S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/30/2017 - 04:37

విశాఖపట్నం, అక్టోబర్ 29: రైల్వేబోర్డు ఆదేశాల మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నవంబర్ 1నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో భారీ మార్పులు చేపట్టింది. 56 రైళ్లకు సంబంధించి 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లుండగా, మరో 19 లోకల్ పాసింజర్ రైళ్లున్నాయి. ఇప్పటి వరకు అమలయ్యే వేళల్లో మార్పులు చేస్తూ వీటిని షెడ్యూల్ కంటే ముందుగా బయలుదేరేలా నిర్ణయం తీసుకున్నారు.

10/30/2017 - 04:17

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ తెలుగు దేశం పార్టీలో రేవంత్ రెడ్డి దుమారం కొనసాగుతున్నది. రేవంత్ వెనకాలే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలూ వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సోమవారం ఉద యం నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

10/30/2017 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 29: సినీ నటుడు శివబాలాజీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గిట్టని కొంతమంది యూ ట్యూబ్‌లో అసభ్యకర మెస్సేజ్‌లు, అశ్లీల వీడియోలు పెడుతున్నారంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఐపిని గుర్తించామని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

10/30/2017 - 03:14

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్-రాష్టస్థ్రాయి ఉత్సవంలో 125 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. హయత్‌నగర్‌లోని క్యాండర్ శ్రైన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి తెలంగాణలోని వేర్వేరు జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ అకడమిక్ కమిటీ సభ్యురాలు గీతాస్వామినాథన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

10/30/2017 - 03:13

బొమ్మల రామారం, అక్టోబర్ 29: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని పెద్దపర్వతాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోగల దివ్య రిసార్ట్స్‌లో నీటిని నిల్వచేసేందుకు ఏర్పాటు చేసిన కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. భువనగిరి జోన్ ఎసిపి సాదుమోహన్‌రెడ్డి కథనం ప్రకారం...

10/30/2017 - 03:12

హైదరాబాద్, అక్టోబర్ 29: రానున్న శబరిమల యాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ గమ్య స్థానాల నుంచి శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లన్నింటికి ఈ నెల 30 నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్‌ను చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ రైళ్లన్నీ స్పెషల్ ఫేర్ తత్కాల్ సర్వీస్‌గా నడుపుబడుతున్నట్లు తెలిపింది.

10/30/2017 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 29: గుండె వ్యాధులు రాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ నిరోధిస్తుందని, సాధారణ నూనెల కంటే వంటల్లో రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఉపయోగించాలని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ జి రమేష్ తెలిపారు. దీనిలో సమతుల్యమైన రీతిలో ఎస్‌ఎఫ్‌ఏ, పియుఎఫ్‌ఏ, ఎంయుఎఫ్‌ఏ ప్రొఫైల్ ఉందన్నారు. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒరైజనాల్ సమృద్ధిగా ఉన్నాయన్నారు.

10/30/2017 - 02:29

హైదరాబాద్, అక్టోబర్ 29: ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు ఉద్యమకారుడు అట్లూరి పూర్ణ చంద్రరావు(92) కన్నుమూశారు. గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటి సావిత్రితో దర్శకత్వం చేయించి ‘మాతృదేవత’ చిత్రాన్ని తీశారాయన. పూర్ణ చంద్రరావుకు భార్య మరుద్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

10/30/2017 - 01:48

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో గోదావరి జలాలను పెద్ద ఎత్తున వినియోగించేందుకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని కేంద్ర జలవనరుల శాఖ అంగీకరించి రాజముద్రవేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఊరట చెందింది.

10/30/2017 - 01:46

కొడంగల్, అక్టోబర్ 29: ‘కెసిఆర్‌ను గద్దె దింపేందుకు అసలైన ఆట ఇప్పుడే ప్రారంభమైంది..’ అని టి.టిడిపికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించటంతో కొడంగల్ ప్రజలు ఈలలు వేస్తూ కరతాళధ్వనులు చేశారు. శనివారం విజయవాడలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖలను అందజేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు.

Pages