S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2017 - 08:17

హైదరాబాద్/ఘట్‌కేసర్, జనవరి 21: దేశంలో సాంకేతిక రంగాన్ని మరింత పెంపొందించి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎంపి వరుణ్‌గాంధీ అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

01/22/2017 - 07:45

హైదరాబాద్, జనవరి 21: ఉమ్మడి హైకోర్టు పరిథిలో ఏడుగురు జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పి. సుధ, నాంపల్లి కోర్టు ఎంఎస్‌జెగా జి. రాధారాణి, సిటీ స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా జి. ఉదయగౌడ్, తెలంగాణ వ్యాట్ అప్పీల్లేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా ఎంవి రమణ నాయుడు, ఎపి జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పి.

01/22/2017 - 05:28

హైదరాబాద్, జనవరి 21: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, డైరెక్టరేట్ ఉద్యోగులను పెద్ద అవరోధాలు లేకుండా రెండున్నరేళ్ల కాలంలో సాఫీగా విభజించిన కమల్ నాథన్ కమిటీ రికార్డులను డాక్యుమెంటేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర హోం శాఖ కోరింది.

01/22/2017 - 05:26

హైదరాబాద్, జనవరి 21: మిషన్ భగీరథకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,816 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సాగునీటి సరఫరా కార్పొరేషన్‌తో ఆ బ్యాంకు శనివారం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీశైలం-వికారాబాద్-చేవెళ్ల-తాండూరు-పరిగి, శ్రీశైలం-గుడిపల్లి సెగ్మెంట్ పనుల కోసం ఈ నిధులు వెచ్చిస్తారు.

01/22/2017 - 05:25

హైదరాబాద్, జనవరి 21: ఏపి రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉప కార్యదర్శి ఖాదిర్ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీకి పెరోల్ పొడిగించేందుకు తిరస్కరిస్తూ హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

01/22/2017 - 05:25

హైదరాబాద్, జనవరి 21: జల్లికట్టు క్రీడను కాపాడుకునేందుకు తమిళ యువత సాగించిన పోరాటం నిరుపమానమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కొనియాడారు. తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకునేందుకు మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా తమిళులు ప్రదర్శించిన సాహసాన్ని ఆయన అభినందించారు.

01/21/2017 - 05:14

నల్లగొండ, జనవరి 20: పులిచింతల ప్రాజెక్టులో కనీస నీటిమట్టం మేరకు జలాలు ఉండేలా చూడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఆ ప్రాజెక్టులో కనీసమట్టం మేరకు నీరు లేకపోతే తెలంగాణ పరిధిలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయవు. అందువల్ల ఈ ప్రాంత పరిథిలోని ఆయకట్టు రైతులు పంటలు నష్టపోతున్నారు.

01/21/2017 - 04:07

భద్రాచలం, జనవరి 20: తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి అసలైన ప్రత్యామ్నాయం మేమే... ఒంటరిగానే పోటీ చేసి 2019లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటాం... అంటూ దక్షిణ అయోధ్య భద్రాచలం కేంద్రంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్రంలో కొత్తగా 2132 కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపినందున ఈ పనులు వేగంగా జరిగేట్టు చూడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు.

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించాల్సిన ఎడ్‌సెట్-2017ను తాత్కాలికంగా సుప్తచేతనావస్థలో ఉంచినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఎడ్‌సెట్-2016 ప్రక్రియ పూర్తికాకుండానే ఎడ్‌సెట్-2017 నిర్వహించడంపై ఆంధ్రభూమి ప్రచురించిన వార్తాకథనానికి అధికారులు స్పందించారు.

Pages