S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/01/2017 - 01:18

విజయవాడ, అక్టోబర్ 31: యుజి, పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి జాతీయ పూల్‌లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సిఎం చంద్రబాబు అంగీకరించారు. దీనివల్ల తెలుగు విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

11/01/2017 - 01:09

అమరావతి, అక్టోబర్ 31: ఆస్ట్రేలియాలో ప్రధాన ఎల్‌ఎన్‌జి ఆపరేటరుగా ఉన్న ఉడ్‌సైడ్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఏపీలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కాకినాడ ఎల్‌ఎన్‌జి టెర్మినల్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం సచివాలయంలో సిఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియా బృందం, ప్రతిపాదనపై ఆసక్తిని ప్రదర్శించింది.

11/01/2017 - 01:08

అమరావతి, అక్టోబర్ 31: వచ్చే ఏడాది జూన్‌నాటికి ఐదు లక్షల ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాలు పూర్తిచేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే జనవరికి 2.5 లక్షలు, జూన్‌నాటికి 2.5 లక్షలు కలిపి 5 లక్షల ఇళ్లు పూర్తికావాలన్నారు. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారిని గుర్తించి జాబితాలు సిద్ధం చేయాలన్నారు. జనవరి 2019 నిర్దేశిత లక్ష్యం ప్రకారం అన్ని ఇళ్లు పూర్తికావాలన్నారు.

11/01/2017 - 00:25

శ్రీకాకుళం, అక్టోబర్ 31: ప్రపంచ అత్యున్నత అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితిలో 72వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భారతదేశం తరఫున హాజరయ్యారు.

11/01/2017 - 00:20

భీమవరం, అక్టోబర్ 31: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం పాఠశాలకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కాగా, గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి, బాలుడిని రక్షించారు. వివరాలిలావున్నాయి... పట్టణానికి చెందిన లచ్చన్నరావు తన కుమారుడు శ్యాంగౌతమ్‌ను మంగళవారం ఉదయం ఒక ప్రైవేటు పాఠశాలలో వదిలి, పనిలోకి వెళ్లాడు.

10/31/2017 - 03:20

కొత్తగూడెం, అక్టోబర్ 30: బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి యాజమాన్యం కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించిన సింగరేణి మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అంగీకరించారు.

10/31/2017 - 03:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.

10/31/2017 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 30: రానున్న రోజులు కృత్రిమ మేధస్సుదేనని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇటీవల మానవ రూప రోబోట్‌కు పౌరసత్వం ఇవ్వాలని సౌదీ అరేబియా నిర్ణయించడం అంతర్జాతీయంగా ప్రముఖ శీర్షికగా మారిందని దాంతో రానున్న యుగం కృత్రిమ మేదస్సుదేనని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.

10/31/2017 - 02:57

హైదరాబాద్, అక్టోబర్ 30: రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. సోమవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తామని, నవంబర్ 6 నుండి 9 వరకూ జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

10/31/2017 - 02:52

హైదరాబాద్, అక్టోబర్ 30: నేరాల అదుపు, నేరస్థులను పట్టుకోవడంలో కీలకమైన క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కు సిస్టం పనితీరు చాలా మెరుగ్గా ఉందని సిసిటిఎన్‌ఎస్ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ప్రశంసించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులకో సిసిటిఎన్‌ఎస్ ప్రాజెక్టు అభివృద్ధిపై సమీక్షించారు.

Pages