S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/05/2018 - 01:32

ఇండోర్, మే 4: ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

05/05/2018 - 01:30

హైదరాబాద్, మే 4: వెన్ను నొప్పితో బాదపడుతున్న భువనేశ్వర్ కుమర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి వెన్ను నొప్పితే బాదపడిన భువనేశ్వర్ రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతనికి తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని, శనివారం జరిగే మ్యాచ్‌కు భువీ సిద్దం కాగలడన్న నమ్మకం ఉందని కేన్ పేర్కోన్నాడు.

05/05/2018 - 01:46

హైదరాబాద్, మే 4: యువ ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీం బ్యాట్స్‌మెన్ జట్టును రంగంలో నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా శనివారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రస్తుతం ఐపిఎల్ నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించింది.

05/04/2018 - 01:20

న్యూయార్క్, మే 3: నల్లజాతికి చెందిన మాజీ టెన్నిస్ అంపైర్, యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్‌పై (యుఎస్‌టీఏ) ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. తనపై జాతివివక్ష చూపారని, నల్లజాతి వాడంటూ హేళన చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక దశలో సహచర అంపైర్ తనను ‘కోతి’ అంటూ హేళన చేశాడని కూడా అందులో పేర్కొన్నాడు.

05/04/2018 - 00:48

బెంగళూరు, మే 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్లుగా అవతరించిన తమ జట్టు ఇటీవల కాలంలో ఎదురైయ్యే వరుస ఓటములతో డీలా పడలేదని, పడి లేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంటామని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అన్నాడు.

05/04/2018 - 01:12

ఇండోర్, మే 3: డిఫెండింగ్ ఛాంపియన్లు ముంబయి ఇండియన్లకు శుక్రవారం కింగ్స్-11తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ఇది వారికి చావో రేవో అనదగ్గ మ్యాచ్. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.

05/04/2018 - 01:11

కోల్‌కతా, మే 3: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది.

05/04/2018 - 00:41

ముంబయి, మే 3: భారత పురుషుల హాకీ జట్టు తలరాతను మార్చేందుకు కోచ్ హరీందర్ సింగ్ అంత సమయం లేదని భారత పురుషుల హాకీ జట్టు మాజీ కోచ్ జాక్విమ్ కార్వెల్‌హో అన్నాడు. ఇటీవల కాలం వరకు మహిళల జట్టు కోచ్‌గా ఉన్న హరీందర్ సింగ్‌ను మళ్లీ పురుషుల జట్టు కోచ్‌గా మళ్లీ హరీందర్ సింగ్‌ను నియమించడాన్ని ఆయన స్వాగతించాడు.

05/04/2018 - 00:40

సిడ్నీ, మే 3: ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ కోచ్‌గా, క్రికెట్ ఆస్ట్రేలియా నియమించిన జస్టిన్ లాంగర్ (47)ను, తనకు ముందు కోచ్‌గా పనిచేసిన డర్రెన్ లెహ్‌మాన్‌కు పూర్తి భిన్నం. ఆస్ట్రేలియా జట్టుకోసం పూర్తి నిబద్ధతతో పనిచేసే నైజం ఇతని సొంతం. ఇప్పటికే బాల్ టాంపరింగ్ వ్యవహారంలో అప్రదిష్టపాలైన జట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి లాంగర్ మాత్రమే సమర్థుడు.

05/04/2018 - 01:14

దుబాయ్, మే 3: టీం ఇండియా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యాలను ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఎంపికచేసింది. ఈనెల 31వ తేదీన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనున్న టీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుతో వరల్డ్ ఎలెవన్ జట్టు తలపడునుంది.

Pages