S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/07/2018 - 01:18

కొలంబో, మే 6: ఇక్కడ జరుగుతున్న మూడవ దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ 20 గోల్డ్‌మెడల్స్‌తో ముగించింది. తొలుత 11 గోల్డ్‌మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లు ఆదివారం జరిగిన వివిధ విభాగాల్లో తొమ్మిది పతకాలు సాధించారు. మొత్తం ఏడు దేశాల అథ్లెట్లు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండించింది. మొత్తం 20 గోల్డ్, 22 కాంస్య, 8 రజత పతకాలతో ముందుంది.

05/07/2018 - 01:17

ఇండోర్, మే 6: ఇక్కడి హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ప్రత్యర్థి వెన్నువిరిచాడు. దీంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

05/06/2018 - 02:00

పుణె, మే 5: తమ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేయడంలో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ల ద్వయం రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ ప్రశంసించాడు.

05/06/2018 - 02:01

పుణె, మే 5: ఇక్కడి మైదానంలో శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ అలవోగా విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొంది తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు చతికిలపడింది.

05/06/2018 - 01:50

ముంబయి, మే 5: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పడుతూ లేస్తూ వస్తున్న ముంబయి ఇండియన్స్ శుక్రవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయంతో మంచి ఊపుమీద ఉంది. ఆదివారం తమ గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో గెలుపుపై పూర్తి విశ్వాసం, ధీమాతో ఉంది. వాస్తవానికి మొత్తం ఎనిమిది జట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఐదో స్థానంలో ఉంది.

05/06/2018 - 01:48

హైదరాబాద్, మే 5: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ జట్టులో పృథ్వీ షా అత్యధిక పరుగులు (65) చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

05/06/2018 - 01:58

న్యూఢిల్లీ, మే 5: భారత బాడ్మింటన్ సత్తాను ప్రపంచానికి చాటిన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ.సింధు వజ్రంలాటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని, ఈ విషయంలో వారిద్దరూ మరింత దృష్టి సారించాలని సూచించాడు.

05/05/2018 - 01:50

పూణె, మే 4: చైన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగే పోటీలో, వారి బౌలింగ్‌లోని లొసుగులను కనిపెట్టి దెబ్బకొట్టాలన్న ఉద్దేశం సీఎస్‌కేలో కనిపిస్తోంది. విరాట్‌కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ ముంబయి ఇండియన్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, గత మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కేపై ఐదువికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

05/05/2018 - 01:37

మెల్‌బోర్న్, మే 4: టాంపరింగ్ కుంభకోణంలో, కోల్పోయిన ప్రతిష్ఠను పునరుద్దరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపారు. ఈ కుంభకోణం తర్వాత తనకోసం ఎంతో సానుభూతి వ్యక్తమైందని, తన అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి రావాలన్న కోర్కె బలంగా ఉన్నదని, పెర్కొన్నారు.

05/05/2018 - 01:33

న్యూఢిల్లీ, మే 4: భారత క్రికెట్ జట్టుతో అత్యధిక వేతనం అందుకుంటున్న క్రికెటర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రస్థానంలో ఉంటాడు. బీసీసీఐ అందిస్తున్న వేతనంతో పాటు యాడ్‌ల ద్వారా కోహ్లీ అందరికంటే ఎక్కువ డబ్బులు అర్జించాడు. ఇతర క్రికెటర్‌ల మాదిరి కాకుండా విరాట్ కోహ్లీ ప్రతీ సంవత్సరం రూ.150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

Pages