S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/03/2016 - 05:40

తమిళనాడు శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికలు భారతీయ జనతాపార్టీ ప్రాబల్య ప్రభావాల పటిమను నిగ్గు తేల్చనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో లభించిన పరిమిత విజయం భాజపా శ్రేణులలో విశ్వాసాన్ని పెంచాయి. కానీ తమిళనాడు పార్టీ ప్రాధాన్యం మాత్రం పెరగలేదు. పెరగలేదనడానికి అన్నాడిఎమ్‌కె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత భాజపాను దూరంగా వుంచడం ఒక ఉదాహరణ మాత్రమే!

03/02/2016 - 04:46

మనదేశంతో తమ దేశపు మైత్రీ బంధం పునఃపటిష్టమైనట్టు నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ ప్రకటించడం ఉభయ దేశాల ప్రజలకు హర్షం కలిగిస్తున్న పరిణామం. గత అక్టోబర్ 11వ తేదీన ఖడ్గ ప్రసాద్ శర్మ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే నాటికి నేపాల్‌తో మన స్నేహసంబంధాలు కొడిగట్టిపోయాయి.

03/01/2016 - 06:19

వ్యవసాయ భూమికపై సర్వ సమగ్ర ఆర్థిక వికాసం నూతన వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక-బడ్జెట్-ఇతివృత్తం! 2016-2017వ ఆర్థిక సంవత్సరానికి రూపొందిన బడ్జెట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాటకు ప్రతిబింబంగా ప్రస్ఫుటించింది. ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన కర్షక సమ్మేళనంలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, 29వ తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో ప్రతిధ్వనించింది!

02/29/2016 - 07:01

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ. అందుకు కారణం అంతర్జాతీయంగా దానికి ఉన్న అర్థబలం, అంగబలం, సాయుధ సంపత్తి. అన్ని విధాలా అగ్రపథాన నిలిచిన అగ్రరాజ్య అధ్యక్ష పీఠం నిరుపమానం. దీన్ని అధిరోహించే వ్యక్తికి తిరుగులేని అధికారం ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలుగా ఆకట్టుకునే మార్గాలూ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సమున్నత పదవికి ఎన్నిక జరగడం అంటే మామూలు మాట కాదు.

02/26/2016 - 23:37

దేశంలో ఎన్నికల జాతరకు ఎప్పుడూ కొదవుండదు. జాతీయ ఎన్నికలు పూర్తయితే అసెంబ్లీ ఎన్నికలు అవీ ముగిస్తే..స్థానిక ఎన్నికలు..మళ్లీ చక్రం తిరుగుతుంది. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేననుకునే వారికి నిరంతరం సువర్ణావకాశం అందివస్తూనే ఉంటుంది.

02/26/2016 - 06:07

వేగం భద్రత విస్తరణ, స్వచ్ఛత వంటి పదజాలంతో నిర్మించిన పట్టాలపై ధూమశకటాలు దూసుకొని పోతున్న దృశ్యాన్ని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్‌లో మరోసారి ఆవిష్కరించారు. ‘‘ఆయన తీరు వేరు..’’ అన్నది మరోసారి ధ్రువపడింది. ధూమశకటాలు-పొగబండ్లు-నిర్థూమ-పొగలేని-శకటాలుగా మారుతున్నాయన్న ఆదర్శాన్ని వాస్తవం చేయనున్నట్లు మంత్రి ప్రకటించడం స్వచ్ఛతకు నిదర్శనం కావచ్చు.

02/25/2016 - 00:11

ఉల్లిగడ్డల ధరలు భయంకరంగా పెరిగినప్పుడు వినియోగదారుని కళ్లలో నీరు తిరిగింది. ఇప్పుడు ధరలు ఆకాశంనుండి భూమి మీదకి కుప్ప కూలినందుకు ఉల్లిగడ్డ విలపిస్తోంది! టన్నులకొద్దీ ట్రక్కులకొద్దీ తరలివస్తున్న ఈ ఎర్రగడ్డలను మార్కెట్‌లో అడిగేవాడు లేడు! అందువల్ల ఆరు బయట ఆచ్ఛాదన లేకుండా పొర్లుదండాలు పెడుతున్న నీరుల్లి మరింతగా నీరుకారిపోతోంది! ఆరు నెలల క్రితం ఉల్లి గడ్డ కిలో ధర వంద రూపాయల వరకు పలికింది,.

02/24/2016 - 06:46

తరుముతున్న పోలీసులు తడబడితే ఏమవుతుంది? దేశద్రోహులు తప్పించుకొని పోతారన్నది అందరికీ అర్థమయ్యే మామూలు వ్యవహారం. దేశద్రోహులు అంతర్గత విచ్ఛిన్నకారులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు. ఆయుధాలతో అమాయకులపై, నిరాయుధులపై దాడి చేసి హత్యలు చేసే భౌతిక బీభత్సకారులు కావచ్చు. చాపకింది విషయం వలె విస్తరించిపోయి ఈ దేశపు అస్తిత్వ మూలాలను వికృత భావాలతో తెగనరుకుతున్న బౌద్ధిక బీభత్సకారులు కావచ్చు.

02/23/2016 - 05:29

కనపడని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలన్న విషయమై మన ప్రభుత్వం ఇప్పుడైనా గుణపాఠాలు నేర్చుకోవడం జాతిహితకరమైన చర్య కాగలదు! పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ తోడేళ్లు కనబడని శత్రువులు! ఫిబ్రవరి 20వ తేదీనుండి కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలోని సుమపురం-సెంపోరా-పాంపోరా-లో ప్రభుత్వ భవనంలో ఈ కనబడని శత్రువులు మళ్లీ చెలరేగుతున్నారు!

02/22/2016 - 02:19

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినిపించిన సమన్వయ వాణి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు విచిత్రమైన నేపధ్యం! నరేంద్ర మోదీ ఈ సర్వజనామోద-కాన్సనె్సస్-విధానాన్ని మరోసారి ఈనెల 16వ తేదీన ఆవిష్కరించిన సమయంలోనే ప్రతిపక్షాలవారు సంఘర్షణ స్వరాలను యధావిధిగా సంధించారు! వెరసి కలసి నిగ్గుతేలుతున్నదేమిటంటే పార్లమెంట్ హేమంత సమావేశాల కథ బడ్జెట్ సమావేశాలలో సైతం పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉన్నది!

Pages