్షణ పట్ల ఆసక్తిలేనివారు, గోరక్షణ అవసరం లేదని భావించేవారు, గోరక్షణ తప్పని ప్రచారం చేసే వారు దేశంలో కోట్లమంది ఉన్నారు. వీరెవ్వరూ చట్టం దృష్టిలో నేరస్థులు కారు.

08/16/2016 - 00:23

శ్రేష్ఠ్భారత సమాజ పునరుద్ధరణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలోని ప్రధాన ఇతివృత్తం..సర్దార్ వల్లభభాయి పటేల్ అవశేష భారత్‌లోని అనేకానేక సంస్థానాలను విలీనం చేసి సమైక్య భారత్‌ను పునరుద్ధరించారు. ఈశ్రేష్ఠ భారత్ విదేశీయ దురాక్రమణ దారులు ఈ దేశంలోకి చొరబడడానికి పూర్వం నుంచి విలసిల్లిన స్వజాతీయ సమాజం. ఈ సమైక్య భారత్ ఈ సనాతన హైందవ జాతీయ భౌగోళిక సమగ్రతకు ప్రతీక.

08/15/2016 - 05:53

స్వాతంత్య్రం జాతీయ జీవన స్వభావం. బానిసత్వం ఈ జీవన స్వభావాన్ని దిగమింగే గ్రహణం. స్వాతంత్య్రం కోల్పోయిన జాతి రాహుగ్రస్తమైన సూర్యుని వంటిది. స్వాతం త్య్రం వెలుగు, బానిసత్వం, చీకటి ‘‘్భయంకర ఖేద తమాల వాటిక..!’’ స్వాతంత్య్రం కోల్పోయిన సనాతన భరతజాతి మళ్లీ స్వతంత్రం పొందడానికి శతాబ్దుల పాటు పోరాటం జరిపింది. సంఘర్షణ సాగించింది. ఈ శతాబ్దుల సంఘర్షణలో చివరి ఘట్టం బ్రిటన్‌తో జరిగిన పోరాటం.

08/13/2016 - 02:25

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అఫ్ఘానిస్తాన్ నుంచి నిర్వాసితులైన హిందూ, క్రైస్తవ శరణార్థులకు మనదేశపు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడం వారి అమానవీయ ప్రవృత్తికి నిదర్శనం. దశాబ్దులపాటు ఈ దేశాలలో రాక్షసకాండకు మతోన్మాదుల అణచివేతకు బలైపోతున్న హిందువుల పట్ల ఈ మన ప్రతిపక్షాల వారికి జాలి కలుగకపోవడం పాషాణ హృదయ ప్రవృత్తికి నిదర్శనం.

Pages